E-Paper
Advertisement

IPL 19th season: ఆక్షన్ రికార్డుల మోత.. ఎవరు ఏ టీమ్‌కి లిస్ట్ ఇదే..

IPL 19th season: ఆక్షన్ రికార్డుల మోత.. ఎవరు ఏ టీమ్‌కి లిస్ట్ ఇదే..

IPL 19th season:  ఐపీఎల్ మినీ ఆక్షన్ ముగిసింది.. ఇక యాక్షనే మిగిలింది. మొత్తం.. పది ఫ్రాంచైజీలు తమ పూర్తి స్థాయి టీమ్స్‌తో.. నెక్ట్స్ సీజన్‌ని సిద్ధమైపోయాయి. దేశ, విదేశీ ఆటగాళ్లపై.. కొన్ని ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించేశాయ్. మరి.. ఇప్పుడు ఏ టీమ్‌లో ఎవరు ఉన్నారు? కొందరు స్టార్ ప్లేయర్లను రిటైన్ చేసుకోవడానికి రీజనేంటి? మినీ వేలం తర్వాత.. ఏ టీమ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది?

19వ ఐపీఎల్ సీజన్ కోసం టీమ్స్ రెడీ!

వేలం ముగిసింది.. ఐపీఎల్ 19వ సీజన్ కోసం అంతా సిద్ధమైంది. ఈ మినీ వేలంలో.. ఫ్రాంచైజీలు తమ వ్యూహాలకు పదునుపెట్టి.. కోట్లు కుమ్మరించి తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకున్నాయ్. కొందరు స్టార్ ప్లేయర్ల్.. ఇప్పుడున్న టీమ్స్‌లోనే కంటిన్యూ అవనుండగా.. ఇంకొందరు ఆటగాళ్లు మాత్రం కొత్త జెర్సీల్లో మెరవనున్నారు. ఐపీఎల్ ఆక్షన్ తర్వాత.. టీమ్స్‌లో గేమ్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. ఫ్రాంచైజీల బలాబలాల్లోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని టాప్ టీమ్స్ కీలకమైన ఆటగాళ్లని, స్టార్ ప్లేయర్లను.. రికార్డు ధరలకు రిటైన్ చేసుకున్నాయి. కోర్ టీమ్ బిల్డ్ చేసుకునేందుకే.. ఇలా చేసినట్లు తెలుస్తోంది. తమ జట్ల పునాదులను కదిలించకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక.. ఎంస్ ధోనీ చెన్నైతో, విరాట్ కోహ్లీ బెంగళూరుతో, రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ జట్లలోనే ఉన్నారు. వీళ్లంతా.. స్టార్ ప్లేయర్లు మాత్రమే కాదు.. ఆయా ఫ్రాంచైజీలకు ఫేస్ కూడా. వారిని వదులుకోవడం అంటే.. టీమ్ బ్రాండ్ వాల్యూని, ఫ్యాన్ బేస్‌ని కూడా కోల్పోతారు. అందుకే.. కోహ్లీ, ధోనీ, రోహిత్ ఈసారి కూడా అవే టీమ్స్‌కి ఆడనున్నారు.

మినీ వేలంలో కోట్లు పలికిన ప్లేయర్స్

ఇక.. సన్‌రైజర్స్ హైదరాబాద్.. హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్లందరినీ రిటైన్ చేసుకుంది. కొత్తగా.. లియామ్ లివింగ్‌స్టోన్‌ని.. 13 కోట్లు పెట్టి కొన్నారు. సలీల్ అరోరా కోసం కోటిన్నర ఖర్చు చేశారు. వీళ్లిద్దరితో పాటు ఇంకొందరు ప్లేయర్లని.. బేస్ ప్రైస్‌కి దక్కించుకున్నారు. గత సీజన్‌లో టైటిల్ విన్నర్‌గా నిలుస్తుందనేలా ఆడిన సన్‌రైజర్స్.. ఈసారి కూడా అదే జోరును కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్.. కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ లాంటి ప్లేయర్లని.. ఒక్కొక్కరికి 14 కోట్ల 20 లక్షలు పెట్టి మరీ దక్కించుకుంది. రాహుల్ చాహర్‌ కోసం 5 కోట్ల 20 లక్షలు పెట్టారు. ఇక.. ధోనీ, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె లాంటి వాళ్లని రిటైన్ చేసుకున్నారు. లక్నో సూపర్ జెయింట్స్.. జోష్ ఇంగ్లిస్‌ని.. 8 కోట్ల 60 లక్షలకు పైనే వెచ్చించి.. వేలంలో దక్కించుకుంది. ముకుల్ చౌదరిని 2 కోట్ల 60 లక్షలు పెట్టి దక్కించుకుంది. వానిందు హసరంగా, అన్రిచ్ నోకియా లాంటి ప్లేయర్లను 2 కోట్ల చొప్పుున కొనేసింది. మహ్మద్ షమీ, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ప్రిన్స్ యాదవ్, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.

ఐపీఎల్ 2026: రిటైన్‌లు & వేలంలో పెద్ద డీల్‌లు”

ఈ వేలంలో.. అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్.. కామెరూన్ గ్రీన్‌‌ని.. 25 కోట్ల 20 లక్షలు పెట్టి దక్కించుకుంది. మతీశ పతిరనని 18 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. ముస్తాఫిజుర్ రెహ్మన్‌పై.. 9 కోట్ల 20 లక్షలు పెట్టి దక్కించుకున్నారు. వీరితో పాటు ఇంకొందరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను.. బేస్ ప్రైస్‌కు దక్కించుకున్నారు. రహానే, రఘువంశీ, హర్షిత్ రాణఆ, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్లని.. రిటైన్ చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. అకిబ్ నబీని 8 కోట్ల 40 లక్షలకు దక్కించుకుంది. పాథుమ్ నిశాంకని 5 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నారు. డేవిడ్ మిల్లర్‌, బెన్ డకెట్‌ని.. 2 కోట్ల చొప్పున వేలంలో కొనేశారు. కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, నితీశ్ రాణా, అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్లను.. రిటైన్ చేసుకున్నారు. ముంబై ఇండియన్స్.. క్వింటన్ డికాక్ ఒక్కడిపైనే కోటి రూపాయలు ఖర్చు చేసింది. మిగతా ప్లేయర్లను.. బేస్ ప్రైస్‌కి దక్కించుకుంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి వాళ్లని.. ఎంఐ రిటైన్ చేసుకుంది. బెంగళూరు టీమ్.. వెంకటేశ్ అయ్యర్‌కి 7 కోట్లు, మంగేశ్ యాదవ్‌కు 5 కోట్ల 20 లక్షలు పెట్టి సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ బెతెల్ లాంటి ప్లేయర్లను.. ఆర్సీబీ రిటైన్ చేసుకుంది.

రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ కొత్త వ్యూహాలు

రాజస్థాన్ రాయల్స్.. ఈ మినీ వేలంలో రవి బిష్ణోయ్‌పై అత్యధికంగా 7 కోట్ల 40 లక్షలు ఖర్చు చేసింది. ఆడమ్ మిల్నేని 2 కోట్ల 40 లక్షలకు దక్కించుకుంది. మిగతా ప్లేయర్లను.. బేస్ ప్రైస్‌కి, అంతకంటే.. కొంచెం ఎక్కువ ధరకు కొనేసింది. రవింద్ర జడేజా, రియాన్ పరాగ్, సామ్ కరన్, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, డొనావన్ ఫెరీరా లాంటి ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. పంజాబ్ సూపర్ కింగ్స్.. బెన్ డ్వార్షుయిస్‌ కోసం 4 కోట్ల 40 లక్షలు పెట్టింది. కూపర్ కునెలిని 3 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటికే టీమ్‌లో ఉన్న ప్లేయర్లందరినీ రిటైన్ చేసుకుంది. గుజరాత్ టైటాన్స్.. ఈసారి జేసన్ హోల్డర్‌ని 7 కోట్లకు దక్కించుకుంది. ఇంకొందరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను.. బేస్ ప్రైస్‌కి తీసుకుంది. శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, వాషింట్గన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, ఇషాంద్ షర్మ, జోస్ బట్లర్, కగిసో రబాడ, రాహుల్ తెవాతియా లాంటి వాళ్లందరినీ.. రిటైన్ చేసుకుంది. మినీ వేలం ముగియడంతో.. టీమ్‌ల్లో లెక్కలన్నీ మారిపోయాయి. ఇప్పుడు.. బ్యాట్, బాల్‌తో.. గ్రౌండ్‌లో రీసౌండ్ వచ్చేలా రిజల్ట్ చూపించడం మాత్రమే మిగిలింది. ఈసారి అన్ని టీమ్స్.. అన్ క్యాప్డ్ ప్లేయర్లని ఎక్కువగా తీసుకున్నాయి. రాబోయే టోర్నీలో.. వాళ్లంతా ఎలా పర్ఫామ్ చేస్తారు.. ఎవరు బాగా క్లిక్ అవుతారన్నది ఆసక్తి రేపుతోంది.

ఇండియాలో క్రికెట్ అంటే.. ఓ ఎమోషన్. అదే.. ఐపీఎల్ అంటే.. అంతకుమించి. సమ్మర్‌లో సీజన్ మొదలై.. ఎండ్ అయ్యేదాకా.. దేశం మొత్తం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతుంటుంది. సాయంత్రం అవగానే.. సగం దేశం టీవీలు, మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోతుంది. పైగా.. మినీ వేలం తర్వాత ప్లేయర్స్ మారారు. టీమ్స్ స్వరూపం కూడా మారింది. ఒక్కో టీమ్.. గేమ్ కూడా కచ్చితంగా మారుతుంది. అందువల్ల.. రాబోయే ఐపీఎల్‌లో కప్పు కొట్టే జట్టు ఏది? వచ్చే సీజన్‌లో.. ఆటాడేదెవరు? వేటాడేదెవరు?

టీమ్ బ్యాలెన్స్, భారీ ట్రేడ్లు, కొత్త సీజన్‌కు అంచనాలు

ఇండియాలో క్రికెట్ అంటే ఒక రిలీజియన్. అందులో IPL అంటే అంతకుమించిన ఎమోషన్! ప్రతి ఏడాది.. మార్చి నుంచి మే దాకా.. దేశమంతా క్రికెట్ ఫీవర్‌లో మునిగిపోతుంది. గత సీజన్‌లో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఎట్టకేలకు తమ తొలి టైటిల్‌ని గెలిచి.. ఆర్సీబీ ఫ్యాన్స్‌ని ఆనందపరిచింది. ఇప్పుడంతా.. 2026 సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. మినీ వేలం తర్వాత.. టీమ్స్‌లో ప్లేయర్స్ మారారు. అంటే.. గేమ్ కూడా మారబోతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ని 25 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ పతిరణని కూడా.. కేకేఆర్ 18 కోట్లకు తీసుకుంది. ఇక.. చెన్నై సూపర్ కింగ్స్.. అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మని.. 14 కోట్ల 20 లక్షల చొప్పున కొని సంచలనం సృష్టించింది. సంజూ శాంసన్.. చెన్నై టీమ్‌లోకి వెళ్లగా.. రవీంద్ర జడేజా, సామ్ కరన్ రాజస్థాన్ రాయల్స్‌కి చేరారు. మొత్తంగా.. మినీ ఆక్షన్ తర్వాత.. టీమ్స్ బ్యాలెన్స్ మారింది. కొన్ని ఫ్రాంచైజీలు తమ కోర్‌ని కాపాడుకుంటూ.. కీలక స్లాట్స్ మాత్రమే ఫిల్ చేశాయి. ఇంకొన్ని జట్లు.. సగం స్క్వాడ్‌ని మార్చేశాయ్. బోల్డ్ ఆల్‌రౌండర్లకు, డెత్ బౌలర్లకు, పవర్ హిట్టర్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించేశాయ్. అయితే.. ఎవరి బ్యాలెన్స్ ఎంత బలంగా ఉంది? ఎవరి బౌలింగ్ యూనిట్ డెప్త్ ఎంత? బెంచ్ స్ట్రెంత్ ఎలా ఉందనేది.. వచ్చే సీజన్ తేల్చేస్తుంది.

టైటిల్ రేస్ కోసం ప్లాన్ చేసిన గేమ్ మాస్టర్‌స్ట్రోక్‌లు

స్ట్రాంగ్ కోర్, సెటిల్డ్ మేనేజ్‌మెంట్, క్లియర్ రోల్ క్లారిటీ ఉన్న టీమ్స్.. లీగ్ స్టేజ్ నుంచే ఎటాకింగ్‌గా ఫైట్ చేస్తాయ్. రైట్ టైమ్‌లో ఫామ్‌లోకి వచ్చే ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ ఫినిషర్లు, ఫామ్‌లో ఉన్న స్పిన్నర్లు, ఇంపాక్ట్ ప్లేయర్లు ఉంటే.. ప్లేఆఫ్స్ నుంచే టైటిల్ వైపు దూసుకెళ్తారు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో.. గేమ్ ట్రెండ్ పూర్తిగా మారిపోనుంది. పవర్ ప్లే‌లో ఎటాకింగ్ మోడ్‌లో కనిపించనున్నారు ప్లేయర్స్. తొలి ఆరు ఓవర్లలోనే.. 60 నుంచి 70 రన్స్ వచ్చేలా ఆడనున్నారు. మిడిల్ ఓవర్స్‌లో.. స్పిన్‌తో ట్రాప్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్. ఇద్దరు స్పిన్నర్లతో స్లో పేస్, వేరియేషన్లతో రన్‌రేట్‌ని చోక్ చేసే ప్లాన్లు అమలు చేయనున్నారు. ఇక.. డెత్ ఓవర్లలో.. యార్కర్స్‌కి, హిట్టర్స్‌కి మధ్య నడిచే గేమ్ సూపర్బ్‌గా ఉండబోతోంది. ఆఖరి 3 ఓవర్లలో.. 40కి పైగా పరుగులు పిండుకోవడం గానీ.. 20 రన్స్ లోపే కంట్రోల్ చేయడం గానీ జరుగుతుంది. చాలా మ్యాచ్‌లు టర్న్ అయ్యేది ఇక్కడే. చాలా వరకు.. మొదటి ఐదు ఓవర్లలోనే.. గేమ్ టోన్‌ని సెట్ చేసేందుకు ప్రయత్నించే టీమ్స్ ఎక్కువగా ఉన్నాయ్.

ఐపీఎల్ టైటిల్ ఫైట్ హీట్!

కోల్‌కతా నైట్ రైడర్స్.. 64 కోట్ల భారీ పర్స్‌తో కామెరాన్ గ్రీన్, పతిరణ, ఫిన్ అలెన్ లాంటి ప్లేయర్స్‌ని తీసుకుంది. దాంతో పాటు తమ కోర్ టీమ్‌ని నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌, మిడిల్ ఆర్డర్, ఫినిషర్ల విషయంలో చాలా బలంగా ఉన్నారు. దాంతో.. టైటిల్ ఫేవరెట్స్‌లో కేకేఆర్ టాప్‌లో ఉంది. ఇక.. చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పటిలాగే అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చింది. స్పిన్ విషయంలో.. ఎప్పటిలాగే టాప్‌లో ఉంది. రుతురాజ్ కెప్టెన్సీలో టీమ్ సెటిల్డ్‌గా ఉంది. మినీ వేలంలో జడేజా ట్రేడ్ అయినా.. సంజూ శాంసన్ వచ్చాడు. అంతేకాదు.. సీఎస్కే అన్‌క్యాప్డ్ టాలెంట్‌పై భారీగా ఖర్చు చేసింది. బోనస్‌గా ధోనీ కూడా ఉన్నాడు. ధోనీకి.. ఇదే ఆఖరు సీజన్ అనే వార్తలు వస్తున్నాయ్ కాబట్టి.. ఈసారి చెన్నై టీమ్‌ని తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు.

రాయల్ ఛాలెంజర్స్ బౌలింగ్ పై డౌట్

ఇక.. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ వెంకటేశ్ అయ్యర్‌ని 7 కోట్లకు తీసుకుంది. టీమ్‌లో బ్యాటింగ్ డెప్త్ బాగున్నప్పటికీ.. బౌలింగ్ మీదే కొంచెం డౌట్ కొడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇక.. రాజస్థాన్ రాయల్స్‌లోకి.. జడేజా, కరన్, రవి బిష్ణోయ్ లాంటి ప్లేయర్లు వచ్చారు. దాంతో.. ఆల్ రౌండ్ ప్లేయర్ల బ్యాలెన్స్ సూపర్‌గా ఉంది. ఇక.. గత సీజన్ సెన్సేషన్ టీమ్ ఎస్ఆర్‌హెచ్.. ఈసారి కూడా అదే దూకుడుని కంటిన్యూ చేసేలా కనిపిస్తోంది. కమిన్స్, క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉంది. భారీ హిట్టర్లతో పాటు బౌలింగ్‌లోనూ లోటుపాట్లని సరిదిద్దుకుంది. దాంతో.. ఎస్‌ఆర్‌హెచ్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఇక.. ముంబై కూడా తన నలుగురు పిల్లర్లని కాపాడుకుంది. రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ లాంటి కోర్ టీమ్ ఉంది. అందుకోసమే.. వేలంలో తక్కువ బడ్జెట్‌తోనే.. స్మార్ట్ బైస్ చేసింది. బౌలింగ్‌లో బుమ్రాకు తోడుగా.. మంచి విదేశీ పేసర్లను ఎంచుకుంది.

హాట్ కంటెండర్స్.. కానీ కప్పు ఎవరిది?

2026 మార్చిలో జరగబోయే ఐపీఎల్ 19వ సీజన్.. చాలా కాంపిటీటివ్‌గా కనిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్.. భారీ బిడ్డింగ్‌తో స్ట్రాంగ్ లుక్ ఇస్తోంది. ఆర్సీబీ కూడా డిఫెండ్ చేయాలని ట్రై చేస్తుంది, కానీ.. కేకేఆర్, సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా.. హాట్ కంటెండర్స్. గుజరాత్ టైటాన్స్ కూడా రిటైన్డ్ ప్లేయర్లతో సాలిడ్‌గా కనిపిస్తోంది. అయితే.. ఎంత బలమైన స్క్వాడ్ ఉన్నా.. ఐపీఎల్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కన్సిస్టెంట్ టాప్ ఆర్డర్, ఫినిషింగ్ పవర్ ఉన్న బ్యాటింగ్, పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోయే బౌలింగ్, కూల్ కెప్టెన్సీ, స్మార్ట్ డేటా అనాలిసిస్, ప్లేయర్స్ మేనేజ్‌మెంట్‌లో క్లారిటీ ఉంటే.. టైటిల్ ఫేవరెట్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్. సీజన్ మొదలైన.. వారం తర్వాతే.. ఏ టీమ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందనే దానిపై పిక్చర్ క్లారిటీ వస్తుంది. అప్పటివరకు.. కప్పు కొట్టేదెవరన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది.

Story By Anup, Big Tv 

 

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×