Pawan Kalyan: ఏడాదిన్నర పాలనను పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వంలో రాను రాను నాయకుల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయట.. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన వర్సెస్ టిడిపి అనే విధంగా పరిస్థితులు మారిపోయాయట… మావాళ్లు లేకపోతే మీకు అధికారం ఎక్కడిది అని ఒకరు అంటుంటే.. మేం లేకపోతే మీరు ఎక్కడున్నారు అంటూ మరొకరు ఒకరి పైన విమర్శలు ఆరోపణ చేసుకుంటున్నారట.. వీటన్నిటికీ చెక్ పెట్టేలా జనసేన నాయకులకకు క్లియర్ కట్‌గా క్లారిటీ ఇచ్చారంట పవన్ కళ్యాణ్… ఇంతకీ జన సైనికులకి పవన్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? జనసేనాని చెప్పిన ప్రకారం జనసైనికులు ఫాలో అవుతారా?
ఏపీలో కూటమి ప్రభుత్వంలో నాయకులు మధ్య విభేదాల నేపథ్యంలో … జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీలో రాజకీయ చర్చకు దారితీస్తున్నాయట. ఇప్పటివరకు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, కూటమి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను అధినాయకుడికి చెప్పుకుందాం అనుకున్న నాయకులకు.. పవన్ కళ్యాణ్ రివర్స్‌లో బిగ్ షాక్ ఇచ్చారనే టాక్ నడుస్తోందట. జనసేన నిర్వహించిన పదవీ- బాధ్యత కార్యక్రమంలో… కూటమిలో విభేదాలు, సమస్యలపై అడ్జస్ట్ అవ్వాలని.. దానికి నాయకులు కార్యకర్తలు ప్రిపేర్ కావాలని చెప్పారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్.
పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పొందిన నాయకుల సమక్షంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం జనసేన పార్టీలో చర్చనీయంశంగా మారింది. సమస్యలను పరిష్కరించాల్సిన అధినాయకుడే . అడ్జస్ట్ కావాలని చెప్పడం ఏంటనే సందేహాలు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారట. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలలు పరిస్థితి బాగానే ఉంది… కానీ తర్వాత.. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో, జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలలో టీడీపీ కొంత ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువవుతున్న నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ కి కూడా గతంలో ఈ విషయంలో సమాచారం చేరవేశారు నాయకులు.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఏడాదిన్నర కాలంగా .. ప్రతి బహిరంగ సభల్లో నాయకులు, కార్యకర్తలు వల్ల కూటమి ఐక్యతకు దెబ్బ తినకూడదు అని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ ఓపెన్ అయిపోవడం.. నియోజకవర్గంలో ఇబ్బందులు, సమస్యలు ఉన్నా….ఎదుర్కోవాల్సిదేనని చెప్పడంపై జనసైనికుల్లో కొంత అసంతృప్తికి గురవుతున్నారట. పవన్ కల్యాణ్ ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా నియోజకవర్గాల్లో, జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారతాయన్న అభిప్రాయాన్ని జనసైనికులు వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటివరకు ఆధిపత్యం ప్రదర్శించిన టిడిపి నాయకులు… పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో రెచ్చిపోయే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో కూడా .. టీడీపీ నాయకుల పెత్తనం పెరిగే అవకాశం ఉందన్న వాదన జనసైనికుల్లో వినపడుతుందట.
అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటను పార్టీ నాయకులు ఎంతవరకు ఫాలో అవుతారు అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఎక్కడ వెనక్కి తగ్గడం లేదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ విననిపిస్తుందట. ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ నేతల తీరుపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బహిరంగ విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేగా ఉన్న టిడిపి నాయకుల పెత్తనం ఏంటి అంటూ గట్టిగానే అప్పట్లో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు… ఇక నెల్లిమర్ల నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి కూడా ఇదే విధంగా టిడిపి మీద ఫైరయ్యారు.. ఎమ్మెల్యేలు మేమా…లేక మీరా అంటూ గట్టిగానే లోకం మాధవి మాట్లాడిన సందర్భాలున్నాయి. ఇలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో ఇదే విధమైన పరిస్థితులు ఉన్నాయి.. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సర్దుకు పోతామని జనసైనికులు చెబుతున్నారు కానీ… నియోజకవర్గ మీద పెత్తనం చేస్తే ఊరుకునేది లేదని అంటున్నారట.
ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడిని కాపాడుతూ పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారన్న తీరును అటు వైపీపీ సైతం విమర్శిస్తోంది. మరో 15 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉంటారు అనే కామెంట్స్ విషయంలో పవన్‌ను వైసీపీ టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంది. ఇలా కూటమిలో జనసేనకు ప్రత్యేక గుర్తింపు లేదన్న భావన..అంతా టీడీపీదే హవా అనే ఫీలింగ్…ప్రజల్లోకి వెళ్లతుందనే ఆందోళన జనసేనికులు వ్యక్తం చేస్తున్నారట. దీని ఎఫైక్ట్ పార్టీపై పడుతుందనే భావనను జనసేనికులతో పాటు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారట.
ఇలా వరుసగా తనను కార్నర్ చేస్తున్న అంశాలపై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…రాబోయే రాజకీయ పరిణామాలు, మారే పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకుని…ఇప్పటి నుంచే జాగ్రత్త అడుగులు వేస్తున్నారట. లీడర్‌గా తనకు ఎలివేషన్ ఇచ్చుకుంటూనే…కిందస్థాయి నాయకత్వాన్ని త్యాగాలకు సిద్ధం చేయడం పవన్ వ్యూహంలో బాగమే అనే చర్చ కూడా సాగుతుందట.అదే క్రమంలో…పవన్ నోటి వెంట వస్తున్న 15 ఏళ్ల పొత్తు ప్రస్తావన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తోందట. ఇక చూడాలి…పవన్ మాటలను జనసైనికులు పాఠాలుగా స్వీకరిస్తారా? లేదా తలపోటుగా భావిస్తారో?
Story By Ramireddy, Big Tv