E-Paper
Advertisement

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. జవాన్లపై ముష్కరులు కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత!

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. జవాన్లపై ముష్కరులు కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత!
Advertisement

Kulgam Terror Attack: జమ్మూకశ్మీర్‌ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గామ్ జిల్లాలో విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లను టార్గెట్ చేసి ముష్కరులు కాల్పులు జరిపారు. బైక్ పై వచ్చిన ఇద్దరు సాయుధులు ఆకస్మికంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కుల్గామ్ జిల్లాలో అత్యంత సున్నిత ప్రాంతమైన అఖ్రాన్ లో నాకా పాయింట్ వద్ద మధ్యాహ్నం జవాన్లు ఎప్పట్లానే వాహన తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో బైక్‌ పై వచ్చిన దుండగులు జవాన్ల బృందంపై ఒక్కసారిగా కాల్పులు జరిపి పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన తోటి సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది.. గాయపడిన జవాన్లను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని అనంతనాగ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

మరోవైపు కాల్పుల శబ్దం వినపడగానే అఖ్రాన్ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. దాడి సమాచారం అందుకున్న వెంటనే అదనపు భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. పారిపోయిన దుండగులను గుర్తించడానికి సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా పరిసర ప్రాంతాలలో విస్తృత గాలింపు చర్యలు ప్రారంభించారు. అనుమానాస్పద కదలికలను కనిపెట్టేందుకు ప్రధాన రహదారులతో పాటు అంతర్గత మార్గాలను జల్లెడ పడుతున్నారు.

Advertisement

Also Read: వీఐ రూ.398 ప్లాన్.. కాలింగ్, 5G డేటాతో పాటు.. 19 ఓటీటీలు ఉచితం!

అటు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అటు దాడి నేపథ్యంలో కుల్గామ్, అనంతనాగ్ జిల్లాల్లో భద్రతా బలగాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. మరోవైపు కేంద్ర హోం, రక్షణ మంత్రిత్వ శాఖలు ఈ ఘటనపై ఆరా తీస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను సంఘటన స్థలానికి తరలించింది.

Also Read: నలుగురికి ఒక్కటే రీఛార్జ్.. Airtel రూ. 1,449 ఫ్యామిలీ ప్లాన్ గురించి తెలుసా?

Tags

Related News

పెళ్లికి వెళ్తే పదవి నుంచి దించేస్తారా?.. మమ్ముట్టి వివాదం వెనుక అసలు కథ!

హైస్కూల్ కుర్రాడి జాక్‌పాట్.. రూ. 2.30 కోట్ల బీఎండబ్ల్యూ కారు, బహుమతి వెనుక లాజిక్ ఇదే

ఈమె తల్లి కాదు కామాంధురాలు.. ప్రియుడి మోజులో పడి, కొడుకుని చంపేంచి ఆ తర్వాత

ఢిల్లీ వాయు కాలుష్యం 3036.. లండన్ 100 కంటే తక్కువ.. అయినా హై అలర్ట్ జారీ

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం పై.. బీజేపీ సీనియర్ నేతలు ఫైర్!

హోసూర్ ఐఫోన్ ప్లాంట్‌లో ఘోరం.. ఒకరిని కాపాడబోయి ముగ్గురు మృతి.. అసలేం జరిగింది?

కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లైన నాలుగు రోజులకే, వధువు ఏం చేసిందంటే..

Big Stories

Advertisement
×