E-Paper
Advertisement

వైఎస్ ఫ్యామిలీ కంచుకోటలో రసవత్తర పోరు.. కొత్త రిజర్వేషన్లతో కడపలో కలవరం!

వైఎస్ ఫ్యామిలీ కంచుకోటలో రసవత్తర పోరు.. కొత్త రిజర్వేషన్లతో కడపలో కలవరం!
Advertisement

Kadapa Elections: కడప అంటేనే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీతో పాటు.. జిల్లా కేంద్రంలోని రాజకీయాలపై కూడా వైఎస్ కుటుంబం దశాబ్దాలుగా పట్టుంది. 2004లో కడప మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత.. తొలి మేయర్‌గా వైఎస్ బావమరిది రవీంద్రనాథ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వైసీపీ నుంచి కొత్తమద్ది సురేష్‌బాబు రెండుసార్లు మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. 2021 కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీ హవా ఏ స్థాయిలో ఉందో ఫలితాలే చెప్పాయి. 50 డివిజన్లకు గాను.. 48 స్థానాల్లో వైసీపీ గెలిచింది. టీడీపీ ఒకటి.. వైసీపీ రెబల్ ఒక స్థానం దక్కించుకున్నారు. అంటే.. కార్పొరేషన్ మొత్తం వైసీపీ చేతిలోకి వెళ్లిపోయింది.

కొత్త రిజర్వేషన్లతో..

కానీ, ఇప్పుడు సీన్ మారింది. 2026 ఎన్నికల్లో వార్డుల సంఖ్య 50 నుంచి 66కు పెరగడం.. డీలిమిటేషన్, ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల మార్పులు.. వైసీపీ లెక్కలను మార్చేస్తున్నాయన్న చర్చ నడుస్తోంది. కీలక నేతల ఓట్లు మరో వార్డులోకి వెళ్లడం.. కొత్త రిజర్వేషన్లతో అభ్యర్థుల ఎంపిక కూడా సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే టైమ్‌లో టీడీపీ కూడా స్పీడ్ పెంచుతోంది. రెండు దశాబ్దాల తర్వాత కడప అసెంబ్లీని కైవసం చేసుకున్న టీడీపీ అదే రాజకీయ ఊపుతో కార్పొరేషన్‌పై కూడా జెండా ఎగరేయాలని వ్యూహం సిద్ధం చేస్తోంది. వార్డు వారీగా బలాబలాలు.. రిజర్వేషన్లు.. అభ్యర్థుల ఎంపిక.. అన్నింటిపైనా కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పకడ్బందీ వ్యూహం..

Advertisement

మరోవైపు.. కడపను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల బాధ్యతలను జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. గెలుపు గుర్రాలకే టికెట్లు.. నామినేషన్ నుంచి పోలింగ్ వరకు పకడ్బందీ వ్యూహం.. ఇదే వైసీపీ ప్లాన్‌గా కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పటివరకు వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న కడప.. ఇప్పుడు కూటమికి కొత్త టార్గెట్. పాత పట్టు నిలబెట్టుకోవాలని వైసీపీ కొత్త పాగా వేయాలని టీడీపీ. కడప కార్పొరేషన్ పోరు.. ఈసారి సాధారణ ఎన్నిక కాదు.. రెండు పార్టీలకు ప్రెస్టీజ్ ఫైట్‌గా మారుతోంది.

Also read: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు!

Tags

Related News

సీఎంతో సహా మంత్రుల అవినీతి చిట్టా విప్పుతా.. రాజగోపాల్ రెడ్డి సంచలన స్కెచ్?

పెట్రోల్ ధరల మానిటరింగ్ కోసం.. యూకే ప్రభుత్వం సరికొత్త పథకం!

సీఎం రేవంత్ వ్యూహానికి తట్టుకోలేకపోతున్నారా.. సిరిసిల్ల, సిద్దిపేటలో మారుతున్న పొలిటికల్ సీన్?

పాముతో పెళ్లి, నదిలో అద్భుతం.. బతుకమ్మ పాటల్లో ఆ పేర్లలో ఉన్న రహస్యం ఇదే!

పుష్కరకాలంలో యువత యూటర్న్‌..! మోడీ అప్పుడు కొత్త ఓటర్ల పాలిట హీరో..! అందుకే నెత్తినెత్తుకున్నారు.. ఇప్పుడెందుకు వైఖరి మారింది? సీఎస్‌డీఎస్‌ ఆసక్తికర విశ్లేషణ..!

బీజేపీలో బతుకమ్మ రాజకీయ మంటలు.. మరోసారి భగ్గుమన్న నేతల ఆధిపత్య పోరు!

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు సీపీఎం పార్టీ సై.. ఈ జిల్లాలపై స్పెషల్ ఫోకస్!

Big Stories

Advertisement
×