Jasprit Bumrah: భారత సూపర్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2022 – 23 సంవత్సరాలలో కఠినమైన కాలాన్ని ఎదుర్కొన్నాడు. బుమ్రాని నిరంతర గాయాలు వెంటాడాయి. అయితే గాయం నుండి తిరిగి వచ్చినప్పటినుండి బుమ్రా పూర్తిగా భిన్నమైన స్థాయిలో అతని ప్రదర్శనని కొనసాగిస్తున్నాడు. తాజాగా ముగిసిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన బుమ్రా {Jasprit Bumrah} 2024 డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికయ్యాడు.
Also Read: Klaasen Six: క్లాసెన్ కొట్టిన భారీ సిక్స్.. బంతిని ఎత్తుకెళ్లిన అభిమాని.. వీడియో వైరల్!
తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డిసెంబర్ నెలకు గాను మంగళవారం ప్రకటించిన ఫలితాలలో పురుషుల విభాగంలో బుమ్రా {Jasprit Bumrah} ఈ అవార్డుని గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ని వెనక్కి నెట్టి బుమ్రా.. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకున్నాడు. డిసెంబర్ లో ఆస్ట్రేలియా పై మూడు టెస్టుల్లో 14.22 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. నాలుగో టెస్ట్, ఐదో టెస్టుల్లో మరో 10 వికెట్లు తీశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో బుమ్రా మొత్తం 32 వికెట్లు పడగొట్టాడు. కానీ మరోసారి గాయం కారణంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్ట్ కి అతడు {Jasprit Bumrah} బౌలింగ్ చేయలేదు. మొత్తంగా తొమ్మిది ఇన్నింగ్స్ లలో 32 వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికయ్యాడు. అంతేకాదు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని ఐదు టెస్టుల సిరీస్ లో బుమ్రా 200 టెస్ట్ వికెట్లు కూడా పూర్తి చేశాడు.
బంతుల పరంగా ఈ మైలురాయిని చేరుకున్న నాలుగవ ఫాస్ట్ బౌలర్ గా {Jasprit Bumrah} బుమ్రా నిలిచాడు. తన కెరీర్ లో 44వ టెస్ట్ ఆడిన బుమ్రా కేవలం 8484 బంతుల్లోనే 200 వికెట్ల మార్క్ ని అందుకున్నాడు. ఈ లిస్టులో పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 7,725 బంతులలో 200 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు.
Also Read: Olympic Medal Rust: తుప్పు పట్టిన ఒలింపిక్స్ పతకాలు.. అథ్లెట్లకు అదిరిపోయే న్యూస్ !
అలాగే 20 కంటే తక్కువ సగటుతో 200 టెస్ట్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా నిలిచాడు {Jasprit Bumrah} బుమ్రా. ఇక మహిళల క్రికెట్ లో ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్ల్యాండ్ ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకుంది. భారత్, న్యూజిలాండ్ లతో జరిగిన సిరీస్ లలో అద్భుత ప్రదర్శన చేసింది అన్నాబెల్ సదర్ల్యాండ్. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకుంది.
Indians to win ICC Player of the Month award:
– Shreyas Iyer in February 2022
– Virat Kohli in October 2022– Shubman Gill in January 2023
– Shubman Gill in September 2023– Yashasvi Jaiswal in February 2024
– Jasprit Bumrah in June 2024
– Jasprit Bumrah in December 2024* pic.twitter.com/hrKOf8ormc— All Cricket Records (@Cric_records45) January 14, 2025