BigTV English

Indian Missile Akash: శత్రువులకు అంతు చిక్కని టెక్నాలజీ.. ఆకాశంలో గర్జిస్తున్న ఆకాశ్

Indian Missile Akash: శత్రువులకు అంతు చిక్కని టెక్నాలజీ.. ఆకాశంలో గర్జిస్తున్న ఆకాశ్

Indian Missile Akash: అమెరికానే ఆశ్చర్యపరిచిన టెక్నాలజీ! పాక్, చైనా రాడార్లకు అసలే అంతుచిక్కని మిసైల్! భారత రక్షణ వ్యవస్థలో ఇప్పుడున్న శక్తిమంతమైన వెపన్.. ఆకాశ్ మిసైల్. స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఈ అడ్వాన్స్‌డ్ మిసైల్.. ఆపరేషన్ సిందూర్‌లో గర్జించిన తీరు ప్రపంచ దేశాలను నివ్వెరపోయేలా చేసింది. ఇండియా దగ్గర ఇంత ఖతర్నాక్ టెక్నాలజీ ఉందా? అని.. అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. పాక్ ఏరియల్ ఎటాక్స్‌ని.. సమర్థవంతంగా తిప్పికొట్టిన ఈ స్వదేశీ మిసైల్‌ స్పెషాలిటీ ఏంటి? అమెరికా విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయేలా అంతలా ఏముంది?


లైటర్.. స్మార్టర్.. ఫాస్టర్.. డిస్ట్రాయర్..

దాయాదికి దడ పుట్టించిన మన మిసైల్


ఆకాశంలో గర్జిస్తున్న ఆకాశ్ మిసైళ్లు

ఆకాశ్.. ఇప్పుడు వరల్డ్ వైడ్ రీసౌండ్‌లో వినిపిస్తున్న మిసైల్. ఆపరేషన్ సిందూర్‌లో.. పాకిస్తాన్‌పై భారత్ ప్రయోగించిన అత్యంత పవర్‌ఫుల్ మిసైల్ సిస్టమ్ ఇది. శత్రుదేశం గుండెల్లో దడ పుట్టించడమే కాదు.. ప్రపంచ రక్షణ రంగ నిపుణులను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. మన మిసైల్ ప్రపంచ నివ్వెరపోయేలా ప్రతాపం చూపించింది. అందుకే.. గ్లోబ్ మొత్తం ఇప్పుడు దీని మీదే డిబేట్ నడుస్తోంది. పూర్తిగా.. భారత స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఆకాశ్ మిసైల్ సిస్టమ్.. అమెరికా విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరిచింది.

అమెరికా స్టెల్త్ డ్రోన్ కెపాసిటీని ఆకాశ్ అధిగమించే ఛాన్స్

వీటి పనితీరు చూసి.. ఇందులో వాడిని టెక్నాలజీ గురించి తెలిసి.. వరల్డ్ మొత్తం షాక్ అయింది. ఎందుకంటే.. మన ఆకాశ్ మిసైల్స్.. పాక్, చైనా రాడార్లకు కూడా దొరకుండా వెళ్లి.. పాకిస్తాన్‌లోని టార్గెట్లను ఛేదించాయ్. ఆకాశ్ మిసైల్ సిస్టమ్ కెపాసిటీ ఏమిటో తెలిశాక.. రక్షణరంగ నిపుణులు, విశ్లేషకులు.. అమెరికా స్టెల్త్ డ్రోన్ కెపాసిటీని కూడా ఆకాశ్ అధిగమించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది.. ఇండియా డిఫెన్స్ టెక్నాలజీని తక్కువ అంచనా వేసిన వాళ్లందరికీ.. ఊహించని షాక్ ఇచ్చింది.

డీఆర్డీవో, బీఈఎల్, ఇస్రో సమన్వయంతో మిసైల్ అభివృద్ధి

డీఆర్డీవో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇస్రో సమన్వయంతో.. ఆకాశ్ మిసైల్స్‌ సిస్టమ్‌ని డెవలప్ చేశారు. వీటి నెక్ట్స్ జనరేషన్.. రియల్ టైమ్ టార్గెటింగ్, ఇంటర్‌సెప్షన్ సిస్టమ్‌తో ఉన్నాయి. ఆకాశ్ అంటే కేవలం ఓ మిసైల్ మాత్రమే కాదు. సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్. ఇది.. శాటిలైట్లు, డ్రోన్లు, గ్రౌండ్ రాడార్‌లు, మొబైల్ వార్ రూమ్, సెల్ఫ్ అప్‌డేటింగ్ ఏఐ ప్రాసెసర్లు, ఆటో స్ట్రైకింగ్ డిఫెన్సివ్ క్లౌడ్‌ని.. ఒక చోట కలిపే మెగా డిఫెన్స్ సిస్టమ్. ఆకాశ్ మిసైల్స్.. ఇస్రో కార్టోశాట్, రిసాట్ నుంచి లైవ్ శాటిలైట్ నిఘా సమాచారాన్ని కూడా సేకరిస్తుంది. భారత నావిక్ జీపీఎస్ కాన్‌స్టెలేషన్‌ని ఉపయోగించి.. కచ్చితమైన నావిగేషన్‌తో టార్గెట్‌ని కూలుస్తుంది.

ఆకాశ్‌తో సెకన్లలోనే టార్గెట్లని సెలక్ట్ చేసుకోవచ్చు

ఇది రియల్ టైమ్ ట్రాకింగ్‌తో.. టార్గెట్‌ని ఎంతో కచ్చితత్వంతో ఛేదిస్తుంది. ఆకాశ్.. భారత నావిక్ కాన్‌స్టెలేషన్‌ని ఉపయోగించడం వల్ల దక్షిణాసియాలోని జీపీఎస్ కంటే ఇదెంతో నమ్మదగినదిగా ఉంటుంది. పర్వతాలు, ఎడారుల లాంటి కఠినమైన భూభాగాల్లోనూ.. కచ్చితమైన స్ట్రైక్‌లకు వీలుంటుంది. అమెరికా, చైనా జీపీఎస్ గైడెడ్ సిస్టమ్‌లు కూడా సాధించలేనివి.. ఆకాశ్ సాధిస్తుంది. అందువల్ల.. సెకన్లలోనే ఆకాశ్ సిస్టమ్‌కి.. మిషన్స్‌ని కేటాయించొచ్చు. టార్గెట్లని సెలక్ట్ చేసుకోవచ్చు. డ్రోన్ మార్గాలను రీప్రోగ్రామ్ చేయొచ్చు. ఈ జీరో హ్యూమన్ డిలే లూప్.. నాటో బలగాలు, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వ్యవస్థలు ఉపయోగించే మానవ ఆధారిత ఆదేశాలపై.. అతి పెద్ద విజయంగా చెబుతున్నారు.

భారతీయ ఆల్గారిథమ్‌లని ఎదుర్కొనేందుకు రీకాలిబ్రేట్

ఆకాశ్ మిసైల్ సిస్టమ్ దమ్ము చూశాక.. చైనాకు చెందిన టాప్ డ్రోన్, శాటిలైట్ వ్యవస్థలు కూడా.. ఇప్పుడు భారతీయ అల్గారిథమ్‌లని ఎదుర్కొనేందుకు రీకాలిబ్రేట్ చేస్తున్నారు. అయితే.. భారత్‌కు చెందిన కాంబాట్ శాటిలైట్, ఏఐ ప్యూజన్‌ని అంత ఈజీగా అంచనా వేయలేరని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు టర్కీ కూడా.. ఆకాశ్ మిసైల్స్ పనితీరు చూశాక.. తమ ఏఐ అప్‌గ్రేడ్‌లను వేగవంతం చేస్తోంది. ఆకాశ్ మిసైళ్లంటే.. ఇప్పుడు తేలికైన, వేగవంతమైన, స్టెల్తీయర్ వెపన్లలో.. ఓ కొత్త బెంచ్ మార్క్‌గా చూస్తున్నారు.

అమెరికా అవాక్స్ టెక్నాలజీని కూడా దెబ్బతీసిన ఆకాశ్

పాక్ ఆర్మీ రాడార్‌లు, ఎయిర్ కమాండ్ సెంటర్లు.. ఆకాశ్ మిసైళ్లని తమ సున్నితమైన జోన్ల సమీపంలోకి ప్రవేశించకుండా ఆపలేకపోయాయి. కనీసం.. వాటి రాకను కూడా గుర్తించలేకపోయాయి. శత్రుదేశం కౌంటర్ ఎటాక్ సిస్టమ్స్ కూడా మన ఆకాశ్ మిసైళ్లని ఏమీ చేయలేకపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. మన మిసైళ్లని డిటెక్ట్ చేయడంలో.. పాక్ సిస్టమ్ మొత్తం ఫెయిలైంది. కనీసం.. ఆ ఫ్రీక్వెన్సీని కూడా పట్టలేకపోయాయి. ఇది.. అమెరికా పాక్‌కు సప్లై చేసిన అవాక్స్ టెక్నాలజీ, యాంటీ డ్రోన్ రాడార్ల టెక్నాలజీని కూడా మన ఆకాశ్ మిసైల్ సిస్టమ్ దెబ్బతీసింది.

ఏఐ ఆధారిత శక్తిమంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్

ఆకాశ్ సిస్టమ్.. భారత స్వదేశీ టెక్నాలజీతో.. ఏఐ ఆధారంగా రూపొందించిన శక్తిమంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది.. భారత దళాలకు చెందిన ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను.. వ్యూహాత్మక కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌తో సన్నద్ధం చేస్తుంది. యుద్ధ ప్రాంతంలో.. తక్కువ స్థాయి గగనతలాన్ని మానిటర్ చేసేందుకు, గ్రౌండ్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్‌లను.. సమర్థవంతంగా నియంత్రిస్తుంది. భారత్‌పై ప్రతీకారంతో పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లని తిప్పికొట్టడంలో ఆకాశ్ కీలకంగా పనిచేసింది. ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల.. భారత్‌లో ఎలాంటి నష్టం జరగలేదు. అందుకోసమే.. మన ఆకాశ్ మిసైల్ సిస్టమ్ గురించి ప్రపంచం మొత్తం ఇప్పుడు చర్చించుకుంటోంది.

ఆకాశ్‌ని ఎప్పుడు డెవలప్ చేశారు? ఎప్పటి నుంచి వినియోగంలో ఉంది?

ఆకాశ్.. ప్లగ్ అండ్ స్ట్రైక్ డిప్లాయ్‌మెంట్ సిస్టమ్. ఇదో.. ల్యాప్ టాప్ సైజ్ మొబైల్ కమాండ్ సెంటర్ నుంచే కాదు.. కదిలే జీపులో నుంచి కూడా ఆపరేట్ చేసేందుకు వీలుంది. ఈ భూమిపై.. ఇప్పుడున్న అత్యుత్తమ మిసైల్ సిస్టమ్ ఇదే అని చెబుతున్నారు. అసలు.. ఆకాశ్‌ని ఎప్పుడు డెవలప్ చేశారు? ఎప్పటి నుంచి వినియోగంలో ఉంది?

పాక్ డ్రోన్ ఎటాక్స్ ని తిప్పికొట్టడంలో కీలకంగా ఆకాశ్

ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్‌ చేపట్టింది. ఆ తర్వాత.. పాకిస్తాన్ నుంచి ఎదురైన ఏరియల్ ఎటాక్స్‌ని తిప్పికొట్టడంలో.. స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఆకాశ్ మిసైల్ సిస్టమే కీలకంగా పనిచేసింది. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్, డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్.. డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఇది.. మొబైల్ షార్ట్ నుంచి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. ప్రస్తుతం.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తోంది. ఆకాశ్ మిసైల్ సిస్టమ్.. పూర్తిగా మేడిన్ ఇండియా వెపన్. ఇది.. కీలకమైన స్థావరాల్లో, ముఖ్యమైన ప్రాంతాల్లో రక్షణ కవచంగా కవర్ చేసేందుకు దీనిని తయారుచేశారు. ఈ డిఫెన్స్ సిస్టమ్.. శత్రు విమానాలు, మిసైళ్లు, డ్రోన్ల లాంటి.. మల్టిపుల్ ఏరియల్ టార్గెట్స్‌ని ఒకేసారి ఛేదించగలదు.

ఇంటిగ్రేట్ గైడెడ్ మిసైల్ అభిద్ధిలో భాగంగా ఆకాశ్ తయారీ

ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ అభివృద్ధిలో భాగంగా.. 1980ల చివర్లో డీఆర్డీవో ఆకాశ్‌ని డెవలప్ చేయడం మొదలుపెట్టింది. దీనిపై తొలిసారి 1990ల చివర్లో ట్రయల్స్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఫీల్డ్ ట్రయల్స్, టార్గెట్లని ఛేదించే పరీక్షలు నిర్వహించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ ఆర్మీ విస్తృతమైన యూజర్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాత.. ఐఏఎఫ్‌లో 2014, ఇండియన్ ఆర్మీ‌లో 2015లో.. ఆకాశ్ మిసైల్ సిస్టమ్‌ని ప్రవేశపెట్టారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లో.. మల్టిపుల్ ఆకాశ్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఆకాశ్ మిసైల్ సిస్టమ్ 96 శాతం స్వదేశీ టెక్నాలజీతో తయారైంది. ఇందులో.. ట్రూప్ కంట్రోల్ సెంటర్, ట్రూప్ లెవెల్ రాడార్, ఫ్లైట్ లెవెల్ రాడార్, సెంట్రల్ రాడార్, ఫ్లైట్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి.

ఆకాశ్ మిసైల్ భాగాలు తయారు చేస్తున్న 250 కంపెనీలు

వీటన్నింటిని కలిపే.. ఆకాశ్ మిసైల్ సిస్టమ్‌గా పిలుస్తారు. టార్గెట్లని ట్రాక్ చేయడం, ఎంగేజ్ చేయడం, వాటిని ఛేదించడం అన్నీ క్షణాల్లో చేసేస్తుంది. ఇది.. ఇప్పుడున్న అధునాతన భారతీయ ఆయుధ వ్యవస్థల్లో.. అడ్వాన్స్‌డ్ వెపన్ అనే చెప్పాలి. 250కి పైగా కంపెనీలు ఆకాశ్ మిసైల్ సిస్టమ్‌కి సంబంధించిన సబ్ సిస్టమ్స్, ఇతర భాగాల ఉత్పత్తి, సప్లైలో నిమగ్నమై ఉన్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్.. వీటి ఉత్పత్తికి సంబంధించిన వ్యవహారాల్ని చూస్తున్నాయి.

ఆకాశ్ మిసైల్ సిస్టమ్‌లో ఇంటిగ్రేటెడ్ త్రీడి సెంట్రల్ రాడార్

ఆకాశ్ మిసైల్ సిస్టమ్.. ఎంతో అడ్వాన్స్‌డ్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉన్న ఇంటిగ్రేటెడ్ త్రీడీ సెంట్రల్ రాడార్.. గగనతలం నుంచి వచ్చే శత్రు డ్రోన్లు, మిసైళ్లను 3 దిశల్లో స్కాన్ చేస్తుంది. కీలకమైన రాజేంద్ర రాడార్.. అత్యంత ఖచ్చితమైన ట్రాకింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది శత్రు లక్ష్యాలను సెకన్లలో గుర్తించి, సమాచారం ఇస్తుంది. ఏ దిశలోనైనా.. 120 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. శత్రు టార్గెట్లపై దాడి చేసేలా ఆకాశ్ మిసైల్స్‌ని గైడ్ చేసేది కూడా రాజేంద్ర అడ్వాన్స్‌డ్ మల్టీ ఫంక్షన్ ఫైర్ కంట్రోల్ రాడారే. ఇది.. 80 కిలోమీటర్ల వరకు శత్రు టార్గెట్లను కవర్ చేస్తుంది. దీనికి మల్టిపుల్ టార్గెట్లని ట్రాక్ చేసే సామర్థ్యం ఉంది. ఇది.. ఒకేసారి మల్టిపుల్ మిసైళ్లని కూడా గైడ్ చేస్తుంది.

మిసైల్ 55 కిలోల ప్రీ- ఫ్రాగ్మెంటెడ్ వార్ హెడ్

రాడార్ నుంచి కచ్చితమైన ట్రాకింగ్ డేటా.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్తుంది. ఆ తర్వాత.. మొబైల్ లాంచర్ నుంచి మిసైళ్లని ప్రయోగిస్తారు. ఒక లాంచర్ నుంచి 3 మిసైళ్లని ఫైర్ చేయొచ్చు. 700 కిలోల కంటే ఎక్కువ బరువుండే ఆకాశ్ మిసైల్స్.. మాక్ 2.5 వేగాన్ని అందుకోగలవు. ఆకాశ్ మిసైల్‌లో ఉన్న మరో స్పెషాలిటీ ఏమిటంటే.. ఇది.. గాల్లో ఉన్న సమయంలోనే.. తన దిశని మార్చుకోగలదు. టార్గెట్ ఎటు వైపు మళ్లినా.. కచ్చితంగా కూల్చేయగలదు. ఈ ఫీచర్.. ఆకాశ్ మిసైల్ సిస్టమ్ కెపాసిటీని మెరుగుపరిచింది. అంతేకాదు.. ఆకాశ్ మిసైల్‌లో 55 కిలోల ప్రీ-ఫ్రాగ్మెంటెడ్ వార్ హెడ్.. ప్రాక్సిమిటీ ఫ్యూజ్ ద్వారా యాక్టివేట్ అవుతుంది. ఇది.. టార్గెట్‌ని నేరుగా ఢీకొట్టకపోయినా.. ఊహించని నష్టాన్ని కలిగిస్తుంది.

శత్రు టార్గెట్లను పక్కాగా కూల్చే ఆకాశ్ మిసైల్

ఆకాశ్ మిసైల్‌ సిస్టమ్‌కు ఉన్న మరో సూపర్ ఫీచర్.. కచ్చితత్వం. ఇది.. శత్రు టార్గెట్లను కూల్చడంలో చాలా పక్కాగా పనిచేస్తుంది. టార్గెట్‌ని ట్రాక్ చేయడం, వేగంగా స్పందించి దానిని నాశనం చేయడం వరకు.. పక్కాగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న రాడార్.. తక్కువ ఎత్తులోఉన్న టార్గెట్లని కూడా ట్రాక్ చేసి నాశనం చేస్తుంది. లాంచర్, కంట్రోల్ సెంటర్, బిల్ట్ ఇన్ మిషన్ గైడెన్స్ సిస్టమ్, కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్, ఇంటలిజెన్స్ కేంద్రాలు, సపోర్టింగ్ గ్రౌండ్ పరికరాలు, రాజేంద్ర రాడార్‌తో కూడిన మొత్తం ఆయుధ వ్యవస్థను.. మొబైల్ ప్లాట్ ఫామ్‌పై సెట్ చేశారు.

రాడార్, సోనార్, ఇన్ ప్రారెడ్, ట్రాకింగ్ సిస్టమ్

దీనికి ఉన్న డిజైన్ పరంగా.. ఆకాశ్‌ సిస్టమ్‌ని త్వరితగతిన మొబిలైజ్ చేయొచ్చు. రోడ్డు, రైలు మార్గాల్లో సులభంగా తరలించొచ్చు. ఇందులోని.. బిల్ట్ ఇన్ ఎలక్ట్రానిక్ కౌంటర్ – కౌంటర్ మెజర్స్ టెక్నాలజీ.. శత్రు ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్‌ని అడ్డుకుంటుంది. రాడార్, సోనార్, ఇన్‌ఫ్రారెడ్, ఇతర ట్రాకింగ్ సిస్టమ్‌ని రద్దు చేసేందుకు, దారిమళ్లించేందుకు శత్రువు చేసే ప్రయత్నాలను కూడా తిప్పికొడుతుంది. శత్రువులు గురిపెట్టిన మన టార్గెట్లకు నష్టం వాటిల్లకుండా అడ్డుకుంటుంది.

30 కిలోమీటర్ల రేంజ్, 18 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్

30 కిలోమీటర్ల రేంజ్‌లో, 18 కిలోమీటర్ల ఎత్తులోని శత్రు విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లను.. ఆకాశ్ మిసైల్ నాశనం చేయగలదు. అందువల్ల.. భారత గగనతల రక్షణలో ఇప్పుడిది కీలక పాత్ర పోషిస్తోంది. డీఆర్డీవో.. ఆకాశ్ మిసైల్ సిస్టమ్ సామర్థ్యాన్ని, రేంజ్‌ని మెరుగుపరిచేలా కొత్త వేరియంట్లని అభివృద్ధి చేస్తోంది. ఆకాశ్ ప్రైమ్ వేరియంట్.. ఒరిజినల్ వేరియంట్ లాగే ప్రభావవంతమైన పరిధిని కలిగి ఉంది. అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో.. కీలకమైన మౌలిక సదుపాయాలను కాపాడేందుకు వీలుగా.. దీనిని అప్‌గ్రేడ్ చేశారు. మెరుగైన కచ్చితత్వం కోసం.. ఆకాశ్ ప్రైమ్ స్వదేశీ యాక్టివ్ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌తో పనిచేస్తోంది. డీఆర్డీవో.. ఆకాశ్ నెక్ట్స్ జనరేషన్ మిసైళ్లని కూడా అభివృద్ధి చేస్తోంది.

70 కి.మీ.ల పరిధిలోని టార్గెట్లను ఛేదించే ఆకాశ్ ఎన్జీ

ఇప్పటికే.. డీఆర్డీవో వాటిని విజయవంతంగా పరీక్షించింది. తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్లతో.. ఏరియల్ టార్గెట్లను ఎదుర్కొనేందుకు వీలుగా.. ఈ ఆకాశ్ ఎన్జీ మిసైల్‌ని తయారుచేశారు. ఇది.. 70 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్లని ఛేదించగలదు. ఈ మిసైళ్లను ప్రత్యేకంగా డిజైన్ చేసిన కంపార్ట్‌మెంట్లలో స్టోర్ చేసి.. ఆపరేట్ చేయొచ్చు. మరింత ఎక్కువ రేంజ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో.. భవిష్యత్ బెదిరింపులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఆకాశ్ మిసైల్ సిస్టమ్ సిద్ధంగా ఉంది.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×