RCB Fans Cricket: ఇండియాలో క్రికెట్ కు ఉన్న ప్రాధాన్యత అంతా కాదు. ఇండియాలోని ఏ గల్లికి వెళ్లిన క్రికెట్ కచ్చితంగా ఆడతారు. ఇండియా జాతీయ క్రీడ క్రికెట్ కానప్పటికీ… ప్రతి మ్యాచ్ టీవీల్లో చూస్తారు. టీవీలో చూడడమే కాకుండా… ఆదివారం వస్తే చాలు మ్యాచ్ ఆడేస్తారు. అంతలా ఇండియాలో క్రికెట్ పాపులారిటీ సంపాదించుకుంది… అయితే కొంతమంది క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్ ఎంచుకుంటారు. మరి కొంతమంది చిన్న చిన్న గల్లీలో క్రికెట్ ఆడుతూ ఉంటారు. మరికొంతమంది ఊరు చివర… ఆడి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
Also Read: SRH Team Maldives trip : కలసి ఉంటే కలదు సుఖం… తెలుగు హీరో అయిపోయిన ప్యాట్ కమిన్స్
నీళ్లలోనే క్రికెట్.. ఆకట్టుకుంటున్న వీడియో
ఎండాకాలం వచ్చిందంటే కుర్రాళ్లంతా క్రికెట్ ( Cricket) ఆడుతూ ఉంటారు. అయితే తాజాగా ఓ గ్యాంగ్… నీళ్లలోనే క్రికెట్ ఆడుతోంది. ఊరు చివరన ఉన్న చెరువుగట్టున క్రికెట్ ఆడుతూ సందడి చేసింది. అయితే ఈ కుర్రాళ్ళు నీళ్లనే పిచ్ గా ఎంచుకున్నారు. నీటి కాల్వకు రెండు వైపులా వికెట్లు పాతి… నీళ్లను పిచ్ చేసుకున్నారు. ఈ విషయం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ గట్టు నుంచి బౌలింగ్ వేయడం… ఆ గట్టున ఉన్న బ్యాటర్ చితక బాదడం.. మనకు కనిపిస్తుంది.
వాస్తవానికి బంతి నేలపైన వేస్తేనే బౌన్స్ అవుతుంది. కానీ ఈ కుర్రాళ్ళు నీళ్ల పైన కూడా… బంతిని బౌన్స్ అయ్యేలా వేస్తున్నారు. అందులోనూ విరాట్ కోహ్లీ జెర్సీ తో బౌలింగ్ అదరగొడుతున్నాడు. అతని బౌలింగ్లో అవతలి వైపు బ్యాటింగ్ చేస్తున్న కుర్రాడు.. మొదటిసారి క్లీన్ బౌల్డ్ కాగా… మరోసారి వేసిన బంతిని ఇరగదీసి సిక్స్ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్
ఒరేయ్ మీరు ఏంట్రా… క్రికెట్ అంటే గ్రౌండ్లో ఆడాలి… లేదా గల్లీలో ఆడాలి.. మీరు ఏకంగా నీళ్లలోనే క్రికెట్ ఆడుతున్నారు ఏంట్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది బౌలర్ వేసేది ప్లాస్టిక్ బంతి అంటున్నారు. ఇక మరికొంతమంది విరాట్ కోహ్లీ ( Virat Kohli ) జెర్సీ వేసుకున్న కుర్రాడు త్రో బౌలింగ్ వేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. త్రో బౌలింగ్ వేసిన సరే… నీళ్లపై బంతిని బౌన్స్ అయ్యేలా వేయడం మాత్రం గ్రేట్ అంటూ మరి కొంతమంది అంటున్నారు. ఇక మరికొంతమంది… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులకు మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయని.. సెటైర్లు పేల్చుతున్నారు. ఇలాంటి ఆలోచనలు తప్ప కప్పు మాత్రం కొట్టబోరని కూడా చురకలు అంటిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో క్రికెట్ అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను చూసిన చిన్న కుర్రాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read: Rohit Sharma – DRS: ముంబై మ్యాచ్ ఫిక్సింగ్.. అడ్డంగా దొరికిపోయిన రోహిత్.. రాజస్థాన్ ఎలిమినేట్