BigTV English

China – Pakistan: పాకిస్తాన్ మూడు ముక్కలుగా విడిపోనుందా? చైనా మాస్టర్ ప్లాన్

China – Pakistan: పాకిస్తాన్ మూడు ముక్కలుగా విడిపోనుందా? చైనా మాస్టర్ ప్లాన్

China – Pakistan: అటు బలూచిస్తాన్. ఇటు సింధ్.. మరో వైపు POJK. అంతర్యుద్ధాలతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోందా? భారత్ తో యుద్ధం మొదలైతే.. పాకిస్థాన్ మూడు ముక్కలయ్యే అవకాశముందా? ఈ మూడు చోట్ల అసలేం జరుగుతోంది? పాకిస్థాన్ మానవ హక్కుల సంస్థ నివేదికలు ఏం చెబుతున్నాయి. ఒక్క పాక్ వంద నిరసనలు, వేయి ఆందోళనలు, లక్ష గొడవలు, కోటి కొట్లాటలుగా ఉన్న అక్కడి స్థితిగుతులకు అద్దం పట్టేలాంటి స్థితిగతులేంటి? హ్యావే లుక్.


2 దైవ దూషణ హత్యలు
4 తిరుగుబాటు మరణాలు
24 మంది గ్రూపు హత్యలు
379 కిడ్నాప్ కేసులు
405 పరువు హత్యలు
1,641 గృహ సంబంధిత హత్యలు
1,630 మైనర్లపై హింస కేసులు
2500 ఉగ్రవాద మరణాలు
4,175 అత్యాచార కేసులు

సింధ్, పంజాబ్‌లో 4,864 పోలీసు ఎన్‌కౌంటర్లు


ఇవీ POJKలో పెరుగుతున్న హింస తాలూకూ గణాంకాలు, బలూచిస్తాన్ లోని హింసాత్మక స్థితిగతులు. పిల్లలు, మహిళలు, వృద్ధుల పట్ల జరుగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘనలకు తార్కాణాలు. అంతే కాదు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, బలూచిస్తాన్ లో పెరుగుతున్న రాజకీయ అణిచివేత, హింసాత్మకను హైలెట్ చేస్తూ పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ తన స్టేట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ 2024 రిపోర్ట్ ద్వారా వెలికి తీసిన వాస్తవ స్థితి- పరిస్థితి.. ఇదీ!

పౌర స్వేచ్ఛ తగ్గుదల, రాజకీయ అణిచివేత పెరుగుదల

ఒక పక్క పెహల్గాం దాడులతో లోలోన ఒణుకుతున్న పాకిస్థాన్ కి ఈ HRCP రిపోర్ట్ లాగి లెంపకాయ కొట్టినంత పని. అలాగని పాకిస్థాన్ ధోరణిలో మార్పు వచ్చిందా అంటే అలాగేమీ కనిపించడం లేదు. కానీ ప్రపంచం గుర్తించాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగానే తెలుస్తోంది. పాక్ ప్రభావిత పాలిత ప్రాంతాల్లో.. పౌర స్వేచ్ఛ భారీగా తగ్గడం, రాజకీయ అణిచివేత విపరీతంగా పెరగడంతో.. కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో, జనావాసాల్లో హింస భయంకరంగా పెరుగుతోన్న దృశ్యం కనిపిస్తోంది.

పాక్-2024 ఎన్నికల్లో అవకతవకలు

పాకిస్థాన్ లో 2024 ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. కొత్త ప్రభుత్వం లోపభూయిష్టమైన చట్టాలను వెంటనే ఆమోదించడం ద్వారా అప్రజాస్వామిక శక్తులు తిరిగి పుంజుకోడానికి అవకాశమేర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్.

ఖైబర్ పంక్తుంక్వా, బలూచిస్తాన్ లో హింస

ఖైబర్ పంక్తుంక్వా, బలూచిస్తాన్ లో హింస పెరుగుదల కారణంగా ఉగ్రవాద సంబంధిత మరణాలు 2500 వరకూ ఉండటం తీవ్ర అభ్యంతరకరంగా భావిస్తోంది HRCP. 24 మంది, కొన్ని వేర్పాటువాద గ్రూపుల చేతిలో హతం కాగా.. వీటిలో కొన్ని దైవ దూషణకు సంబంధించిన వ్యవహారాలుండటం ఆందోళనకరంగా భావిస్తోంది HRCP.

POJKAలో గోధమ పిండి గొడవలు

పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో గోధుమ పిండి గొడవలు జరుగుతున్నాయి. అంతే కాదు కరెంటు చార్జీల పెరుగుదలపై సామూహిక నిరసనలు హోరెత్తిస్తున్నాయి. ఇలాంటి నిరసనలకు కూడా ఇక్కడ ఆస్కారం లేదన్న మాట వినిపిస్తోంది. కనీసం ఆందోళన చేపట్టడానికి కూడా తగిన స్వేచ్ఛలేని వాతావరణం కనిపిస్తోంది.

4,864 పోలీసు ఎన్‌కౌంటర్లా- HRCP చైర్‌పర్సన్ అసద్

HRCP చైర్‌పర్సన్ అసద్ ఇక్బాల్ భట్ చెప్పేదాన్ని బట్టీ చూస్తుంటే.. 2024లో 379 కిడ్నాప్ లు జరిగాయి. వీటిలో రెండు హత్యలు చిన్న చిన్న మాటల కారణంగా ఏర్పడ్డవి. సింధ్, పంజాబ్ లలో.. ఏకంగా 4,864 పోలీసు ఎన్‌కౌంటర్‌లు జరిగాయంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు.

సాధారణ నిరసనల్లో కూడా కిడ్నాప్ లు ఏంటి-మాజీ HRCP చైర్‌పర్సన్

కేవలం యుద్ధం మాత్రమే కాదు.. సాధారణ నిరసనల్లో కూడా కిడ్నాప్ లు ఏంటి? ఇది ఎంత మాత్రం అభిలషణీయం కాదన్నారు మాజీ HRCP చైర్‌పర్సన్ హీనా జిలానీ. అన్ని హింసాత్మక చర్యలనూ చట్టపరమైన మార్గాల ద్వారా పరిష్కరించాలని సూచించారు. 2024 మేలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిరసనలు సామూహిక తిరుగుబాటుగా రూపాంతరం చెందాయి. ముజఫరాబాద్ వరకూ ఒక ర్యాలీ నడిచింది. అధికారులు ఈ తిరుగుబాటును అణిచివేసే యత్నం చేశారు. దీని కారణంగా ఒక పోలీసు అధికారితో పాటు నలుగురు మరణించారు. దీంతో భారీ ఎత్తున అరెస్టులతో పాటు మరింత హింస పెట్రేగింది.

ఇదీ బలూచిస్తాన్, సింధ్, గిల్గిట్ రియల్ పిక్చర్

ఇక బలూచిస్తాన్ లో కిడ్నాప్ లు నిత్య కృత్యమయ్యాయి. ఈ విషయంప తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది HRCP రిపోర్ట్. ఇక 2024లో మహిళలు, పిల్లలపై హింస విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్. సుమారు 405 పరువు హత్యలు, 1,641 గృహ సంబంధిత హత్యలు, 4,175 అత్యాచార కేసులు, మైనర్లపై హింసకు సంబంధించిన 1,630 ఘటనలు సరికాదని తెలిపింది. ఇవన్నీ బలూచిస్తాన్, సింధ్, గిల్గిట్ లోని అంతర్గత వ్యవహారాలను ఎత్తి చూపుతున్నాయి. ఈ ప్రాంతంలోని తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను చాటి చెబుతున్నాయి. ఇదిక్కడి నిజ రాజకీయ సామాజిక చిత్రంగా తెలుస్తోంది.

ఇస్లామాబాద్ కి సన్నగిల్లుతోన్న పట్టు

వీటన్నిటిని బట్టీ చూస్తే ఇస్లామాబాద్ కి బలూచిస్తాన్, సింధ్, గిల్గిట్- బాల్టిస్తాన్ పై పట్టు క్రమంగా సడలుతున్నట్టు కనిపిస్తోంది. ఇది పాకిస్థాన్ సామాజిక రాజకీయ చిత్రంలోని చీలికలను
స్పష్టంగా తెలియ చేస్తోందని విశ్లేషిస్తున్నారు నిపుణులు.

పాక్ మూడు ముక్కలు కావడానికి గల అవకాశాలు ఎలాంటివి?

ఎలాగూ కుప్పకూలే పాకిస్థాన్ ని మనం కూల్చి ఆ చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు? సరిగ్గా మోడీ ఆలోచన కూడా ఇదేనా? పాకిస్థాన్ అంతర్గత యుద్ధాలతో అతలాకుతలమై పోతోందా? ప్రస్తుతం బలూచిస్తాన్, సింధ్, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతాలలో నిరసనలు అత్యంత తీవ్రంగా ఉన్నాయా? బలూచిస్తాన్ నాట్ పాకిస్థాన్ అంటూ ఆ దేశ వాసులు చేసే పోరాటం గానీ తీవ్రతరమైతే చైనా తో సంబంధాలు కూడా తెగిపోతాయా? ధోవల్ చేసిన వార్నింగులకు అర్ధమేంటి? పాక్ మూడు ముక్కలు కావడానికి గల అవకాశాలు ఎలాంటివి? చూద్దాం..

బలూచిస్తాన్, సింధ్, గిల్గిట్-బాల్టిస్తాన్లో నిరసనలు

పాక్ అష్ట దిగ్బంధంలో చిక్కడం ఖాయం? భారత్ పై చిన్నా చితక ఉగ్రదాడుల ద్వారా ప్రపంచాన్ని దృష్టి మరలుస్తోంది పాకిస్థాన్. దీని వెనకగల కారణం ఇదీ. ఇప్పటికే బలూచిస్తాన్, సింధ్, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతాలలో నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ నిరసనలు ప్రధానంగా.. భూమి గొడవలు, వనరుల్లో వాటాల తగువులాటలు, వీటి కారణంగా ఏర్పడుతోన్న అలజడులు, తిరుగుబాట్లు. వీటిని అణగదొక్కడానికి బలవంతపు కిడ్నాపులకు పాల్పడ్డం వంటి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి.

సింధ్ చొలిస్థాన్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా నిరసనలు

బలూచిస్తాన్ లో బలూచ్ వేర్పాటు వాద తిరుగుబాటుదారులు చైనీయులపై దాడులకు తెగబడ్డారు. సింధ్ లో చొలిస్థాన్ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. గిల్గిట్ బాలిస్టాన్ లో మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

చైనా- పాక్ ధోరణిపై BLA తీవ్ర నిరసన

పాక్ అంతర్గతంగా ఏమంత గొప్పగా లేదనడానికి ఎన్నో ఉదాహరణలు. బలూచిస్తాన్ లో, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తిరుగుబాటు దళాలు, చైనా- పాక్ వ్యవహార శైలిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అంతే కాదు దాడులకు తెగబడ్డాయి.. ఈ నిరసనలు బలూచ్ ప్రజల ఆకాంక్షలు, స్వయంప్రతిపత్తి, వారి హక్కులకు ప్రతీకగా నిలుస్తున్నాయి.

చొలిస్థాన్ కెనాల్ ద్వారా సింధూ జలాలు బంజరు భూములకు

ఇక సింధ్ లో చొలిస్థాన్ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనల జరిగాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సింధూ నది నీటిని బంజరు ప్రాంతాలకు మళ్లించనున్నారు. ఈ నిరసనలు సింధూ నీటి పంపిణీ, నీటి హక్కులకు సంబంధించినవి. ఈ విషయంలో సింధూ ప్రజల ఆందోళనను ప్రతిబింబిస్తోంది.

సిందూ నీటి పంపిణీ, హక్కులకు వ్యతిరేకంగా పోరాటాలు

ఇక గిల్గిట్-బాల్టిస్తాన్ విషయానికి వస్తే.. ఇక్కడ, పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క మైనింగ్ విధానాలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు జరిగాయి. ఈ ప్రాంతంలో, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు తమ భూమి ఇతర వనరుల విషయంలో.. పాక్ ప్రభుత్వ విధానం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గిల్గిట్-బాల్టిస్తాన్ చట్టపరమైన గుర్తింపు, రాజ్యాంగ హోదా కూడా వివాదాస్పదంగానే ఉంది.

అంతర్గత అసంతృప్తి, భిన్న ప్రాంతాల సమస్యలు

ఈ నిరసనలు పాకిస్తాన్ లోని అంతర్గత అసంతృప్తికి, భిన్న ప్రాంతాల ప్రజల సమస్యలకు నిదర్శనం. ఈ ఆందోళనలు పాకిస్తాన్ ప్రభుత్వం, దాని పాలన పట్ల ప్రజల అసంతృప్తికి సంకేతం.. గా భావిస్తున్నారు విశ్లేషకులు. వచ్చే రోజుల్లో భారత్ తో యుద్ధం వస్తే.. పాకిస్థాన్ ముక్కలు చెక్కలు కావడం ఖాయంగా తెలుస్తోంది.

బలూచిస్తాన్ విడిపోతే పాక్ చేయి వదిలే చైనా?

ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే.. పాకిస్థాన్ నుంచి బలూచిస్తాన్ విడివడితే.. ఆటోమేటిగ్గా చైనా పాక్ చేయి వదిలేస్తుంది. దానికి కావల్సింది ఈ ప్రాంతమే. తానిచ్చే నిధులేవో ఈ ప్రాంతానికే ఇస్తుంది. ఈసారి ముంబై తరహా దాడిగానీ జరిగితే పాక్ బలూచిస్తాన్ ని కోల్పోతుందని అజిత్ దోవల్ అందుకే అంటోంది.

ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తోన్న..

ఈ అంశాలపై సునిశిత దృష్టి సారించిన మోడీ ప్రభుత్వం ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాలని చూస్తోంది. తన సిక్స్ డైమన్షన్ వార్ స్ట్రాటజీలో ఇది కూడా ఒక భాగమే. తొలుత పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో జల అలజడి సృష్టించి.. తద్వారా దాన్ని స్వాధీనం చేసుకునే ఎత్తుగడ వేస్తోంది భారత్.

బలూచిస్తాన్, సింధ్, గిల్గిట్-బాల్టిస్తాన్ వాసులు

బలూచిస్తాన్లోని అంతర్గత వ్యవహారాలను అనువుగా మలుచుకోవడం. గిల్గిట్ బాలిస్టాన్ లో మైనింగ్ కార్యకలాపాల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న ఈ ప్రాంత వాసులకు మద్ధతునివ్వడంపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది భారత్. ఇక సింధూ నదీ జలాల నీటి పంపిణీ హక్కుల సంగతి సరే సరి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన సమస్యలున్నాయి. వీటికారణంగా పాకిస్థాన్ ప్రభుత్వంతో ఉండాల్సిన గొడవలున్నాయి. బలూచిస్తాన్, సింధ్, గిల్గిట్-బాల్టిస్తాన్ వాసులు కూడా ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్నారు. ఒక వేళ పాకిస్థాన్ భారత్ తో యుద్ధం కొని తెచ్చుకుంటే ఈ ప్రాంతాలు విడిపోవడం ఖాయంగా తెలుస్తోంది.

పాక్ అష్ట దిగ్బంధంలో చిక్కడం ఖాయం?

ఇప్పటికే ఆఫ్గనిస్థాన్ సైతం భారత్ తో సఖ్యత.. పాక్ అంటేనే విముఖత చూపిస్తోన్న విధం కనిపిస్తోంది. మనల్ని ఇరకాటంలో పెట్టేలా పాక్- చైనాతో ఎలా చెలిమి చేస్తోందో.. సరిగ్గా ఆఫ్గనిస్థాన్ సైతం భారత్ తో స్నేహ బంధాన్ని ఆశిస్తోంది. ఈ దిశగా భారత్ కూడా గత కొంతకాలంగా తాలిబన్లతో సఖ్యంగా ఉంటూ వస్తోంది. వచ్చే రోజుల్లో ఈ బంధం మరింత బలపడేలా.. పాక్ గుండెల్లో గునపం దిగేలాంటి ప్రకటన వెలువడబోతోంది. దీంతో పాకిస్థాన్ అష్ట దిగ్బంధనంలో చిక్కడం ఖాయంగా తెలుస్తోందంటున్నారు దక్షిణాసియా రాజకీయ వ్యవహారాల నిపుణులు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×