BigTV English

Pawan Kalyan New Look: హాట్ టాపిక్‌గా మారిన పవన్‌కళ్యాణ్ కొత్త లుక్

Pawan Kalyan New Look: హాట్ టాపిక్‌గా మారిన పవన్‌కళ్యాణ్ కొత్త లుక్

Pawan Kalyan New Look: కొత్త లుక్‌లో కనిపించిన డిప్యూటీ సీఎం పవన్‌‌కల్యాణ్‌ను చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేనేత వస్త్రాల్లో కనిపించిన ఆయన.. అందుకు భిన్నంగా ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్య పరిచారు. షర్ట్,ఫ్యాంట్‌తో టక్‌ చేసుకుని సినిమాటిక్‌ లుక్‌లో కనిపించిన పవన్ స్టార్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..


హాట్ టాపిక్‌గా మారిన పవన్‌కళ్యాణ్ న్యూ లుక్

రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ శంకుస్ధాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం లుక్ హాట్ టాపిక్‌ అయింది. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతులు స్వీకరించిన తర్వాత…ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పవన్‌ గతంలో ఎన్నడూ కనిపించని డిఫరెంట్‌ లుక్‌లో దర్శనమివ్వడం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. డిప్యూటీ సీఎం హోదాలో ఇలా కనిపించడం తొలిసారి కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ అయింది.


ఎన్నికల ప్రచారం నుంచి కుర్తా, ఫైజములో కనిపించిన జనసేనాని

గత ఎన్నికల్లో ప్రచారం సమయం నుంచి జనసేన అధినేతగా పార్టీ సభలు, సమావేశాల్లో పవన్‌కళ్యాణ్ కుర్తా ఫైజమాలోనే కనిపించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో చేనేత వస్త్రాలతోనే పవన్ ఎక్కువగా కనిపించారు. చాలా రోజులు తర్వాత ఓ ప్రభుత్వ కార్యక్రమంలో షర్ట్, ఫ్యాంట్‌తో రావడంతో ఆయన అభిమానులు తెగ హ్యాపీ అయిపోతున్నారు. స్టైలిష్‌ లుక్‌లో ఉన్న పవన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయవాడలో టీషర్ట్, షార్ట్‌తో ఆశ్చర్యపరిచిన పవన్

ఈనెల 22న పవన్‌ కల్యాణ్‌ తమినాడులోని మధురైలో పర్యటించారు. మధురైలో జరిగిన మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన సంప్రదాయ పంచకట్టులో కనిపించారు. టీవల డిప్యూటీ సీఎం డిఫరెంట్ లుక్‌లో కనిపించి సందడి చేస్తున్నారు. ఇటీవల విజయవాడలోని పెనమలూరు మండలంలో ఓ సెలూన్‌ను పవన్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి సాదాసీదాగా ఓ టీషర్ట్, షార్ట్‌తో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచారు. ఆ సమయంలో పవన్ హెయిర్ స్టైల్ కూడా కొత్తగా కనిపించింది.

పవన్ కళ్యాణ్ ఫిట్‌నెస్‌ను పట్టించుకోవడం లేదని విమర్శలు

ఇటీవల పవన్‌ ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. కుంభమేళాకు వెళ్లిన సందర్భంలో పవన్‌ ఫిట్‌నెస్‌పై ట్రోల్స్‌ నడిచాయి. పవిత్ర స్నానం చేస్తున్నప్పుడు తీసిన ఫోటోల్లో పొట్టతో లావుగా కనిపించడంతో ట్రోలింగ్ జరిగింది. కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా మారిపోయిన పవన్ ఫిట్‌నెస్‌ని పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు చెక్‌ పెట్టే విధంగా పవన్‌ కొత్త లుక్‌లో కనపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కొద్దిరోజులుగా వరుసగా సినిమా షూటింగుల్లో పాల్గొంటున్న ఆయన మళ్లీ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టి యంగ్ లుక్‌లోకి మారిపోయారనే చర్చ నడుస్తోంది.

కొత్త లుక్‌తో సంబర పడిపోతున్న పవర్‌స్టార్ ఫ్యాన్స్

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని చేనేత వస్త్రాల్లో తప్ప వేరే దుస్తుల్లో ఆయన్ని చూడటమే గగనమైపోయింది. సినిమా షూటింగుల్లో కూడా ఫ్యాషన్ దుస్తులు వేసుకోవడం తగ్గించేశారు. ఆయన ఇప్పుడు స్టార్‌ హీరో మాత్రమే కాదు.. ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా. దీంతో పవన్‌ని బయట ఇకపై ఫ్యాషన్ దుస్తుల్లో చూడలేమా అని ఫ్యాన్స్ తెగ ఫీలైపోతూ వచ్చారు. అయితే వారి ఆశలు నెరవేర్చేలా సరికొత్తగా కనిపించారాయన. మొత్తానికి డిఫరెంట్ లుక్‌లో ఉన్న డిప్యూటీ సీఎంను చూసి ఫాన్స్ సంబరపడిపోతున్నారు.

Story By Apparao, Bigtv

Related News

AP Politics: గుంతకల్లు టీడీపీలో కుర్చీలాట..

TDP Politics: యనమలను పక్కన పెట్టేశారా? అసలేం జరిగింది..!

Putin, Trump Deals: యూరప్ చీలబోతుందా.? ట్రంప్ , పుతిన్ చర్చలో ఇది జరిగితే మనకి జరిగే లాభం ఇదే.!

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Big Stories

×