Big Stories

Elon Musk India Tour: ఎలాన్ మస్క్ భారత్ టూర్ వాయిదా.. కాకపోతే..?

Elon Musk India Tour Cancelled: టెస్లా కంపెనీ చీఫ్ ఎలాన్ మస్క్ భారత టూర్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ముఖ్యంగా టెస్లాకు సంబంధించి ముఖ్యమైన బాధ్యతల కారణంగా పర్యటన డిలే అవుతుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆయన.

- Advertisement -

షెడ్యూల్ ప్రకారం ఈనెల 21, 22న పర్యటించాల్సి ఉంది. ఈ టూర్‌లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీతో ఆయన భేటీ జరగాల్సివుంది. ఇండియాలో పెట్టుబడుల గురించి ఆయన ప్రకటన చేస్తారని భావించారు. ఈలోగా టూర్ వాయిదా పడింది. టెస్లా కంపెనీ భారత్‌‌‌‌‌లోకి ప్రవేశిస్తుందని కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. గతంలో పలువురు కేంద్రమంత్రులు ఈ వ్యవహారంపై మాట్లాడారు.

- Advertisement -

విద్యుత్ కార్లకు ఇండియా పెద్ద మార్కెట్ కావడంతో మస్క్ దృష్టి ఇటువైపు పడింది. ఇండియాలో తయారీ కేంద్రం ఏర్పాటుకు ఆ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలను  సంప్రదించినట్టు సమాచారం. వాటిలో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు లేదా మూడు బిలియన్ డాలర్లు వరకు పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Also Read: PM Modi On Mahaveer Jayanti: మహవీర్ జయంతి.. 2550వ నిర్వాణ మహోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..

కొన్నాళ్ల కిందట ప్రధాని నరేంద్రమోడీ ఈ వ్యవహారంపై ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడారు. భారత్‌కు పెట్టుబడులు రావాలని తాను కోరుకుంటున్నానని, ఇక్కడ ఎవరు పెట్టుబడి పెడతారనేది ముఖ్యం కాదన్నారు. తయారీ రంగంలో ఇక్కడ ప్రజల ముద్ర ఉండాలన్నారు. అప్పుడే మన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News