E-Paper
Advertisement

జర్మనీతో రూ. 70 వేల కోట్ల సబ్‌మెరైన్ ఒప్పందం.. ప్రత్యేకతలు ఇవే!

జర్మనీతో రూ. 70 వేల కోట్ల సబ్‌మెరైన్ ఒప్పందం.. ప్రత్యేకతలు ఇవే!
Advertisement

Project 75: భారత నౌకాదళానికి మరింత బలం చేకూరబోతోంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ 75 మళ్లీ కదులుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నేవీ కోసం ఆరు అత్యాధునిక సబ్‌మెరైన్లు నిర్మించనున్నారు. వీటి విలువ దాదాపు 70 వేల కోట్లు. ముంబైలోని మజగాన్ డాక్‌లో వీటి నిర్మాణం జరగనుండగా.. జర్మనీకి చెందిన TKMS టెక్నికల్ పార్ట్‌నర్‌గా వ్యవహరించనుంది.

ఇన్నాళ్లూ ఈ డీల్ ఎందుకు ఆగిపోయింది..?

Advertisement

ఇన్నాళ్లూ ఈ డీల్ ఎందుకు ఆగిపోయింది.. అంటే ధర, టెక్నాలజీ వంటి అంశాలపై భారత్, జర్మనీ మధ్య చాలాకాలంగా చర్చలు సాగాయి. పలుమార్లు బ్రేక్‌లు పడ్డాయి. ఇప్పుడు ఈ ప్రతిపాదన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ గ్రీన్ సిగ్నల్ వస్తే.. డీల్‌కు లైన్ క్లియర్ అయినట్టే. ఆ తర్వాత ఒప్పందం.. నిర్మాణం మొదలుపెడుతారు.

సబ్‌మెరైన్లలో మరో స్పెషల్ ఏంటంటే?

Advertisement

ఈ సబ్‌మెరైన్లలో మరో స్పెషల్ ఏంటంటే… ఎయిర్ ఇండిపెండెంటెంట్ ప్రొపల్షన్ అదే AIP టెక్నాలజీ. సాధారణ సబ్‌మెరైన్లతో పోలిస్తే… దీనివల్ల ఎక్కువసేపు నీటిలోనే ఉండొచ్చు. అంటే పైకి రాకుండానే ఎక్కువ దూరం ప్రయాణం.. శత్రువుకు తెలియకుండా నిఘా.. అవసరమైతే దాడి చేసే సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఇప్పటికే భారత నేవీ సంప్రదాయ సబ్‌మెరైన్ల కొరతను ఎదుర్కొంటోంది. మరోవైపు హిందూ మహాసముద్రంలో చైనా సబ్‌మెరైన్ల కదలికలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఆరు కొత్త సబ్‌మెరైన్లు అందుబాటులోకి వస్తే.. సముద్రంలో భారత్ నిఘా, రక్షణ సామర్థ్యం మరింత బలపడుతుంది.

సబ్‌మెరైన్లు డిజైన్ చేసే స్థాయికి..

అయితే ప్రాజెక్ట్ 75 అంటే.. కేవలం ఆరు సబ్‌మెరైన్లు తెచ్చుకోవడం కాదు. సబ్‌మెరైన్లు భారత్‌లోనే నిర్మించడం.. టెక్నాలజీని ఇక్కడే నేర్చుకోవడం.. వాటి మెయింటెనెన్స్, అప్‌గ్రేడ్‌ను దేశీయంగానే చేయడం.. ఇదే అసలు టార్గెట్. భవిష్యత్తులో సొంతంగా అత్యాధునిక సబ్‌మెరైన్లు డిజైన్ చేసే స్థాయికి చేరుకోవడమే పెద్ద లక్ష్యం.

జర్మనీతో భారత్‌కు సబ్‌మెరైన్ సంబంధాలు..

జర్మనీతో భారత్‌కు సబ్‌మెరైన్ సంబంధాలు కొత్తేమీ కాదు. జర్మన్ టెక్నాలజీతో రూపొందిన షిషుమార్ క్లాస్ సబ్‌మెరైన్లు దశాబ్దాలుగా భారత నేవీలో సేవలందిస్తున్నాయి. ఇప్పుడు అదే స్నేహం… మరింత అధునాతన టెక్నాలజీతో మరో అడుగు ముందుకు వేయబోతోంది.

Also Read: మోదీ జీ.. మీ ఎన్టీఏ ఏం చేసిందో చూడండి! – రాహుల్ గాంధీ

Tags

Related News

బొగ్గు తవ్వకం లేకుండానే నేరుగా గ్యాస్.. బెల్లంపల్లిలో సింగరేణి సరికొత్త ప్రయోగం!

బాబోయ్.. ఆ ముగ్గురు మంత్రులను తట్టుకోలేం.. వాపోతున్న అధికారులు!

కేబీఆర్ పార్కు చుట్టూ ప్రయాణించే వారికి బిగ్ అలర్ట్: సీపీ సజ్జనార్!

రైతు డిస్కం ఏర్పాటు పై బిగ్ అప్డేట్.. హైలెవల్ కమిటీతో సీఎం రేవంత్ బిగ్ ప్లాన్!

ఉత్తర తెలంగాణలో పొలిటికల్ హీట్.. బీజేపీ, కాంగ్రెస్‌లకు షాక్ ఇచ్చేలా బీఆర్ఎస్ బిగ్ స్కెచ్!

నా బాట ముళ్ల‌బాట‌.. అది బీసీల కోసం నేనెంచుకున్న మార్గం.. 50శాతం రిజ‌ర్వేష‌న్ల సాధ‌నే జీవిత ల‌క్ష్యం.. !

ఎవరీ దిమాగీ నక్సల్స్.. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×