US Green Card: అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది వలసదారులకు ఒక గుడ్ న్యూస్ వచ్చేలా కనిపిస్తోంది. మీ మీద డిపోర్టేషన్ ఆర్డర్ ఉన్నా.. అమెరికాలో పదేళ్లుగా నివసిస్తుంటే గ్రీన్‌కార్డు పొందే అవకాశం వస్తే? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ అలాంటి ప్రతిపాదనతో అమెరికా కాంగ్రెస్‌లో కొత్త బిల్లు వచ్చింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.. ఈ బిల్లు తెచ్చింది డెమోక్రాట్లు. మరి ట్రంప్ దీనికి ఓకే చెబుతారా? అసలు ఈ బిల్లులో ఏముంది?అసలు ఎవరెవరికి ఈ చాన్స్ దొరుకుతుంది? నిజానికి ఈ బిల్లు గురించి ఈజీగా అర్థం కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను వినండి.
ఈ ఒక్క కథే అమెరికాలో కొత్త బిల్లుకి కారణం
హర్జీత్ కౌర్. వయసు 73. ముప్పై ఏళ్లుగా కాలిఫోర్నియాలో ఉంటోంది. టైలరింగ్ చేసుకుంటూ బతికింది. వర్క్ పర్మిట్ ఉంది. ICE ఆఫీస్‌కి రెగ్యులర్‌గా చెక్-ఇన్‌కి వెళ్తోంది. 2025 సెప్టెంబర్‌లో అలాగే చెక్-ఇన్‌కి వెళ్లింది. ఇంటికి తిరిగి రాలేదు. రీజన్.. ఆమెని ఇండియాకి పంపేశారు. ఈ ఒక్క కథే అమెరికాలో కొత్త బిల్లుకి కారణమైంది.
ఇమిగ్రేషన్ కోర్టు ఇచ్చే ఫైనల్ ఆర్డర్
ఫైనల్ ఆర్డర్ ఆఫ్ రిమూవల్. సింపుల్‌గా మీరు దేశం విడిచి వెళ్లాలి అని ఇమిగ్రేషన్ కోర్టు ఇచ్చే ఫైనల్ ఆర్డర్. కౌర్‌కి ఆ ఆర్డర్ 2005లోనే వచ్చింది. కానీ అది వచ్చిన వెంటనే ఎవరినీ పంపించేయరు. కొన్నిసార్లు ప్రభుత్వమే వాయిదా వేస్తుంది, కొన్నిసార్లు కోర్టు స్టే ఇస్తుంది, కేసులు నడుస్తుంటాయి. కౌర్ లాంటి వాళ్లు ఏళ్లకు ఏళ్లు చెక్-ఇన్స్‌కి వెళ్తూ, పన్నులు కడుతూ, పని చేసుకుంటూ బతికారు. కానీ ఇక్కడ ఒక పెద్ద లూప్‌హోల్ ఉంది. ఇలాంటి ఆర్డర్లకు ఇప్పుడు ఎక్స్‌పైరీ డేట్ లేదు. ఇరవై ఏళ్ల క్రితం ఆర్డర్ అయినా సరే, ఎప్పుడైనా అమలు చేసే పవర్ ప్రభుత్వానికి ఉంది. ట్రంప్ రెండో టర్మ్‌లో ఇలాంటి వాళ్లపైనే ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి వాళ్లకు ఇప్పుడు ఒక కొత్త అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతోంది. అమెరికాలో పదేళ్లుగా ఉంటున్న కొంతమంది వలసదారులకు గ్రీన్‌కార్డు పొందే అవకాశం కల్పించేలా డెమోక్రాట్లు కొత్త బిల్లును తీసుకొచ్చారు.
అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన ఎంపీలు
ఈ బిల్లు పేరు ప్రొటెక్ట్ అవర్ నైబర్స్ యాక్ట్. నవంబర్ 19న కాలిఫోర్నియాకు చెందిన నలుగురు డెమోక్రటిక్ ఎంపీలు దీన్ని అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. లతీఫా సిమన్, జోయ్ లాఫ్‌గ్రెన్, జాన్ గరమెండి, జువాన్ వర్గస్ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ బిల్లులో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి.
ఈ బిల్లులో ముఖ్యమైన విషయాలు..
ఒకటి.. ఎక్స్‌పైరీ డేట్. ఆర్డర్ వచ్చిన పదేళ్ల తర్వాత అది ఆటోమేటిక్‌గా ఎక్స్‌పైర్ అయిపోతుంది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు అధికారులు వచ్చి.. వారిని పట్టుకొని వారి సొంత దేశాలకు పంపలేరు. అయితే అలా జరగాలంటే.. ఆ పదేళ్ల పాటు.. ఆ వ్యక్తి అమెరికాలో నిరంతరంగా ఉండాలి అండ్ ఏ నేరంలోనూ దోషిగా ఉండకూడదు. రెండు.. ఆ గడువు ముగిసిన తర్వాత అర్హులైన వాళ్లకు గ్రీన్‌కార్డు కోసం అప్లై చేసుకునే అవకాశం కల్పించడం. ఇది గోల్డెన్ చాన్స్ అన్నమాట. మూడు.. ప్రభుత్వానికి ఒక ఎస్కేప్ డోర్. ఎక్స్‌పైర్ అయిన ఆర్డర్‌ని మళ్లీ రెన్యూ చేయించాలంటే ఇమిగ్రేషన్ జడ్జి దగ్గరికి వెళ్లాలి. అక్కడ క్లియర్ అండ్ కన్విన్సింగ్ ఎవిడెన్స్ చూపించాలి. అంటే ఆలస్యానికి బలమైన కారణం ఉండాలి. అది అడ్మినిస్ట్రేటివ్ లేదా ఫండింగ్ ఆలస్యం అయితే కుదరదు. కొత్త ఆధారాలతో రెన్యూవల్ చాలా అవసరం అని ప్రూవ్ చేయాలి. అప్పుడే మళ్లీ ఆర్డర్ ఇష్యూ అవుతుంది.
రూల్స్ ఫాలో అయినోళ్లకే రిలీఫ్..
సో.. కండిషన్స్‌ను చూస్తే.. ఇది అందరికీ ఫ్రీ పాస్ కాదు.. రూల్స్ ఫాలో అయినోళ్లకే రిలీఫ్ దక్కుతుందని క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. ఇలా రూల్స్ ఫాలో అవుతూ అమెరికాలో ఉంటున్న వారికి ఇది ఒక కొత్త అవకాశం కావచ్చు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వలసదారులు ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఈ బిల్లు ఒక సంజీవనీ అని చెప్పాలి. ప్రస్తుతం అమెరికాలో తుది డిపోర్టేషన్ ఆర్డర్లు ఉన్నప్పటికీ, వెంటనే దేశం నుంచి పంపించని వాళ్లు కూడా ఉన్నారు. కొంతమంది ఏళ్ల తరబడి అమెరికాలోనే ఉంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబాలతో జీవిస్తున్నారు. ట్యాక్స్‌లు కూడా చెల్లిస్తున్నారు. కానీ వాళ్లపై ఉన్న డిపోర్టేషన్ ఆర్డర్ మాత్రం అలాగే ఉంటుంది. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ వివరాల ప్రకారం.. దాదాపు 16 లక్షల మంది తుది డిపోర్టేషన్ ఆర్డర్లతో అమెరికాలో ఉన్నారు.
ఈ బిల్లు చట్టంగా మారుతుందా?
ఇప్పుడు అసలైన ప్రశ్న.. ఈ బిల్లు చట్టంగా మారుతుందా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలసల విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటోంది. మరోవైపు డెమోక్రాట్లు ఈ బిల్లు ద్వారా పదేళ్లుగా అమెరికాలో నివసిస్తున్న కొంతమంది వలసదారులకు ఊరట కల్పించాలని చూస్తున్నారు. అయితే ఈ బిల్లు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ముందుగా కాంగ్రెస్‌లో ఆమోదం పొందాలి. ఆ తర్వాత అధ్యక్షుడి సంతకం కూడా అవసరం. ట్రంప్ ప్రభుత్వం ఈ బిల్లుకు మద్దతు ఇస్తారా లేదా అనేది అసలు ఓ పెద్ద డౌట్. అందుకే ఇప్పుడే గ్రీన్‌కార్డు వస్తుందని ఎగిరి గంతేయ్యవద్దు.
అమెరికా వెళ్లాలని కలలు కంటున్న వాళ్లకు మంచి ఛాన్స్..
ఇప్పుడు అమెరికాలో లేమ్-డక్ సెషన్ నడుస్తోంది. అంటే పదవీకాలం ముగిసే టైమ్. అందుకే ఈ ఏడాది లోపు ఈ బిల్లు ఓటింగ్‌కి రావడం దాదాపు అసాధ్యం. కానీ ట్విస్ట్ ఏంటంటే.. వచ్చే ఏడాది డెమోక్రాట్లకు కాంగ్రెస్‌లో పట్టు పెరుగుతోంది. అప్పుడు ఈ బిల్లులను ఓటింగ్‌కి తీసుకెళ్లే పవర్ వాళ్లకి వస్తుంది. అప్పుడు ఇది మళ్లీ తెరపైకి రావచ్చు. ఆ తర్వాత కూడా ట్రంప్ సంతకం కావాలి. ట్రంప్ ఇమిగ్రేషన్ డీల్‌కి ఓపెన్‌గా ఉన్నా, ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తారన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఈ బిల్లుకు లైన్ క్లియర్ అయితే మాత్రం.. అమెరికాలో ఉంటున్న భారతీయులకే కాదు.. అమెరికా వెళ్లాలని కలలు కంటున్న వాళ్లకు కూడా మంచి చాన్స్ అనే చెప్పొచ్చు.
Also Read: ప్రపంచంలోనే అత్యంత వింత రైళ్లు.. ఒకటి నత్తనడకన.. మరొకటి గాల్లో వేలాడుతూ!