BigTV English

OTT Movie : అబ్బాయితో ఇదేం పాడు పని… మైండ్ బ్లాకయ్యే క్లైమాక్స్ ట్విస్ట్… ఈ దెయ్యం మూవీని చూస్తే హడల్

OTT Movie : అబ్బాయితో ఇదేం పాడు పని… మైండ్ బ్లాకయ్యే క్లైమాక్స్ ట్విస్ట్… ఈ దెయ్యం మూవీని చూస్తే హడల్

OTT Movie : దెయ్యాల సినిమాలు రకరకాల స్టోరీలతో భయపెట్టడానికి వస్తుంటాయి. అయితే కొన్నిసినిమాలను చూస్తున్నప్పుడు చందమామ కథలు గుర్తుకు వస్తుంటాయి . ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక ఆత్మ తనకు నచ్చినవాళ్లపై కన్నేస్తూ ప్రేమలో పడేలా చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


ఏ ఓటీటీలో ఉందంటే

‘Aseq’ ఒక హిందీ సూపర్‌నాచురల్ హారర్-థ్రిల్లర్ చిత్రం. ఇది సరిమ్ మోమిన్ దర్శకత్వంలో, జియో స్టూడియోస్ బ్యానర్ కింద నిర్మితమైంది. ఇందులో వర్ధన్ పురి, సోనాలీ సెగల్, సిద్ధాంత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2023 జూన్ 23న జియో హాట్ స్టార్ లో విడుదలైంది. ఈ స్టోరీ “ఆసెక్” (ఆశిక్) అనే ఆత్మ చుట్ట్టూ తిరుగుతుంది. ఇది మానవులపై మోహం పెంచుకుని, వారిని వదిలిపెట్టడానికి ఇష్టపడని ఒక రాక్షస శక్తి. 1 గంట 47 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.4/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

రోనీ తన స్నేహితురాలు ప్రియాంకతో విడిపోయిన ఒక నెల తర్వాత, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటాడు. ఎందుకంటే అతను పెద్ద మొత్తంలో అప్పు తీసుకుని ఉంటాడు. అతను తన స్నేహితుడు ఆది సహాయం కోసం వెళతాడు. ఆది అతన్ని మరొక స్నేహితుడు సరిమ్ తో కలుపుతాడు. ఒక రోజు, రోనీ ఒక పబ్‌లో లైల్ అనే అందమైన యువతిని కలుస్తాడు. అక్కడ అతను ప్రియాంకను ఆమె మాజీ ప్రియుడు ఇషాన్‌తో చూస్తాడు. పబ్ నుండి బయటకు వెళ్లినప్పుడు, లైల్‌ను కొంతమంది తాగిన వ్యక్తులు హింసించడాన్ని చూసి, రోనీ ఆమెకు సహాయం చేస్తాడు. అతను ఆమెను ఇంటికి జాగ్రత్తగా తీసుకెళతాడు. వారిద్దరూ త్వరలోనే ప్రేమలో కూడా పడతారు.

అయితే ఈ కొత్త లవ్ స్టోరీ ప్రారంభమైన తర్వాత, రోనీ ఇంట్లో భయంకర సంఘటనలు జరగడం మొదలవుతాయి. అకస్మాత్తుగా వస్తువులు కదలడం, భయపెట్టే శబ్దాలు, విచిత్రమైన దృశ్యాలతో రోనీ కంగారుపడతాడు. ఈ సంఘటనల వెనుక తన మాజీ స్నేహితురాలు ప్రియాంక బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించి ఉండవచ్చని అనుమానిస్తాడు. ఈ సీక్రెట్ ను కనిపెట్టి, ఈ సంఘటనలను ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఇందుకోసం అతను తన స్నేహితులు ఆది, సరిమ్ సహాయం తీసుకుంటాడు. వీళ్ళు కలిసి ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తారు, అయితే ఈ సంఘటనల వెనుక ఒక “ఆసెక్ జిన్” ఉందని క్రమంగా తెలుస్తుంది. ఇది ఒక మానవుడిపై మోహం పెంచుకుని, వారిని వదలని ఒక రాక్షస శక్తిగా ఉంటుంది.

Read Also : ఛీఛీ ఇదేం సినిమారా బాబూ… డైరెక్టర్ ను జైలుకు కూడా పంపిన మూవీ… ఏ ఓటీటీలో ఉందంటే?

ఈ ఆత్మ లైల్‌ను ఆవహించినట్లు తెలుస్తుంది. ఆమె రూపంలో రోనీని ప్రేమలో పడేలా చేస్తుంది. ఈ విషయం తెలిసి రోనీ అతని స్నేహితులు, ఈ జిన్‌ను ఎదిరించడానికి ప్రయత్నిస్తారు. ఈ సినిమా చివరిలో ఈ ఆత్మ రోనీతో ఉండటానికి ఎంతగానో కోరుకుంటుంది, కానీ రోనీ ఆమెతో ఉండటం కంటే చనిపోవడానికి సిద్ధపడతాడు. జిన్, రోనీ రాక్షస ప్రేమ ఏమవుతుంది ? రోనీ చనిపోతాడా ? ఈ ఆత్మ ఏమవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ రోనీ చనిపోతాడా ? ఈ ఆత్మ ఏమవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్-థ్రిల్లర్ సినిమాను చుడండి.

Related News

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

OTT Movie : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : ఆసుపత్రిలో దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

Big Stories

×