BigTV English

AP Liquor Scam Case: మిథున్‌రెడ్డి‌ అడ్డంగా బుక్ అయినట్లేనా?

AP Liquor Scam Case: మిథున్‌రెడ్డి‌ అడ్డంగా బుక్ అయినట్లేనా?

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాంలో A4 నిందితుడు రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రాజమండ్రి సెంట్రల్ ‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు ఆగస్టు1 వరకు రిమాండ్ విధించింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో, స్కాంలో మిథున్ పాత్ర కీలక మంటున్న సిట్ అధికారులు, ఆయన్ని విచారించాల్సి ఉందని ఆధారాలు సమర్పించడంతో కోర్టు రిమాండ్ విధించింది. అయితే మిథున్ తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, వైసీపీ అధ్యక్షుడు జగన్‌లు మాత్రం ఇది కక్షపూరిత అరెస్టని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. వాస్తవానికి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్ కాకపోవడంతో మిథున్‌రెడ్డి అరెస్ట్ కూడా ఉండదనుకున్నారు. మరి మిథున్ అరెస్ట్ అంత స్పీడ్‌గా ఎలా జరిగింది? సిట్ సేకరించిన పకడ్బందీ ఆధారాల్లేంటి?


ఏపీ లిక్కర్ స్కాంలో రింగ్ మాస్టర్‌లా వ్యవహరించిన మిథున్‌రెడ్డి

వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కాంలో రింగ్ మాస్టర్‌లా వ్యవహరించి అరెస్ట్ అయ్యారు. జగన్ కోటరీలో అత్యంత కీలకంగా వ్యవహరించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్‌రెడ్డి అరెస్ట్ అవ్వడం జగన్, పెద్దిరెడ్డిలకు పెద్ద ఎదురు దెబ్బే అంటున్నారు. నిజానికి మిథున్‌రెడ్డి ఇంత త్వరగా అరెస్ట్ అవుతారని ఎవరూ భావించలేదు. ఇంతకన్నా మించిన వైఎసర్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన జగన్ సోదరుడు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంత వరకు అరెస్ట్ కాలేదు. ఆ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నప్పటికీ అవినాష్ అరెస్టు వ్యవహారం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది.


సిట్ ఏర్పాటు చేసి విచారణ కొనసాగించిన కూటమి ప్రభుత్వం

మరోవైపు ఛత్తీస్‌ఘడ్ మద్యం కేసులో అవినీతి రూ.2 వేల కోట్లే అంటున్నారు. దాన్ని విచారించిన ఈడీ, సీబీఐలు మూడు వేలకు పైగా కుంభకోణం జరిగిందని ఆరోపణలున్న ఏపీ లిక్కర్ స్కాంని మాత్రం టేకప్ చేయలేదు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాం కూడా అయిదారు వందల కోట్లకు మించదంటున్నారు. అలాంటిది చత్తీస్‌ఘడ్, ఢిల్లీ లిక్కర్ స్కాంలలో కేంద్రం చూపించిన అత్యుత్సాహం, సీబీఐ, ఈడీలు ప్రదర్శించిన దూకుడు అందరికీ తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కాంను సీబీఐ విచారించాలని విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక కూటమి ప్రభుత్వమే సిట్ ఏర్పాటు చేసి విచారణ సాగించింది.

10 పేజీల రీజన్స్ ఫర్ అరెస్టు రిపోర్టు దాఖలు చేసిన సిట్

సిట్ విచారణలో కీలక అంశాలు వెల్లడవ్వడంతోనే మిథున్‌రెడ్డి మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో 10 పేజీల రీజన్స్‌ ఫర్‌ అరెస్టు రిపోర్టు దాఖలు చేశారు సిట్‌ అధికారులు. లిక్కర్‌ స్కాం కేసులో మిథున్‌రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు. మనీ ట్రయల్‌తో పాటు కుట్రదారుడుగా మిథున్‌రెడ్డిని పేర్కొన్నారు. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్థారించారు. ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సత్యప్రసాద్‌కు ఐఏఎస్‌గా పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపించి స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించారని సిట్‌ అధికారులు అభియోగం మోపారు.

గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులకు నగదు పంపిణీపై అభియోగాలు

యావత్తు లిక్కర్ కుట్ర అమలుకు సత్యప్రసాద్‌ను ఉపయోగించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అధికారులతో సమావేశమై డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారని, లిక్కర్‌ స్కాంలో లోతైన కుట్ర దాగి ఉందని రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ అధికారులు వివరించారు. ఈ కుట్ర ఛేదించేందుకు భవిష్యత్‌లోనూ దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. ముడుపుల ద్వారా నిందితులు, ప్రైవేట్‌ వ్యక్తులు, ఉన్నతాధికారులు రాజకీయ నేతలు, గత ప్రభుత్వంలో ఉన్నవారు లబ్ధి పొందారని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు అరెస్టయిన వారితో పాటు పరారీలో ఉన్నవారిని కూడా.. అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని తెలిపారు సిట్‌ అధికారులు.

Also Read: ధర్మపురి అరవింద్ సైలెంట్ వెనుక కారణాలు ఇవేనా?

మిథున్ రెడ్డిపై గతంలోనూ 7 క్రిమినల్ కేసులు

మద్యం ముడుపులను 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. నిందితులకు రాజకీయ పలుకుబడి ఉండటంతో.. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సిట్‌ అధికారులు తెలిపారు. మరింత దర్యాప్తు కోసం మిథున్‌రెడ్డికి రిమాండ్‌ విధించాలని కోరారు. ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. మిథున్‌రెడ్డిపై గతంలోనూ 7 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని సిట్‌ అధికారులు వెల్లడించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థకు మిథున్‌రెడ్డి సహకరించలేదని గుర్తుచేశారు. నిందితుడు మిథున్‌రెడ్డి కస్టోడియల్‌ విచారణ అవసరమని చెప్పారు. ముడుపుల పంపిణీ, కమీషన్లు ఎవరెవరికి చేరాయో తెలుసుకోవాల్సి ఉందని వెల్లడించారు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారులెవరో తేలాల్సి ఉందని సిట్‌ అధికారులు పేర్కొనడంతో.. ఆయన అరెస్ట్, రిమాండ్ ఖరారయ్యాయంటున్నారు.

Story By KLN, Bigtv

Related News

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో స్టోరీ… ఇమ్మానుయేల్ నడుము గిల్లిన తనూజ!

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

American Gun Culture: హద్దులు దాటుతున్న అమెరికా గన్ కల్చర్.. ట్రంప్ ఫ్రెండ్ చార్లీ కిర్క్ పై గన్ ఫైర్ దేనికి సంకేతం?

Big Stories

×