Big Stories

CSKvs PBKS Preview IPL 2024: పంజాబ్ ధడ ధడలాడిస్తుందా? నేడు చెన్నైసూపర్ కింగ్స్ తో మ్యాచ్

CSK vs PBKS Dream11 Prediction(Latest sports news telugu): బ్రహ్మాండంగా ఆడుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ చేసిన 262 పరుగుల టార్గెట్ ని పంజాబ్ ఉఫ్ మని ఊదిపారేసింది. ప్రస్తుతం మంచి ఊపుమీద కనిపిస్తోంది. ఇలాంటి జట్టు ఈ వేళ చెన్నై సూపర్ కింగ్స్ తో చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30కి మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం చెన్నయ్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఇంతవరకు 9 మ్యాచ్ లు ఆడి 5 గెలిచి 10 పాయింట్లతో ఉంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే 8వ స్థానంలో ఉంది. 9 మ్యాచ్ లు ఆడి 3 మాత్రమే గెలిచి 6 పాయింట్లతో ఉంది.

- Advertisement -

ఇప్పుడు ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే పంజాబ్ కింగ్స్ గెలవక తప్పని మ్యాచ్ అన్నమాట. ప్రాణాలు ఒడ్డయినా సరే ఆడాల్సిందే. చెన్నై కి కూడా గెలిచేస్తే ఒక పనైపోతుంది. తర్వాత మరో ఒకట్రెండు మ్యాచ్ లు గెలిచి ప్లే ఆఫ్ కి వెళ్లవచ్చు. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య  ఇంతవరకు 28 మ్యాచ్ లు జరిగాయి. చెన్నై 15 సార్లు, పంజాబ్ 13 సార్లు విజయం సాధించింది.

- Advertisement -

Also Read: ఉత్కంఠ పోరులో లక్నో గెలుపు.. ఆఖరి ఓవర్ వరకు పోరాడిన ముంబై

ఇక చెన్నై విషయానికి వస్తే టాప్ ఆర్డర్ అంతా బ్రహ్మాండంగా ఆడుతోంది. రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. చివర్లో ధోనీ ఫినిషింగ్ ఒక రేంజ్ లో ఉంటోంది. శివమ్ దుబె చుక్కలు చూపిస్తున్నాడు. బౌలింగు కూడా బాగా ఉండటం, ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా జట్టుకి బలంగా ఉన్నాడు. ఇలా అన్నిరకాలుగా చెన్నయ్ ముందంజలో ఉంది.

పంజాబ్ విషయానికి వస్తే మొన్నటివరకు పాతాళానికి పడిపోయిన పంజాబ్ ఉన్నట్టుండి ఒక్కసారి జూలు విదిల్చింది. సింహాలై గర్జిస్తోంది. కోల్ కతా ఇచ్చిన 262 పరుగుల టార్గెట్ ని లాగిపెట్టి కొట్టి అవతల పారేసింది. అదే ఫామ్ ఇప్పుడు కూడా కొనసాగితే పంజాబ్ ని ఆపడం చెన్నయ్ తరం కాకపోవచ్చు. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News