Jensen Huang: ఒక సీఈఓ రాజీనామా చేశారు. కంపెనీ కూడా ఆయన్ని తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పింది. కానీ కేవలం 11 రోజుల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అదే కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఆయన్ని మళ్ళీ సఈఓ కుర్చీలో కూర్చోబెట్టింది. అసలు ఏం జరిగింది? నో చెప్పిన బోర్డు ఒక్కసారిగా ఎస్ ఎందుకు చెప్పింది? డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ ఈ కథలోకి ఎందుకు వచ్చారు? ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టించిన ఎన్విడియా సఈఓ జెన్సన్ హువాంగ్ రీ అపాయింట్మెంట్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.
సీఈఓ పదవికి రాజీనామా..
ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎన్విడి అంటే ఇప్పుడు కేవలం ఒక చిప్స్ తయారీ కంపెనీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ రెవల్యూషన్ అవసరమైన హార్డ్‌వేర్ ను అందిస్తున్న అతి పెద్ద సంస్థల్లో ఒకటి.ఏఐ ఏఐ ప్లాట్ఫార్మ్స్ నుంచి భారీ ఏఐ డేటా సెంటర్ల వరకు ఎన్నో టెక్నాలజీల వెనుక ఎన్విడియో చిప్స్ ఉన్నాయి. అలాంటి కంపెనీని మూడు దశాబ్దాలకు పైగా నడిపిస్తున్న వ్యక్తి జెన్సన్ హువాంగ్ అయితే నవంబర్ 12న ఒక్కసారిగా ఆయన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. దీనికి కారణం
కంపెనీ నష్టాల్లో ఉండటమో వ్యాపారం పడిపోవడమో కాదు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు ఒక్కసారిగా బయటకు రావడమే. జెన్సన్ తన వ్యక్తిగత జీవితంలో తప్పులు చేసినట్లు అంగీకరించారు. వివాహిత సంబంధాలకు సంబంధించిన ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఇందులో అలీస్ హువాంగ్ అనే సింగపూర్ కు చెందిన వ్యాపార వ్యత్త పేరు ప్రధానంగా వినిపించింది.
అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు డౌట్స్
అయితే అసలు వివాదం ఇక్కడితో ఆగలేదు. అలీస్ కు చైనా ఇంటెలిజెన్స్ వర్గాలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు డౌట్స్ వచ్చాయి. ఆమె గతంలో పనిచేసిన మెగాస్పీడ్ అనే కంపెనీ ద్వారా ఎన్విడియా చిప్స్ చైనాకు చేరాయా అనే అంశం పైన కూడా విచారణ జరుగుతోంది. ఇక్కడే వ్యక్తిగత వ్యవహారం కాస్త అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారిపోయింది. అయితే అలీస్ చైనా గూడాచారి అనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. జెన్సన్ పై వచ్చిన ఆరోపణలు కూడా విచారణలో ఉన్న అంశాలే. ఇదంతా బ్యాక్ గ్రౌండ్ స్టోరీ. ఇక జెన్సన్ రాజీనామా చేసిన తర్వాత ఎన్విడియా సిఎఫ్ఓ కోలెట్ క్రెస్ ను తాత్కాలిక సఈఓ గా నియమించింది. అప్పటివరకు అంతా సాఫీగానే కనిపించింది. కానీ అసలైన ట్విస్ట్ నవంబర్ 17 న వచ్చింది. జెన్సన్ తిరిగి సఈఓ గా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.
జెన్సన్ హువాంగ్ ఎలాన్ మస్క్ మద్దతు..
కానీ ఎన్విడి బోర్డ్ చైర్మన్ హార్వే జోన్స్ మాత్రం తమ నిర్ణయాన్ని స్పష్టం చేశారు. జెన్సన్ రాజీనామాను ఏకగ్రవంగా ఆమోదించామని ఆయన్ని తిరిగి సఈఓ గా నియమించే ఉద్దేశం లేదని చెప్పారు. ఇక జన్సన్ కథ ముగిసినట్లేనని చాలా మంది భావించారు. కానీ ఇక్కడే సిలికాన్ వ్యాలీ రంగంలోకి దిగింది. ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రముఖులుగా ఉన్న చాలా మంది జెన్సన్ తిరిగి రావాలని కోరడం మొదలు పెట్టారు. ఎలాన్ మస్క్ కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. మాజీ ఉబర్ సఈఓ ట్రావిస్ కలానిక్ సహా పలుూరు ప్రముఖులు కూడా జెన్సన్ కు మద్దతు తెలిపారు. ఆన్లైన్ లో ఆయన తిరిగి రావాలంటూ ఒక పిటిషన్ కుర లక్షలకు పైగా సంతకాలు వచ్చాయి. అందులో ఎన్విడియో ఉద్యోగులుగా తమను తాము గుర్తించుకున్న వేలాది మంది కూడా ఉన్నారు. అంటే కంపెనీకి జెన్సన్ ఎంత ముఖ్యమో ఈ మద్దతు చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ వ్యవహారంలోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వచ్చారు. జెన్సన్ గొప్ప ప్రతిభ ఉన్న వ్యక్తి అని ఆయన తిరిగి ఎన్విడియా బాధ్యతలు చేపట్టాలని ట్రంప్ బహిరంగంగానే అందరి ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఎన్విడియా బోర్డు తో తాను మాట్లాడానని వారిని ఒప్పించానని కూడా ట్రంప్ చెప్పారు.
ట్రెజరీ సెక్రెటరీ స్కాప్ బెసంట్ వైఖరిలో మార్పు..
ట్రెజరీ సెక్రెటరీ స్కాప్ బెసంట్ వైఖరిలో కూడా మార్పు కనిపించింది. గతంలో కంపెనీ నాయకత్వంలో మార్పు అవసరమని భావించిన ఆయన తర్వాత జెన్సన్ తిరిగి రావడాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదు. ఇలా ఒకవైపు సిలికాన్ వ్యాలీ ప్రముఖుల మద్దతు మరోవైపు ట్రంప్ జోక్యం ఇంకోవైపు కంపెనీ భవిష్యత్తుపై ఆందోళన. ఈ పరిణామాలన్నీ ఎన్విడియా బోర్డు పై ఒత్తిడిని పెంచాయి. చివరికి నవంబర్ 23న అందరిని ఆశ్చర్యపరుస్తూ కంపెనీ కీలక ప్రకటన చేసింది. జెన్సన్ హువాంగ్ ను తిరిగి ఎన్విడియా సఈఓ గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. అది కూడా బోర్డు ఏకగ్రీవ నిర్ణయంతో ఇంతకుముందు ఆయన్ని తిరిగి తీసుకునే ఉద్దేశం లేదని చెప్పిన అదే బోర్డు ఇప్పుడు ఆయన నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారుల నుంచి కూడా సమాచారం తీసుకున్నామని జెన్సన్ తిరిగి బాధ్యతలు చెపట్టడం వల్ల జాతీయ భద్రతకు ముప్పు లేదని బోర్డు స్పష్టం చేసింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ట్రంప్ కూడా ఈ నిర్ణయం తన జోక్యంతోనే సాధ్యమైందని చెప్పారు. ఎన్విడియా నిర్ణయం వెలువడిన వెంటనే ఎలాన్ మస్క్ స్పందిస్తూ తప్పు సరిదిద్దారు అనేశారు.
మార్కెట్ లో భారీ ఇంపాక్ట్..
మార్కెట్ లో కూడా ఈ నిర్ణయం భారీ ఇంపాక్ట్ చూపించింది. జెన్సన్ తిరిగి సఈఓ గా వస్తున్నారనే ప్రకటనతో ఎన్విడియా షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలో సుమారు 33% వరకు పెరిగాయి. ఒక్కసారి ఆలోచించండి ఒక వ్యక్తి రాజీనామా చేసినప్పుడు కంపెనీ భవిష్యత్తుపై ఆందోళన. అదే వ్యక్తి తిరిగి వస్తున్నాడని ప్రకటించగానే మార్కెట్ లో భారీ ఉత్సాహం దీన్ని బట్టి ఎన్విడియాలో జెన్సన్ హువాంగ్ పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న కూడా మిగిలే ఉంది. ఇంతటి వివాదం వచ్చిన తర్వాత కూడా ఆయన్ని తిరిగి తీసుకోవాల్సిన అవసరం కంపెనీకి ఎందుకు వచ్చింది? దీనికి ప్రధాన కారణం ఎన్విడియాతో జెన్సన్ కు ఉన్న అనుబంధం.
ఎదుగుదలలో ఆయనదే కీలక పాత్ర..
1993 లో కంపెనీని స్థాపించినప్పటి నుంచి దాని ఎదుగుదలలో ఆయనదే కీలకపాత్ర. ఏఐ ఏఐ చిప్స్ మార్కెట్ లో ఎన్విడియాను అగ్రస్థానానికి తీసుకెళ్ళిన నాయకుడు ఆయనే అందుకే ఆయన లేకుండా కంపెనీ భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో కనిపించింది. అయితే జెన్సన్ తిరిగి సఈఓ గా రావడంతో అన్ని సమస్యలు పరిష్కారం అయపోయాయని అనుకోవద్దు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుంది. ఎన్విడియా కూడా స్వతంత్ర బోర్డు కమిటీ ద్వారా దర్యాప్తును కొనసాగిస్తామని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వ సంస్థల విచారణలు కూడా ఇంకా ముగియలేదు. అంటే సఈఓ కూర్చి తిరిగి దక్కింది. కానీ వివాదాలకు మాత్రం ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. మొత్తానికి ఈ 11 రోజుల వ్యవహారం ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చూపించింది. ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఒక కంపెనీకి దాని సఈఓ ఎంత ముఖ్యమో ఆ సఈఓ వెనుక ప్రభుత్వాలు ఇన్వెస్టర్లు టెక్నాలజీ దిగ్గజాల మద్దతు ఎంత ప్రభావం చూపగలదో ఈ ఘటన మరోసారి నిరూపించింది. మొదట వద్దన బోర్డే చివరికి ఏకగ్రీవంగా ఆహ్వానించింది. ఇది జెన్సన్ హువాంగ్ కు దక్కిన రెండో అవకాశం మాత్రమేనా లేక ఎన్విడియా లాంటి కంపెనీకి ఆయన ఎంత అవసరమో ప్రపంచానికి తెలిసిన క్షణమా ఏదేమైనా 11 రోజుల్లో జరిగిన ఈ యూటర్న్ మాత్రం టెక్నాలజీ ప్రపంచంలో చాలా కాలం చర్చలో ఉంటుంది అనడంలో డౌటే లేదు.
Also Read: రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఒక్క రిజర్వాయర్ అయినా కట్టారా? హరీశ్‌రావు