IPL 2024 37th Match – PBKS Vs GT Dream11 Prediction: ఐపీఎల్ లో కొందరు ముందుకెళ్లి, దాన్ని నిలబెట్టుకునేందుకు తెగ కష్టపడుతున్నారు. కొందరు ఓటమి బాటలోనే ఉంటూ, దానినే కొనసాగిస్తూ వెళ్లిపోతున్నారు. ఇప్పుడు పాయింట్ల పట్టికలో లాస్ట్ నుంచి 8, 9 స్థానాల మధ్య ఊగిసలాడుతున్న గుజరాత్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య పోటీ జరగనుంది. రాత్రి 7.30కి మొహలీలో మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 4 మ్యాచ్ లు జరిగాయి. వాటిలో రెండింట్లో గుజరాత్, రెండింట్లో పంజాబ్ గెలిచాయి. మొత్తానికి ఇక్కడ మాత్రం సమ ఉజ్జీలుగా ఉన్నాయి. మరి నేటి మ్యాచ్ లో ఎలా ఆడుతారనేది చూడాల్సిందే.
ఇకపోతే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ కి అగ్ని పరీక్షలా మారింది. నెంబర్ వన్ స్థానంలో పెట్టి జట్టుని హార్దిక్ పాండ్యా అప్పగించాడు. తను వెళ్లిన తర్వాత అదే జట్టు ఇప్పుడు చిట్టచివరి స్థానాలకు వెళ్లిపోతోంది. అంటే హార్దిక్ పాండ్యాలాంటి ఆల్ రౌండర్ లేకనా, నాయకత్వ లోపమా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో అత్యంత దారుణంగా ఆడి 89 పరుగులకి ఆలౌట్ అయిపోయారు. ఇంతటి పతనావస్థలో జట్టు విలవిల్లాడుతోంది. ఇలాగే ఆడితే బహుశా వచ్చే సీజన్ నాటికి గిల్ కెప్టెన్సీ ఉండకపోవచ్చుననే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: థర్డ్ కి లాస్ట్ కి మధ్య పోరు.. నేడు కోల్ కతా వర్సెస్ ఆర్సీబీ
ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే కెప్టెన్ శిఖర్ ధావన్ అర్థాంతరంగా జట్టుని వదిలేసి వెళ్లిపోయాడు. భుజం గాయమని చెప్పారు గానీ, బహుశా ఇక రాకపోవచ్చునని అంటున్నారు. ఎందుకంటే జట్టు పతనావస్థలోకి పడిపోతుండటంతో మనస్థాపంతోనే తను వెళ్లిపోయాడని అంటున్నారు. తన ప్లేస్ లో వచ్చిన శ్యామ్ కర్రన్ కెప్టెన్సీలో ఆకట్టుకుంటున్నాడు కానీ, అదృష్టం కలిసి రావడం లేదు.
కాకపోతే టాప్ ఆర్డర్ ఘోరవైఫల్యం జట్టుని కుంగదీస్తోంది. బౌలింగు బలంగా ఉన్నా, బ్యాటింగ్ వీక్ గా ఉండటం పెద్ద సమస్యగా మారింది. ఆల్ రౌండర్ అశుతోష్ శర్మ, శశంక్ సింగ్ ఆడటంతో ముంబై తో జరిగిన మ్యాచ్ లో విజయం ముంగిట వరకు వచ్చి ఆగిపోయింది. టాప్ ఆర్డర్ కరెక్టుగా ఉండి, ఉంటే మ్యాచ్ గెలిచేదని అందరూ చెబుతున్నారు. మరి నేటి మ్యాచ్ లో ఎలా ఆడతారో వేచి చూడాల్సిందే.