E-Paper
Advertisement

ఇంట్లోనే పర్ఫెక్ట్ పిజ్జా, కేక్స్ కోసం.. టాప్-5 స్మార్ట్ మైక్రోవేవ్ ఓవెన్స్

ఇంట్లోనే పర్ఫెక్ట్ పిజ్జా, కేక్స్ కోసం.. టాప్-5 స్మార్ట్ మైక్రోవేవ్ ఓవెన్స్
Advertisement

best smart microwave oven for baking: మారుతున్న లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా మన కిచెన్ కూడా స్మార్ట్ అవుతోంది. ప్రస్తుతం రెస్టారెంట్ స్టైల్ పిజ్జాలు, స్పాంజీ లాంటి కేక్స్ బయట నుంచి తెప్పించుకోవడం కంటే ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా బేకింగ్, రోస్టింగ్ , గ్రిల్లింగ్ చేయగల కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్స్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న, అత్యంత ఉపయోగకరమైన టాప్ 5 బ్రాండ్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.IFB 30L Convection – 30BRC2:

ఇండియన్ కిచెన్లలో అత్యధికంగా ఆదరణ పొందిన బ్రాండ్లలో ఐఎఫ్‌బీ ముందుంటుంది. ఈ 30 లీటర్ల మోడల్.. పెద్ద కుటుంబాలకు పర్ఫెక్ట్ గా సరి పోతుంది. ఇందులో కేక్స్ ఫ్లఫీగా రావడానికి, పిజ్జా బేస్ క్రిస్పీగా తయారవడానికి ప్రత్యేకమైన ఆటో-కుక్ మెనూలు ఉన్నాయి. స్టెయిన్‌లెస్ స్టీల్ కేవిటీ ఉండటం వల్ల దీనిని శుభ్రం చేయడం చాలా ఈజీ. అంతే కాకుండా  ఇది ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఉంటుంది.

2.LG 32L Charcoal Convection:

Advertisement

స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఎల్జీ బ్రాండ్ బెస్ట్ ఛాయిస్. ఇది చార్కోల్ లైటింగ్ హీటర్ టెక్నాలజీతో వస్తుంది. దీని వల్ల ఆహారం లోపల.. జ్యూసీగా, బయట కరకరలాడుతూ.. కాలుతుంది. పిజ్జా తయారీలో ఇది అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే హెల్థ్ ఫ్రై ఆప్షన్ నూనె లేకుండా వంటకాలు చేసుకోవడానికి సహకరిస్తుంది.

3.Panasonic Convection Series:

తక్కువ జాగా ఉండే వంట గది కోసం పానాసోనిక్ ‘మైక్రో చెఫ్’ సిరీస్ చక్కటి ఎంపిక. కాంపాక్ట్ సైజులో.. లభించే ఈ ఓవెన్, కేక్స్ బేకింగ్ లో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దీనిలో ఉండే 360-డిగ్రీ హీట్ రాప్ టెక్నాలజీ ఆహారాన్ని సమానంగా వేడి చేస్తుంది.

4.Samsung 28L Convection:

Advertisement

టెక్నాలజీ పరంగా ..శామ్‌సంగ్ ఓవెన్లు చాలా ముందున్నాయి. దీని లోని సిరామిక్ ఎనామెల్ కేవిటీ స్క్రాచ్-ఫ్రీగా ఉండటంతో.. పాటు బ్యాక్టీరియాను నివారిస్తుంది. పిజ్జా లవర్స్ కోసం ప్రత్యేకమైన ప్రీ-సెట్ మోడ్స్ ఇందులో లభిస్తాయి. అలాగే పవర్ డిఫ్రాస్ట్ ఫీచర్ వంట సమయాన్ని తగ్గిస్తుంది.

5.Godrej 30L Convection:

బడ్జెట్ ధరలో.. బెస్ట్ ఫీచర్లు కోరుకునే.. వారికి గోద్రెజ్ ఓవెన్ మంచి ప్రత్యామ్నాయం. మల్టీ-డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా.. ఆహారం అన్ని వైపులా సమానంగా వేడెక్కుతుంది. కేక్స్, కుకీస్, పిజ్జాలను.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరి సహాయం లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు.

మీ కుటుంబ సభ్యుల అవసరాలు, వంట గది స్థలాన్ని బట్టి సరైన కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ను ఎంచుకోవడం ద్వారా రోజు వారీ వంట ప్రక్రియను చాలా ఆనందంగా, ఈజీగా మార్చుకోవచ్చు.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×