BigTV English

Gold In India: భారతీయ మహిళల వద్ద ఇంత బంగారమా.. ఎంతో తెలిస్తే షాకే..?

Gold In India: భారతీయ మహిళల వద్ద ఇంత బంగారమా.. ఎంతో తెలిస్తే షాకే..?

Gold In India: బంగారం.. ప్రపంచంలో అత్యంత విలువైన లోహం. ఈ బంగారం ఎవరి దగ్గర ఎక్కువుంటే వాళ్లదే పైచేయి. ఈ మధ్య కాలంలో భారతదేశం భారీగా బంగారాన్ని కొనుగోలు చేసింది. బంగారం వాడకంలో భారతదేశం ముందుంది. బంగారం నిల్వలున్న దేశాల్లో భారత్ టాప్ 10లో ఉంది. అయితే, మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే… భారతదేశంలోని ఇళ్ళల్లో అంతకుమించిన బంగారం ఉందట. వేల టన్నుల బంగారం మన గృహాల్లోనే ఉన్నట్లు అంచనాలున్నాయి. దీని అసలు లెక్కలు వింటే నోరెళ్లబెట్టాల్సిందే.. మరి!


భారతదేశంలో బంగారం ఉండని ఇల్లు ఉందంటే నమ్మడం కష్టం. క్లాస్‌తో సంబంధం లేకుండా ఎంతో కొంత కనకం కొనడం మనోళ్లకున్న వారసత్వ సంపద. అందుకే, భారతదేశంలో బంగారంతో అనుబంధం శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ, ఈ లోహానికి మతపరమైన, ఆర్థిక కోణం నుండి ప్రాముఖ్యత ఉంది. అంతకుమించి, భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం కూడా. ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడంలో ముందు వరసలో ఉంటారు. బంగారం అంటే చాలా మందికి ఇష్టం అయితే… ఇక్కడ చాలా మందికి అదొక వ్యసనం కూడా. అయితే, ఇటీవల మరింత ఖరీదైన ధర కారణంగా, దానిని కొనడం అందరికీ అంత ఈజీ కాదు. అయినప్పటికీ, ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశాల్లో భారత్ టాప్‌లో ఉండటం విశేషం. అందుకే, భారత్‌ను ఒకప్పుడు “సోనే కి చిడియా” అని పిలిచేవారు. అయితే, మొఘల్ ఆక్రమణదారులు, బ్రిటిష్ వారు భారతదేశాన్ని భారీగా దోచుకున్నారు. అందులో భారీ మొత్తంలో బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు. అయినా కానీ, నేటికీ బంగారాన్ని కాపాడుకోవడంలో భారతదేశం సోనే కి చిడియాలానే ఉంది.

ఇటీవల వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించిన నివేదిక ప్రకారం.. భారతీయ మహిళల వద్ద దాదాపు 22,000 టన్నుల బంగారం ఉంది. దాని విలువ దాదాపు 1 ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు 100 లక్షల కోట్లకు పైమాటే! భారతీయ మహిళల వద్ద ఇంత మొత్తంలో బంగారం ఉండటం ప్రపంచంలోనే అత్యధికం. ఎందుకంటే, ప్రపంచంలోని టాప్ 5 బ్యాంకుల్లో కూడా ఇంత బంగారం నిల్వలు లేవంట. ఇక, ఇది భారతదేశం 26 సంవత్సరాల కాలంలో ఆభరణాలు, కడ్డీలు, నాణేలను తయారు చేయడానికి దిగుమతి చేసుకున్న బంగారంతో సమానం. అయితే, ఎటూ కదలకుండా మగ్గుతున్న ఈ బంగారాన్ని రన్నింగ్‌లో పెట్టడానికి, దిగుమతులను తగ్గించడంలో సహాయపడటానికి… గోల్డ్ ట్రేడ్ సంస్థలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. రాబోయే బడ్జెట్‌లో బంగారు డిపాజిట్లకు అనువైన కాలపరిమితి, అధిక వడ్డీ రేట్లు అందించడం ద్వారా ఇంట్లో దాక్కున్న గోల్డ్ బయటపడుతుందని అంటున్నారు. అలాగే, ఈ పథకం కింద… బ్యాంకుల్లో 500 గ్రాముల పూర్వీకుల బంగారు డిపాజిట్లకు పన్ను విచారణలు ఉండవని డిపాజిటర్లకు హామీ ఇస్తే ఇవి బటకొస్తాయని సూచించారు. దీని ద్వారా బంగారు ద్రవ్యీకరణ పథకం (GMS) లాభదాయకంగా ఉండేలా రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.


అయితే, 2024 మొదటి 11 నెలల్లో భారతదేశం బంగారం దిగుమతులపై రికార్డు స్థాయిలో $47 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది 2023లో బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరగడం వల్ల ఖర్చు చేసిన $42.6 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అయితే, లాకర్లలో ఉన్న నిష్క్రియ బంగారాన్ని బయటకు తీసుకురాడానికి కస్టమర్లను ఒప్పించాలని నిపుణులు అంటున్నారు. దీనికి, గుర్తింపు పొందిన, ప్రసిద్ధ రిటైల్ ఆభరణాల వ్యాపారుల భాగస్వామ్యం కోరుతున్నారు. దీన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం GMSని సవరించాలని అంటున్నారు. ఇప్పటికే, భారతదేశం 800-850 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. నిపుణులు అభిప్రాయం ప్రకారం… 22 వేల టన్నుల బంగారాన్ని సమీకరించే సామర్థ్యం ఉన్నప్పటికీ… విధానపరమైన, విశ్వసనీయ సమస్యల కారణంగా GMS భాగస్వామ్యం తక్కువగా ఉందని అంటున్నారు. అందుకే, భారత నివాశితుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి 500 గ్రాముల వరకు పూర్వీకుల బంగారు డిపాజిట్లను పన్ను విచారణల నుండి మినహాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు.

 Also Read: Israel Hamas War: ఆ దేశాలపై డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. ఇక వారం రోజుల్లో..?

అయితే, విభిన్న డిపాజిటర్ల అవసరాలను తీర్చడానికి బ్యాంకులు సౌకర్యవంతమైన కాలపరిమితిని అందించాలని అంటున్నారు. ప్రస్తుత నియమాల ప్రకారం… ఒకేసారి కనీసం 10 గ్రాముల ముడి బంగారాన్నీ… అంటే, బంగారు కడ్డీలు, నాణేలు, రాళ్ళు, బంగారు ఆభరణాలను డిపాజిట్ చేయడానికి అనుమతి ఉంటుంది. ఈ పథకం కింద డిపాజిట్ చేయడానికి గరిష్ట పరిమితి కూడా లేదు. అలాగే, ఈ పథకం స్వల్పకాలిక.. అంటే, ఒకటి నుండి మూడు సంవత్సరాలు…, మధ్యకాలిక.. అంటే, ఐదు నుండి ఏడు సంవత్సరాలు… చివరిగా, దీర్ఘకాలిక.. అంటే, 12 నుండి 15 సంవత్సరాలు డిపాజిట్లను అనుమతిస్తుంది. అయితే, మధ్యకాలిక, దీర్ఘకాలిక డిపాజిట్లలో 5 నుండి 7 సంవత్సరాల డిపాజిట్లకు 2.25%… 12 నుండి 15 సంవత్సరాల డిపాజిట్లకు 2.5% వడ్డీని ఆకర్షిస్తుండగా… స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీని సంబంధిత బ్యాంకు నిర్ణయిస్తుంది. దీని వల్ల, బంగారం రోటేషన్లలో ఇబ్బందులు ఎదురౌతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీని దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×