Lokesh Kangaraj : లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమా తోనే ఫిలిం మేకర్ గా విపరీతమైన పేరు సాధించుకున్నాడు. దానికంటే ముందు విడుదలైన నగరం సినిమాతోనే దర్శకుడుగా పరిచయం అయ్యాడు. అయితే ఆ సినిమాతో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నా కూడా ఖైదీ సినిమాతో స్టార్ డైరెక్టర్ ఐపోయాడు ఆ తర్వాత అన్ని సినిమాల్లో కూడా కేవలం స్టార్ హీరోలతో మాత్రమే చేశాడు. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి హీరోలతో పని చేసే అవకాశం లోకేష్ కనగరాజ్ కు దక్కింది.
అయితే వారిద్దరితో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తాడు అని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ఊహించిన స్థాయి సక్సెస్ సాధించకపోవడంతో లోకేష్ కు ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ అవకాశం తప్పిపోయింది. అయితే ఇప్పటికీ కూడా లోకేష్ ను ఒక ఫిలిం మేకర్ గా నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో అనుకున్న ప్రాజెక్టు జరగలేదు కాబట్టి ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంట్రీ ఇవ్వనున్నాడు లోకేష్.
అల్లు అర్జున్ రేంజ్ పుష్ప సినిమా తర్వాత మారిపోయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద విపరీతమైన నమ్మకాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు.
అయితే అల్లు అర్జున్ కి 20 రోజుల క్రితం లోకేష్ కనగరాజ్ ఒక కథను చెప్పారు. ఆ కథకు అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరి ప్రాజెక్టు పట్టాలెక్కితే మాత్రం మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సన్ నెట్వర్క్ లో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడు.
మరోవైపు కేవీఎన్ ప్రొడక్షన్స్ లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రొడక్షన్ హౌస్ కూడా దీని గురించి చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు జరుగుతుంది లేకపోతే బన్నీ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ జరుగుతుంది. రెండిట్లో ఏదో ఒకటి జరగటం మాత్రం ఖాయం అనేది ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్న న్యూస్.
Also Read: Nidhhi Agerwal : అభిమానుల్లో అత్యుత్సాహం తగ్గాలి, నిధి అగర్వాల్ తో అలాంటి ప్రవర్తన