Kiccha Sudeep:ప్రముఖ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) తెలుగు వారికి కూడా బాగా సుపరిచితుడే. ముఖ్యంగా 2102 లో రాజమౌళి(Rajamouli )దర్శకత్వంలో నాని(Nani ) సమంత (Samantha) కాంబినేషన్లో వచ్చిన ‘ఈగ’ సినిమా ద్వారా విలన్ గా తెలుగు తెరకు పరిచయమై.. తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన, తాజాగా రిటైర్మెంట్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. గత 28 ఏళ్లుగా కన్నడ ఇండస్ట్రీలో స్టార్డం కొనసాగిస్తున్న ఈయన , కేవలం కన్నడ లోనే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక అలా కన్నడ స్టార్ గా ఎదిగిన ఈయన, తన సినిమా జర్నీని హీరోగానే ఆపేస్తాను అని హింట్ ఇచ్చాడు.
ఇండస్ట్రీకి దూరం ఉంటున్న కిచ్చా సుదీప్..
అయితే జర్నీని సడన్ గా ఆపేయడానికి తాను ఇంకా అలసిపోలేదని, కానీ ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో యాక్టింగ్ ఆపేస్తానని చెప్పి అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించారు. నిజానికి ఎంత స్టార్ అయినా కూడా ఏదో ఒక సందర్భంలో బోర్ కొట్టేస్తారు. ప్రతిదానికి కూడా ఒక టైం అనేది ఉంటుంది. ఇన్నేళ్ల కెరియర్ లో ఒక హీరోగా తాను ఎప్పుడు ఎవరిని సెట్లో వెయిట్ చేయించలేదని, కానీ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మరొకరి కోసం వెయిట్ చేస్తూ కూర్చోలేనని కూడా తెలిపారు సుదీప్. అంతేకాదు ఇకపై బ్రదర్, అంకుల్ లాంటి పాత్రలు పోషించడం ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే కచ్చితంగా తాను హీరో గానే రిటైర్మెంట్ తీసుకుంటానని తెలిపారు.
శోభన్ బాబును గుర్తు చేసుకుంటున్న ఆడియన్స్..
ఇక ఈ విషయం తెలిసి తెలుగు ఆడియన్స్ మరో శోభన్ బాబు (Shobhan Babu) కాబోతున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే శోభన్ బాబు తెలుగు ఆడియన్స్ లో సోగ్గాడిగా భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా ఆయన హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారని చెప్పవచ్చు. ఇకపోతే ఇలాంటి ఈయనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వస్తే, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తను ఎప్పుడు శోభన్ బాబు సోగ్గాడి గానే నిలిచిపోవాలని, అందుకే తాను క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయనని గతంలో చెప్పారు. అలా ఆయన దగ్గరకు ఎన్నో సినిమాలు వచ్చినా.. ఆయన రిజెక్ట్ చేశారు. చివరికి హీరో గానే ఉంటూ ఇండస్ట్రీకి దూరమై.. ఆ తర్వాత పరమపదించారు. ఇప్పుడు ఆయన దారిలోనే కిచ్చా సుదీప్ కూడా నడుస్తున్నారేమో అంటూ తెలుగు ఆడియన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ఇండస్ట్రీని మాత్రం వదిలిపెట్టను..
ఇకపోతే ఈ మధ్యకాలంలో తాను రిజెక్ట్ చేసిన ప్రాజెక్టుల గురించి కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా నేను కొన్ని కథలు నచ్చక రిజెక్ట్ చేయలేదు. ఈ టైంలో వాటిని చేయడం కరెక్ట్ కాదని నేను ఆ సినిమాలు చేయలేదు. నటనకు దూరమైనా.. ఇండస్ట్రీకి మాత్రం నేను దూరం కాను. హీరోగా పాత్రలు రానప్పుడు ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా మారి సినిమాలు చేస్తాను. అంటూ సుదీప్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా సుదీప్ ప్రేక్షకులను ఒక్క మాటతో షాక్ కి గురిచేసారని చెప్పవచ్చు.