E-Paper
Advertisement

హైదరాబాద్‌ను భయపెడుతున్న నీటి గండం.. ఏడాదిలో 4 రెట్లు పెరిగిన ట్యాంకర్ బుకింగ్స్!

హైదరాబాద్‌ను భయపెడుతున్న నీటి గండం.. ఏడాదిలో 4 రెట్లు పెరిగిన ట్యాంకర్ బుకింగ్స్!
Advertisement

Hyderabad Water Crisis: జనాలతో కళకళలాడే హైదరాబాద్.. త్వరలోనే నీళ్లు లేక వెలవెలబోయే పరిస్థితి రాబోతోంది.. తాగడానికి నీళ్లు లేక, కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి వస్తే.. ఈ మహానగరం పరిస్థితి ఏంటి? ఇప్పటికే హైదరాబాద్‌కు నీటిని అందించే రిజర్వాయర్లలో నీటి నిల్వలు భారీగా పడిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో తీవ్ర నీటి కరువు తప్పదు.

హైదరాబాద్‌ను భయపెడుతున్న నీటి కొరత..

Advertisement

హైదరాబాద్ అంటేనే ఎన్నో ఆశలకు అడ్డా.. ఉన్నత చదువుల కోసం ఒకరు, మంచి ఉద్యోగం కోసం మరొకరు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఇంకొకరు.. ఇలా ఎన్నో కలలతో ప్రతిరోజూ వేలాది మంది ఈ నగరానికి వస్తుంటారు. కొందరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతుంటారు. మరికొందరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారు. ఇలా ఒక్క హైదరాబాద్ నగరాన్ని నమ్ముకుని లక్షలాది మంది బతుకుతున్నారు. కానీ ఇప్పుడు అదే హైదరాబాద్‌ను నీటి కొరత భయపెడుతోంది.

అసలు హైదరాబాద్‌కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి?

Advertisement

సింగూరు, మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌తో పాటు కృష్ణా, గోదావరి జలాలు నగరానికి ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ నీటి వనరుల్లో కొన్ని రిజర్వాయర్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా సింగూరు రిజర్వాయర్‌లో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.91 TMCలు కాగా.. ప్రస్తుతం కేవలం 1.95 TMCల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపు 6.5 శాతం నిల్వలే మిగిలాయి.

రిజర్వాయర్లపై నీటి ఒత్తిడి

మరోవైపు మంజీరా రిజర్వాయర్‌లోనూ 1.5 TMCల పూర్తి సామర్థ్యానికి గానూ కేవలం 0.19 TMCల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అంటే హైదరాబాద్‌కు నీటిని అందించే కీలక వనరుల్లో నీటి నిల్వలు ఎంతలా పడిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతలా నీళ్లు తగ్గిపోవడానికి కారణమేంటి? ఈ ఏడాది తెలంగాణలో వర్షపాతం లోటు నమోదైంది. సాధారణంగా కురవాల్సిన వర్షాల కంటే తక్కువ వర్షాలు పడటంతో రిజర్వాయర్లలోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. హైదరాబాద్‌లోనూ సాధారణ వర్షపాతం కంటే 34 శాతం తక్కువ వర్షం నమోదైంది. దీంతో ఇప్పుడు రిజర్వాయర్లపై నీటి ఒత్తిడి పెరుగుతోంది.

నీటి కొరతతో హైదరాబాద్ ప్రజలకు ఇబ్బందులు

ఇక్కడే అసలు సమస్య ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నీటి కొరత మరింత పెరిగితే ట్యాంకర్లకు డిమాండ్ పెరగడం, వాటి కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి రావడం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చు.

ఉద్యోగులపై దీని ప్రభావం

ముఖ్యంగా హాస్టళ్లు, PGలు, అద్దె ఇళ్లలో ఉండే విద్యార్థులు, ఉద్యోగులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. ఇప్పటికే చదువులు, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వచ్చేవాళ్లు భారీగా హాస్టల్ ఫీజులు, ఇంటి అద్దెలు చెల్లిస్తున్నారు. దీనికి నీటి ఖర్చులు కూడా అదనంగా తోడైతే యజమానులు హాస్టల్ ఫీజులు, అద్దెలు పెంచే అవకాశం లేకపోలేదు.అంతేకాదు.. హోటళ్లు, చిన్న వ్యాపారాలు, నిర్మాణ రంగం, ఇతర రోజువారీ పనులు చేసుకునే వాళ్లకు కూడా నీరు ఎంతో అవసరం.నీటి కొరత పెరిగితే వీళ్ల పనులు దెబ్బతినొచ్చు. వ్యాపార నిర్వహణ ఖర్చులు పెరగొచ్చు. చివరికి ఆ భారం కూడా సామాన్య ప్రజల మీద పడే ప్రమాదం ఉంది.అంటే నీటి సమస్య అనేది కేవలం ఒక ఇంటికి సంబంధించిన సమస్య కాదు.. నగరం మొత్తం ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపించే సమస్య.

హైదరాబాద్‌కు నీటి సరఫరా ఆగిపోతుందా?

మరి హైదరాబాద్‌కు నీటి సరఫరా ఆగిపోతుందా? ప్రస్తుతానికి అలా చెప్పలేం. ఎందుకంటే నగరానికి కృష్ణా, గోదావరి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి ఇతర నీటి వనరులు కూడా ఉన్నాయి. అయితే సింగూరు, మంజీరా నుంచి నీటి సరఫరాలో లోటు ఏర్పడితే.. ఆ కొరతను ఇతర వనరుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అదనంగా 60 MGD నీటిని అందుబాటులోకి తీసుకురావాలని వాటర్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
అయినా మరోవైపు ట్యాంకర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది.గత ఏడాది అక్టోబర్‌లో 48,284 ట్యాంకర్ బుకింగ్స్ నమోదైతే.. ఈ ఏడాది అక్టోబర్‌లో ఏకంగా 1,92,889 బుకింగ్స్ నమోదయ్యాయి.అంటే ఒక్క ఏడాదిలోనే ట్యాంకర్లకు డిమాండ్ దాదాపు నాలుగు రెట్లు పెరిగింది.

ఇవన్నీ అమలు చేస్తే బెటర్ ఏమో..

ఒక్కసారి ఆలోచించండి.. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చిన విద్యార్థి, ఉద్యోగం కోసం వచ్చిన యువకుడు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగి.. వీళ్లంతా నీళ్ల కోసం కూడా ఇబ్బందులు పడాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? నీళ్లు దొరకకపోతే ట్యాంకర్ల కోసం అదనంగా ఖర్చు చేయాలి. ఇంటి అద్దెలు, హాస్టల్ ఫీజులు పెరిగితే ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. చివరికి హైదరాబాద్‌లో ఉండటం కూడా భారంగా మారే పరిస్థితి రావచ్చు. ఒక నగరం అభివృద్ధి చెందాలంటే భారీ భవనాలు, ఐటీ కంపెనీలు, ఫ్లైఓవర్లు మాత్రమే సరిపోవు. అక్కడ బతికే ప్రజలకు కనీస అవసరమైన నీళ్లు కూడా అందాలి. వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడం, చెరువులను కాపాడుకోవడం, భూగర్భ జలాలను పెంచడం.. ఇవన్నీ ఇప్పటి నుంచే అమలు చేయాలి.

Also Read: అమెరికాలో 10 ఏళ్లు ఉంటే గ్రీన్‌కార్డు! డెమోక్రాట్ల కొత్త బిల్లులో ఏముంది?

Tags

Related News

గ్రేటర్‌ ఓటరు దూరం దూరం..! 35 శాతమే ఓటర్లుగా నమోదైన వైనం..! 12 లక్షలకు 36,837 మందే ఓటర్లుగా నమోదు..!

అమెరికాలో 10 ఏళ్లు ఉంటే గ్రీన్‌కార్డు! డెమోక్రాట్ల కొత్త బిల్లులో ఏముంది?

బీఆర్‌ఎస్‌కు గుదిబండలా సీఎంగా కేటీఆర్‌! ఇటీవల తీవ్రంగా ప్రచారం చేస్తున్న పొలిటికల్ సర్కిల్స్‌…!

జెన్సన్ హువాంగ్ రీ-అపాయింట్మెంట్.. ఎన్విడియా బోర్డు నిర్ణయం వెనుక ట్రంప్, మస్క్ పాత్ర ఏంటి?

తెలంగాణలో బీజేపీకి షాకింగ్ న్యూస్.. పార్టీకి ఆ కీలక నేతలు దూరం..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకింగ్ న్యూస్.. బీఆర్ఎస్ సంచలన వ్యూహం?

ఇందూరులో ఉన్నది అర్వింద్‌ బీజేపీ! ఇ ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణ..! ఎంపీతో ఎమ్మెల్యేల ఎడముఖం పెడముఖం!

Big Stories

Advertisement
×