BigTV English

Drugs Case: పబ్బుల్లో ఐటీ ఎంప్లాయిస్‌ గబ్బు గబ్బు.. ఎందుకిలా మారుతున్నారు? కారణం ఇదేనా?

Drugs Case: పబ్బుల్లో ఐటీ ఎంప్లాయిస్‌ గబ్బు గబ్బు.. ఎందుకిలా మారుతున్నారు? కారణం ఇదేనా?


Drugs Case : డ్రగ్స్ కేసులో ఎక్కువ దొరుకుతోంది సాఫ్ట్ వేర్ ఎంప్లాయిసేనా? మొన్న డెకాయ్ ఆపరేషన్, నిన్న ఫామ్ హౌజ్ పార్టీ కొలాబరేషన్.. ఎటు చూసినా ఐటీ ఎంప్లాయిసే పట్టుబడుతున్నారెందుకని? పబ్బుల్లో గబ్బు గబ్బు వీరి పనే.. డ్రగ్ పార్టీల్లో దొరుకుతోందీ వీళ్లే. జీతాలెక్కువైన పైత్యమా? వీకెండ్ సెలవులు కారణమా? లేక నిజంగానే విపరీతమైన వర్క్ ప్రెజరా? ఇంత చదువుకున్న వీళ్లెందుకింతటి వ్యసనపరులుగా మారుతున్నారు? వీళ్లను ఇంకా బాధితులుగానే గుర్తించాలా.. డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప కంట్రోల్ కాదా.. ఇటీ ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది?

భారీ మొత్తాలైనా డ్రగ్స్ కొంటోన్న ఐటీ ఎంప్లాయిస్


రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకున్నా దందా మాత్రం ఆగడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా.. డ్రగ్స్ తీసుకుంటూనే ఉన్నారు. చాలా మంది డ్రగ్స్‌ సరఫరాను ఆదాయ వనరుగా ఎంచుకుంటున్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలనుంచి పెద్దఎత్తున గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. ఇతరరాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్‌ ఇక్కడ ఐదారు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. అయినా సరే ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా.. కొంటున్న వారెవరని చూస్తే అధిక మొత్తంలో కనిపిస్తున్న వారు ఐటీ ఎంప్లాయిసే. రీసెంట్‌గా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆరుగురు ఐటీ ఉద్యోగులు డ్రగ్స్ తో దొరికారు. వారి నుంచి ఖరీదైన మద్యం సీసాలతోపాటు, LSD, హాష్ ఆయిల్ సహా ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కిట్‌తో పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్‌గా తేలింది. అభిజిత్ బెనర్జీ అనే వ్యక్తి తన బర్త్‌డే అంటూ ఫామ్ హౌస్ బుక్ చేసుకోవడంతో అతడితోపాటు ఫామ్‌ హౌస్‌ యజమానిపైనాకూడా కేసు నమోదు చేశారు. డ్రగ్స్ సేవించిన ఆరుగురు ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేయగా..మరోకరు పరారీలో ఉన్నారు. గతంలోనూ ఈ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలు జరిగాయా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.

గతంలో కొత్త పేట. మారుతీ నగర్‌లో డ్రగ్ రెయిడ్స్

ఇటీవల హైదరాబాద్‌లోని ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అధికారులు డ్రగ్స్ సీజ్ చేశారు. కొత్తపేట మారుతి నగర్‌లోని ఓ ఇంట్లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో దాడులు చేశారు. 13.65 గ్రాముల MDMA డ్రగ్స్‌ను సీజ్ చేశారు. దీంతో పాటు 513 గ్రాముల డ్రై గంజాయి సైతం సీజ్ చేశారు. సందీప్‌ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి.. ఇక్కడ దందా చేస్తున్నట్టు చెబుతున్నారు అధికారులు. డ్రగ్స్ తో సహా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని.. ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్‌లో సరెండర్ చేశారు. ఈ మధ్య కాలంలో పట్టుబడ్డ మరో డ్రగ్ కేసు ఎలాంటిదో చూస్తే.. జూలై 13న గచ్చిబౌలీలో గంజాయి, డ్రగ్స్ వినియోగం జరుగుతోందనే సమాచారంతో నిఘా పెట్టి దాడులు చేసింది ఈగల్ టీమ్. డెకాయ్ ఆపరేషన్‌ చేపట్టి 14 మంది డ్రగ్ యూజర్లను అరెస్ట్ చేసింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు ఈగల్ టీమ్ పోలీసులు. పక్కా సమాచారంతో గచ్చిబౌలి లోని ఒక ప్రైవేటు బ్యాంకు దగ్గర్లో ఈ ఆపరేషన్ నిర్వహించి పట్టుకుంది టీమ్ ఈగల్. పట్టుబడిన వారిలో ఆన్‌లైన్ ట్రేడర్లు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, బిజినెస్ పీపుల్ ఉన్నట్లు గుర్తించారు. తనిఖీల్లో అందరూ గంజాయి సేవించినట్లు నిర్ధారించారు. వీరిని డ్రగ్ డీ-అడిక్షన్ కేంద్రాలకు పంపించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులోనూ పట్టుబడ్డవారిలో ఐటీ ఉద్యోగులే ఎక్కువుండటం గమనార్హం.

భాయ్ బచ్చా ఆగయా భాయ్ అనే వాట్సప్ కోడ్

ఇటీవల మహారాష్ట్ర నుంచి వచ్చి గంజాయి సరఫరా చేస్తున్న సందీప్ అనే పెడ్లర్ ని అరెస్టు చేసింది ఈగల్ టీమ్. అతని ఫోన్‌ కాంటాక్ట్ లిస్ట్ ద్వారా ఈ డెకాయ్ ఆపరేషన్ చేసింది ఈగల్. గంజాయి వచ్చిందంటూ కస్టమర్లకు పోలీసులు మెసేజ్ పెట్టారు. భాయ్ బచ్చా ఆగయా భాయ్- అనే వాట్సాప్ కోడ్‌ లాంగ్వేజ్ తో గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కోడ్ పంపి గచ్చిబౌలిలోని ఒక బ్యాంక్ దగ్గరలోని ఒక చోటుకి రావాలని ఈగల్ టీమ్ ట్రాప్ చేసింది. రెండు గంటల్లో 14 మంది డ్రగ్ యూజర్లు.. లొకేషన్‌కి వచ్చారు. వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఐటి ఉద్యోగులు, రిలేషన్‌షిప్ మేనేజర్లు, ఆన్‌లైన్ ట్రేడర్లు, విద్యార్థులు, డెంటల్ టెక్నీషియన్లు ఉన్నారు. పట్టుబడ్డ 14 మందికి నిర్వహించిన యూరిన్ టెస్ట్‌లో అందరికీ డ్రగ్ పాజిటివ్ అని తేలింది. దీంతో వీరిని డీఅడిక్షన్ సెంటర్లకు తరలించారు. నిందితుడు సందీప్ మహారాష్ట్ర నుంచి గంజాయి తెప్పిస్తున్నట్లు గుర్తించారు. సందీప్ తెప్పిస్తున్న ప్యాకెట్లను 50 గ్రాముల చొప్పున తయారు చేసి.. కస్టమర్లకు సప్లై చేస్తుంటాడు. అందులో భాగంగా ఇతడు ప్రతి సారీ 100 గంజాయి ప్యాకెట్లు తెప్పిస్తున్నట్లు కనుగొన్నారు పోలీసులు. ఒక్క

పట్టుబడుతున్న వారిలో అధిక శాతం ఐటీ ఉద్యోగులే

గంజాయి కొనేందుకు ఓ వ్యక్తి భార్య, నాలుగేళ్ల కుమారుడితో రావడం చూసి షాకయ్యారు పోలీసులు. అంతే కాదు పట్టుబడుతున్న వారిలో అధిక శాతం సాఫ్ట్ వేర్ ఎంప్లాయిసే ఉండటం గమనార్హం. ఈ విషయంపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది ఈగల్ టీమ్. అసలెందుకు వీరింతగా వ్యసనాల బారీన పడుతున్నారు? ఇంత చదువుకున్న వీరు.. ఇలా పట్టుబుతున్నారేంటి? వీరిని ఏ కోణంలో హ్యాండిల్ చేయాల్సి ఉంది? వీర్ని కూడా బాధితులుగా చూడాలా? అన్నది పోలీసులు తీవ్ర పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కంపెనీ యాజమాన్యాల ద్వారా వీరిని దారికి తేవడం ఎలా అన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి తీసుకుంటే వణుకు పుట్టిస్తామన్నారు సీఎం రేవంత్. నిషేదిత పదార్థాలు సప్లై చేస్తున్న ముఠాలపై కఠిన చర్యలు తప్పువని హెచ్చరించారు. డ్రగ్స్ సప్లై చేసే వాళ్లు తెలంగాణ వైపు చూసేందుకు కూడా భయపడాలని, అందుకే ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం వరుస కేసులను బట్టీ చూస్తే ఐటీ ఎంప్లాయిస్ ఎక్కువగా పట్టుబడ్డంలో అర్ధమేంటి? అన్నదొక చర్చగా మారింది. ఐటీ జాబ్స్ లో అంత ఫ్రస్టేషనేంటి? కావాల్సినంత భారీ జీత భత్యాలు. ఆపై రెండు రోజుల సెలవులు. లైఫ్ బిందాస్ అన్నట్టు ఉండకుండా.. పబ్బుల వెంట త

ఇంతకీ ఈ ఐటీ ఎంప్లాయిస్ డ్రగ్స్ వాడకంపై కట్టడిచేయడానికి ఈగల్ టీమ్ రచిస్తున్న మాస్టర్ ప్లాన్ ఎలాంటిది? వీరిలాంటి కార్యకలాపాలకు ఎందుకు పాల్పడుతున్నట్టు.. ఒక డ్రగ్ యూజర్ భార్యా పిల్లలతో సహా పెడ్లర్ చెప్పిన చోటికి చెప్పినట్టు వచ్చాడంటే.. ఈ వ్యసనానికి కుటుంబ ఆమోదం కూడా లభించినట్టేనా? అసలు వీరి విషయంలో అనుసరించాల్సినదేంటి? హైదరాబాద్ వైపు చూడాలంటేనే హడలేలా డెసిషన్స్ఇప్పటికే మద్య సేవనానికి సామాజిక ఆమోదం తోడైంది. తాజాగా డ్రగ్స్ కి కూడా అలాంటి ఆమోదం ఎక్కువైందా? అంటే ఇదిగో ఈ డ్రగ్ యూజర్ ని చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. తన భర్త డ్రగ్స్ ప్యాకెట్స్ తీసుకోడానికి వెళ్తున్నాడని తెలిసి ఆ భార్య ఎందుకు ఒప్పుకున్నట్టు? అర్ధం కావడం లేదని వాపోవడం పోలీసుల వంతు అవుతోంది. అంటే వీరిని సాధారణ కౌన్సెలింగ్ ఇప్పించి.. దారికి తేవడం కష్టం. ఇందుకు మరో మార్గం అన్వేషించాల్సిందే అన్న కోణంలో థింక్ చేస్తోంది.. ఈగల్ టీమ్.

ఉద్యోగాలు పోతాయన్న భయం కల్పించే ఎత్తుగడ

గచ్చిబౌలీ డ్రగ్స్ కేసు కావచ్చు, ఫామ్ హౌస్ కేసు కావచ్చు.. వీరిలో ఐటీ ఎంప్లాయిసే ఎక్కువగా ఉన్నారు. గచ్చిబౌలీ కేసులో 8 మంది ఐటీ ఎంప్లాయిస్ ఉండగా ఫామ్ హౌస్ పార్టీ కేసులో 7 మంది సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ ఉండటం గమనించారు. దీంతో.. వీరి వివరాలను పని చేస్తున్న కంపెనీకి పంపించి.. డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేలా.. చేస్తామంటున్నారు ఈగల్ టీమ్ అధికారులు. దీంతో వీరిలో ఉద్యోగాలు పోతాయన్న భయం ఏర్పడుతుందని.. తద్వారా వీరిని డ్రగ్స్ నుంచి దూరం చేయడం జరుగుతుందన్న ఆలోచన చేస్తోంది టీమ్ ఈగల్. ఇందులో లీగల్ ఇబ్బందులను సైతం పరిశీలించి.. ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తామంటున్నారు అధికారులు.ఇప్పటి వరకూ డ్రగ్స్ తీసుకునే వారిని బాధితులుగానే గుర్తిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన పలువురు సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ ఏమంత పెద్ద నేరం కాదన్న కోణంలో ఈ వ్యసనాల బారీన పడుతున్నట్టు తెలుస్తోంది. బాధితులుగా ఎవర్ని గుర్తించాలంటే- ఇది నేరమని తెలియని వారి విషయంలో. కానీ ఐటీ రంగంలో ఉంటూ, పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటూ.. భారీ ఎత్తున సామాజిక అవగాహన కలిగి ఉంటారు. ఎన్నో విషయాల్లో ఈ ప్రపంచానికి సమాచారం చేరవేయడంలో వీరిది కీలక పాత్ర. అలాంటి వీరు డ్రగ్స్ వ్యసనాల బారీన పడ్డమేంటన

బాధితులు అనే ఆప్షన్ కారణంగా నీరుగారిన కేసు

మొన్నటి వరకూ సినిమా వారి డ్రగ్స్ వ్యవహారం.. వీరందరికీ శిక్షలు పడితే.. ఆపై మిగిలిన వారంతా ఒక దారికి వస్తారన్న ఆశ ఉండేది. బాధితులు అనే వెసలుబాటు కారణంగా ఈ కేసు కాస్తా నీరుగారి పోయింది. సినిమా వారి తర్వాత వరుసగా డాక్టర్లు పట్టుబడుతూ వచ్చారు. మాములుగా సిగరెట్, మద్యం వంటి వ్యసనాల బారీన పడవద్దంటూ సామాన్యులకు చెప్పేదే డాక్టర్లు. అలాంటి డాక్టర్లు కూడా మాదక ద్రవ్యాల బారీన పడ్డంతో.. ఏం చేయాలో దిక్కు తోచలేదు పోలీసులకు. ఇప్పుడు చూస్తే సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్. గతంలో డ్రగ్ యూజర్లలో ఎక్కువగా యువత పట్టుబడేది. వీరంటే పైలా పచ్చీస్ వయసు. ఆకతాయితనం. చదువుకుంటున్న క్రమంలో కొందరు డ్రగ్ పెడ్లర్లు వీరిని టార్గెట్ చేస్తుంటారు. దీంతో వీరిని బాధితులుగా గుర్తించి డీ ఎడిక్షన్ సెంటర్లకు పంపి చికిత్స అందించడంలో ఒక అర్ధముంది. కావల్సినంత వయో పరిణితి, సామాజిక అవగాహన ఉన్న డాక్టర్లు, ఐటీ ఎంప్లాయిస్ వంటి వారిని కూడా బాధితులనుగానే చిత్రీకరించి.. వారిని సుతిమెత్తంగా వారించి వదిలేయడం ద్వారా.. ఎలాంటి ఉపయోగం లేదని తెలుస్తోంది. వీరిలా పట్టుబడి కౌన్సెలింగ్ తీస్కోవడం. అలా బయటకెళ్లి మళ్లీ పట్టుబడ్డం చూసి పోలీసులు కూడా విసుగెత్తి పోతున్నారు. దీంతో వీరి వ

యూజర్ల ద్వారా డ్రగ్ సరఫరా జరుగుతుండా లేదా నిఘా

గతంలో డ్రగ్స్ తీసుకునేవారిని అరెస్టు చేసేవారు కాదు. ఇప్పుడు అలాక్కాదు.. వారి ద్వారా కూడా డ్రగ్ పెడ్లింగ్ జరుగుతుందా లేదా గమనిస్తున్నారు. వారు కొని మరొకరికి సరఫరా చేస్తే వారు కూడా పెడ్లర్ కిందే లెక్క. మొదట వారిని డీ ఎడిక్షన్ సెంటర్ కి పంపుతారు. ఆ తర్వాత వారు మారితే- కేసులు ఎత్తి వేస్తారు. లేకుంటే వారిపై డ్రగ్ కేసులు అలాగే ఉంచేలా తెలుస్తోంది. ఇప్పటికే డ్రగ్ రవాణా రూట్ మ్యాప్ ని డీ కోడ్ చేసింది ఈగల్ టీమ్. హైదరాబాద్ వరకూ డ్రగ్స్ ఎలా వస్తున్నాయ్? ఆ కారిడార్ ఏది? పెడ్లర్లు ఎవరు? వారి నెట్ వర్క్ ఎలా పని చేస్తుంది? అన్న కోణంలో నిఘా పెట్టారు. అంతే కాదు.. వారి వాట్సప్ గ్రూపులను స్వాధీనం చేసుకుని.. తద్వారా డ్రగ్ యూజర్ల జాడ తెలుసుకుంటున్నారు. ఆపై వారిని కూడా నిఘా పెట్టి పట్టుకుని డీఎడిక్షన్ సెంటర్లకు పంపుతున్నారు. అసలు డ్రగ్ కేసుల్లో ఎవరు డీలర్? ఎవరు పెడ్లర్? ఎవరు నిందితులు? ఎవరు బాధితులు? అన్న దానికి ఒక క్లారిటీ ఇచ్చారు అధికారులు. నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోఫిక్ సబ్ స్టాన్సెన్స్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తిని తనికీ చేసినపుడు డ్రగ్స్ దొరికితే వారిని యూజర్లుగా భావించి అరెస్టు చేస్తారు. డ్రగ్స్ ఇతరులకు అమ్ముత్తున్నట్టు తగిన ఆధారాలు లభిస్తే..పెడ్లర్ లేదా డీలర్ గా వారిపై నేరారోపణ చేస్తారు. ఆపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు.

ఈగల్ టీమ్‌కి సిబ్బంది, వెహికల్స్, బడ్జెట్ కేటాయింపు

ఈ మధ్య కాలంలో సందీప్ శాండిల్య నాయకత్వంలోని ఈగల్ టీమ్ ఎవరైనా సరే అరెస్ట్ చేయాల్సిందే అన్న కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో పోలీసు, పొలిటీషియన్, బడాబాబుల పిల్లలు ఎవరైనా కావచ్చు. వదలకుండా అరెస్టులు చేస్తామన్న హెచ్చరికలు జారీ చేసింది ఈగల్ టీమ్. అంతే కాదు. ఇద్దరు పోలీసు పిల్లల్ని అరెస్టు చేసి తామేంటో నిరూపించింది. ఇటు ప్రభుత్వం కూడా.. ఈగల్ టీమ్ కి కావల్సినంత సిబ్బంది, వెహికల్స్ తగిన బడ్జెట్ సైతం కేటాయించడంతో.. వీరు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య డ్రగ్స్ మూలాలు ఎక్కడో కనుగొన్నారు. ఆపై డ్రగ్స్ గోవా నుంచి సప్లై అవుతున్నట్టు గుర్తించారు. అంతే కాదు.. గోవా పోలీసులతో టై అప్ అయ్యి.. వారి ద్వారా.. డ్రగ్స్ సప్లై చేసే వారిని సైతం అరెస్టు చేస్తున్నారు. తద్వారా హైదరాబాద్ వైపు రావాలంటేనే డ్రగ్ పెడ్లర్లు హడలిపోవాలన్న కోణంలో ఈగల్ టీం వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Story By Adinarayana, Bigtv

Related News

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

YCP Vs TDP: పులివెందులలో కాక రేపుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు

AP News: జగన్ -పెద్దిరెడ్డి అవినావ బంధం

Big Stories

×