BigTV English

Single : ఇష్యూ ని షిఫ్ట్ చేస్తున్నారు, దిల్ రాజు, అల్లు అరవింద్ డాన్స్ లే ప్రమోషన్ గా మారాయి

Single : ఇష్యూ ని షిఫ్ట్ చేస్తున్నారు, దిల్ రాజు, అల్లు అరవింద్ డాన్స్ లే ప్రమోషన్ గా మారాయి

Single : రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మనోభావాలు దెబ్బతినడం అనేది కామన్ గా మారిపోయింది. చిన్న చిన్న పదాలకు కూడా ఆయా సంఘాలు దిగి ధర్నాలు చేస్తున్నాయి. ఒక్క మాట అటు ఇటు మాట్లాడినా కూడా అన్ని దగ్గర పెట్టుకొని సవినయంగా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు కూడా ఒక వర్గాన్ని బాధపడేలా చేశాయి. తెలుగు సినిమా చాలా పాటలు పదాలు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమా విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. మొదటి ఆ సినిమాకి వాల్మీకి అనే టైటిల్ అనుకున్నారు. దానివలన బోయ సంఘం వాళ్ల మనోభావాలు దెబ్బతినడంతో టైటిల్ మార్చాల్సి వచ్చింది.


సింగిల్ మూవీ ట్రైలర్ ఇష్యూ

శ్రీ విష్ణు నటించిన సింగిల్ సినిమా మే తొమ్మిదిన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను గీత ఆర్ట్ సంస్థ నిర్మించింది. ఇటీవలే విడుదలైన ఈ ట్రైలర్ తీవ్రమైన చర్చలకు దారితీసింది. ఈ సినిమా ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కామెడీగానే ఉంటుంది. కొన్నిచోట్ల శ్రీ విష్ణు కొంతమంది హీరోలను ఇమిటేట్ చేశాడు. అయితే ఇది సాధారణమైన ఒక యూత్ కథ అని, ఎవరైనా కూడా వాళ్ళ అభిమాన హీరోలను ఇమిటేట్ చేయడం అనేది కామన్ గా జరుగుతుందని, అలానే ఈ సినిమాలో కూడా చేయాల్సి వచ్చింది అని శ్రీ విష్ణు క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో శివయ్య అనే డైలాగ్, మంచు కురిసిపోవడం అనే డైలాగ్ కూడా విపరీతంగా ఒక ప్రముఖ హీరోను బాధపెట్టాయి అని తెలియగానే శ్రీ విష్ణు సారీ కూడా చెప్పాడు.


ఆ వైరల్ వీడియోలే ప్రమోషన్

సింగిల్ ట్రైలర్లో శ్రీ విష్ణు చాలామందిని ఇమిటేట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ తరుణంలో చాలామంది మీడియా పీపుల్ తో కలిసి దిల్ రాజు డాన్స్ చేశారు. ఆ డాన్స్ అప్పట్లో వైరల్ గా మారింది. ఆ తర్వాత అల్లు అరవింద్ సాయి పల్లవి తో కలిసి డాన్స్ చేసిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఈ రెండు వీడియోస్ ఇమిటేషన్ కూడా సింగిల్ సినిమా ట్రైలర్ లో మనకు కనిపిస్తాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో ఇవానా, కేతిక శర్మ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ వైరల్ అయిన వీడియోకి డాన్సులు చేస్తూ ఈ సినిమాని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ గా మారింది.

Also Read : Srinidhi shetty : గ్యాప్ వచ్చిన పర్లేదు , సక్సెస్ తో మొత్తం కవర్ అయిపోయింది

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×