E-Paper
Advertisement

Jagtial District: జగిత్యాలలో నయా పంచాయితీ.. ఇద్దరిలో గెలుపెవరిది?

Jagtial District: జగిత్యాలలో నయా పంచాయితీ.. ఇద్దరిలో గెలుపెవరిది?
Advertisement

Jagtial District: అంతర్గత కలహాలతో నేతలు పార్టీలకు నష్టం చేయడం మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ, జగిత్యాల కాంగ్రెస్‌లో మాత్రం ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలు డిష్యుం, డిష్యూం అంటూ రోడ్డెక్కుతున్నా.. ఆ సెగ్మెంట్ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు దక్కంచుకుంది. ఆ తీర్పుఇప్పుడు వాళ్ల బలమా..లేక ప్రత్యర్థి పార్టీల బలహీనతా అన్న చర్చ కొనసాగుతోంది. అదలా ఉంటే ఫలితాల తర్వాత ఒకే పార్టీలో ప్రత్యర్ధులుగా మారిన ఆ ఇద్దరు.. సర్పంచ్ ఎన్నికల క్రెడిట్ నాదంటే నాదని ఫైట్ మొదలుపెట్టడం ఆసక్తి రేపుతోంది.

జగిత్యాల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా

జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ ఐదు నియోజకవర్గాలుంటే.. జగిత్యాల నియోజకవర్గంలోనే కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధికంగా సీట్లను గెలుచుకున్నారు. 101 స్థానాలకు 93 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులయ్యారు. ఇది ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాలకంటే ఎక్కువ మెజారిటీ. ముఖ్యంగా జగిత్యాల పక్కనే ఉన్న కోరుట్లలో కాంగ్రెస్‌కు దీటుగా బీఆర్ఎస్ మద్దతుదారులు గెల్చిన నేపథ్యంలో… జగిత్యాలలో మాత్రం ఇద్దరు కీలక నేతల డిష్యుం డిష్యుంలోనూ 93 సీట్లతో 90 శాతానికి పైగా ఫలితాలు సాధించడం విశేషం.

టామ్ అండ్ జెర్రీల్లా వ్యవహరించే సంజయ్, జీవన్‌రెడ్డి

Advertisement

అటు జగిత్యాల జిల్లాలో సగభాగంగా ఉన్న చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల, మల్యాల మండలాల్లోనూ.. అలాగే, వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, మేడిపల్లి, మారం మండలాల్లో ఒక్క మేడిపల్లి మినహా కాంగ్రెస్ ఈ స్థాయిలో విజయాల్ని సాధించుకోలేకపోయింది. అయితే, జగిత్యాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీమంత్రి జీవన్‌ రెడ్డి ఇద్దరూ టామ్ అండ్ జర్రీలా ఎప్పుడూ మాటల యుద్దంతో కొట్టుకుంటున్నా.. ఇక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్‌ కు గట్టి నాయకత్వం లేకపోవడం.. బీజేపీకి దిక్కూదివాణం కరువవ్వడంతో..కాంగ్రెస్‌ ఏకపక్షంగా సీట్లను కైవసం చేసుకుందంటున్నారు. పాము, ముంగిసల్లాగా కొట్లాడుకునే ఎమ్మెల్యే సంజమ్‌ కుమార్, జీవన్‌ రెడ్డి అనుచరులే అక్కడ పోటీకి సై అనడంతో బిజేపి, బీఅర్ఎస్‌ సైడ్ అయిపోయారు….ఇక పోరులో గెలిచింది ఇద్దరూ లీడర్ల అనుచరులే.. అందరూ కాంగ్రెస్ మద్దతుదారులే..

తమ వల్లే గెలిచారంటూ ఇద్దరు నేతల కొత్త పంచాయితీ

ఇద్దరు నేతల మధ్య ఫైటు పరాకాష్ఠకు చేరుకున్నా.. 90 శాతం దాటి ఫలితాలు సాధించడం జగిత్యాలలో కాంగ్రెస్‌ పార్టీకి శుభపరిణామమే అని చెప్పుకోవచ్చు. కానీ, ఆ వచ్చిన ఫలితాల మీద కూడా ఆ ఇద్దరు నేతలు పోస్టుమార్టం మొదలెట్టి నావల్లే గెల్చారంటే.. లేదు లేదు నావల్లేనంటూ వేదికలపై ఊదరగొడుతూ ఒకరిపై ఒకరు కామెంట్స్‌ చేసుకోవడం కొత్త పంచాయతీకి తెర లేపుతోంది. ఈమధ్య జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన నందయ్య, జీవన్‌ రెడ్డి వర్గమా, సంజయ్ వర్గమా అంటూ పెద్ద రచ్చే జరిగిందట. అది మరువకముందే.. ఇప్పుడు పంచాయతీల్లో గెలిచిన సర్పంచుల విజయాలను.. ఓవైపు సంజయ్‌ కుమార్, ఇంకోవైపు జీవన్‌ రెడ్డి ఎవరికి వారే క్లెయిమ్‌ చేసుకోవడం.. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు తల బొప్పి పుట్టిస్తోందట. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపమన్నట్టు జగిత్యాల పాలిటిక్స్‌ మారయ్యాయనే టాక్ నడుస్తుందట.

పరిష్కరించలేకపోతున్న అధిష్టానం

Advertisement

జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్, మాజీమంత్రి జీవన్‌ రెడ్డి పంచాయతీని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోదు. పట్టించుకున్నా పరిష్కారం కాదు కూడను…ఇద్దరి పంచాయతి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, ప్రేక్షక పాత్రనే పోషిస్తోందనే చర్చ నడుస్తుంది. దీంతో జగిత్యాల కాంగ్రెస్ అంటే రోజుకో పంచాయతీ.. రోజుకో కొత్తషో అన్నట్టు తయారైందనే టాక్ నియోజకవర్గంలో నడుస్తుందట.`

Story by Ramireddy, Big Tv 

Related News

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

Big Stories

Advertisement
×