Swiggy Boy: ఫుడ్ డెలివరీ యాప్ లు కస్టమర్లను ఆకర్షించేందుకు 10 నిమిషాల డెలివరీ అంటూ తెగ ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ టైమ్ టార్గెట్ డెలివరీ బాయ్స్ కు ప్రాణసంకటంగా మారుతున్నాయి. ఇచ్చిన టైమ్ కు ఫుడ్ డెలివరీ చేయాలన్నా కంగారులో ప్రమాదాలకు గురవుతున్నారు. అందుకు ఈ ఘటనే ఉదాహరణ.
ఏపీలోని అనంతపురం రైల్వేస్టేషన్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటన.. గిగ్ వర్కర్ల భద్రతపై ఆందోళన కలిగిస్తుంది. ఓ ఫుడ్ డెలివరీ.. స్విగ్గీ ఏజెంట్ ప్రాణాల మీదకు తెచ్చింది. ఏసీ కోచ్ లోని ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి స్విగ్గీ ఏజెంట్ రైలెక్కాడు. ఇంతలో రైలు కదలడంతో.. కంగారులో రన్నింగ్ ట్రైన్ నుంచి ప్లాట్ ఫామ్ పైకి దిగబోయాడు. ట్రైన్ వేగం ఎక్కువగా ఉండడంతో డెలివరీ బాయ్ ప్లాట్ ఫామ్ పై పడిపోయాడు. ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో జరిగిన ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు స్టేషన్ సమీపంలోని రెస్టారెంట్లతో భాగస్వామ్యం పెట్టుకుంటాయి. దీంతో ట్రైన్ లో ప్రయాణిస్తున్నవారు ఆన్ లైన్ పీఎన్ఆర్ నెంబర్ ఆధారంగా పుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. రైలు ఎక్కువ సేపు స్టేషన్ లో ఆగదు కాబట్టి.. డెలివరీ బాయ్స్ చాలా స్పీడ్ గా ట్రైన్ ఎక్కి డెలివరీ ఇచ్చి దిగిపోవాలి. ట్రైన్ కదిలిపోతే ప్రాణాలకు తెగించి రైలు దిగాలి.
At #Anantapur station, a #Swiggy delivery boy went to deliver food to a train. The train stopped for just 1-2 minutes and then started moving. His bike and bag were outside, and he had more orders to deliver.
So, he panicked and tried to get off the moving train,
1/3 pic.twitter.com/5R8xqnQa90
— Siraj Noorani (@sirajnoorani) January 9, 2026
ఈ నెల 6వ తేదీ రాత్రి జరిగిన ఈ సంఘటనను బిజయ్ ఆనంద్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్టు చేశాడు. “హాల్ట్ కేవలం 1-2 నిమిషాల మాత్రమే. ప్రయాణికుడు 1ACలో ఉన్నాడు. ఫుడ్ అందించే సమయానికి రైలు స్టార్ట్ అయింది. డెలివరీ బాయ్.. ఇంకా డెలివరీ చేయడానికి ఇతర ఆర్డర్‌లు ఉండడం, అతని బైక్, ఫుడ్ బ్యాగ్ స్టేషన్ బయట ఉండిపోవడంతో.. కదులుతున్న రైలు దిగాల్సిన పరిస్థితి. జీవనోపాధి కోసం డెలివరీ ఏజెంట్ తన ప్రాణాలను ప్రమాదంలో పడేసుకున్నాడు” అని బిజయ్ ఆనంద్ కామెంట్ చేశారు.
Also Read: ట్రైన్ ఆలస్యం అయితే ఫ్రీ ఫుడ్.. ఆ ప్రయాణికుడు భలే లక్కి
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు త్వరగా డెలివరీలు ఇవ్వాలని వర్కర్లను ఒత్తిడి చేయడం సరికాదని ఈ వీడియోకు ఓ వ్యక్తి కామెంట్ చేశారు. 10 నిమిషాల డెలివరీ టార్గెట్ ను బహిష్కరించాలని మరోకరు డిమాండ్ చేశారు. జనవరి 8న బిజయ్ ఆనంద్ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను సంప్రదించి, స్విగ్గీ బాయ్ గురించి ఆరా తీసినట్లు చెప్పారు. అతడు సురక్షితంగా ఉన్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. అతడికి స్వలంగా గాయాలయ్యాయని మరో పోస్ట్ పేర్కొంది. అతడికి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ను తగిన పరిహారం అందించాలని కోరారు. అయితే రైల్వే నిబంధనలను ఉల్లంఘించినందుకు స్విగ్గీ బాయ్ రూ.3000 ఫైన్ చెల్లించాల్సి వచ్చిందని బిజయ్ తన పోస్టులో పేర్కొన్నారు.