E-Paper
Advertisement

అందరినీ నవ్వించిన కమెడియన్‌కు ఇంత కష్టమా? రామచంద్ర పరిస్థితి చూస్తే కన్నీళ్లే!

అందరినీ నవ్వించిన కమెడియన్‌కు ఇంత కష్టమా? రామచంద్ర పరిస్థితి చూస్తే కన్నీళ్లే!
Advertisement

Ramachandra Health Update:రామచంద్ర..ఇప్పటి జనరేషన్ కి ఈ కమెడీయన్ పెద్దగా పరిచయం లేకపోవచ్చు కాని,90s కిడ్స్ కి ఈయనని పరిచయం చేయాల్సిన పని లేదు.ముఖ్యంగా వెంకీ సినిమాలో తనదైన కామెడీతో ఎంతో మందిని అలరించి,నవ్వించిన రామచంద్ర అనారోగ్యం పాలవడంతో తట్టుకోలేకపోతున్నారు అభిమానులు.బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టడం వల్ల న్యూరో సంబంధిత సమస్య భారిన పడ్డాడని,ఆ తర్వాత పక్షవాతం రావడంతో ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా మారిందని తెలుస్తుంది.

దాంతో దాదాపు 11 నెలలుగా చికిత్స తీసుకుంటూ, ఫిజియోథెరపీ సహాయంతో మళ్లీ నడవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఒకవైపు ఆరోగ్యం బాగాలేకపోవడం,మరో వైపు ట్రీట్ మెంట్ చేయించుకోవడానికి తగినంత డబ్బులు లేకపోవడంతో రామచంద్రకు మరోసారి ఆర్థిక సహాయం అందించాలని ఆయన కుటుంబ సభ్యులు సినీ ఇండస్ట్రీకి అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

బ్రెయిన్‌లో క్లాట్.. పక్షవాతంతో ఇబ్బందులు

నటుడు రామచంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి తాజాగా పలు విషయాలు బయటికి వచ్చాయి. ఆరోగ్యం బాగా లేకపోవడంతో హాస్పిటల్ లో చికిత్స జరిగిందని, ఆ తర్వాత, ఫిజియోథెరపీ అవసరం కావడంతో జీవ రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచారు. దాదాపు 11 నెలలుగా అక్కడే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.ఇక రామచంద్ర కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని సమాచారం.

Advertisement

మాట్లాడటానికి, నడవటానికి ఇంకా ప్రయత్నం

ఒకప్పుడు తనదైన కామెడీతో నవ్వించిన రామచంద్ర ఆరోగ్య పరిస్థితి ఎంతగా అతన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆయన ఇప్పుడు మాట్లాడటానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. మాట పూర్తిగా స్పష్టంగా రావడం లేదని, మధ్యలో కొంచెం కోలుకున్నట్టు అనిపించినా మళ్లీ సమస్య తిరగదోడిందని తెలుస్తుంది.

అలాగే ప్రతిరోజూ ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారని , ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో ఫిజియోథెరపీ సెషన్లు ఉంటున్నాయని, వాటి ద్వారా చిన్నచిన్న అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే శరీరంలో బలం తగ్గిపోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు కూడా ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి. గతంలో సుమారు 80 నుంచి 90 కిలోల వరకు ఉన్న బరువు ఇప్పుడు దాదాపు 60 కిలోలకు పడిపోయినట్లు తెలుస్తుంది.

యూరిన్ సమస్యతోనూ ఇబ్బందులు

ఇక బ్రెయిన్‌కు సంబంధించిన సమస్యతో పాటు రామచంద్ర యూరిన్ కి సంబందించిన సమస్యలు కూడా చుట్టుముట్టినట్టు ఆయన తమ్ముడు నారాయణ చెప్పుకొచ్చారు. గతంలో ఈ సమస్య ఎక్కువ అయితే సర్జరీ చేశారని ప్రస్తుతం డాక్టర్ల సమక్షంలో క్రమం తప్పకుండా ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారని తెలిపారు.

ఒంటరితనం వేధిస్తోందన్న రామచంద్ర

రామచంద్ర ఆరోగ్య సమస్యలతో పాటు మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు స్నేహితులతో సరదాగా గడుపుతూ, సినిమాల్లో నటిస్తూ చురుగ్గా ఉండే ఆయన.. ఇప్పుడు ఎక్కువ సమయం మంచంపైనే గడపాల్సి వస్తోంది. ఇలా ఉండటం తనని ఎంతో బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు రామచంద్ర.

ఇక తనను ఎవరు చూసుకుంటున్నారని అడిగితే, తమ్ముడే అన్ని విషయాలు చూసుకుంటున్నాడని చెప్పారు. ఆర్థికంగా కూడా తమ్ముడిపైనే ఆధారపడాల్సి వస్తోందని బాధ పడిపోయారు. తన ఆరోగ్యం ఎప్పుడు మెరుగుపడుతుందని , మళ్లీ ఎప్పుడు సాధారణంగా నడవగలుగుతాననే అనే ఆశతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు.

రెండు నెలల్లో మళ్లీ సినిమాలు చేస్తాననే ఆశ

రామచంద్రను సినిమాల్లోకి ఎప్పుడు తిరిగి వస్తారని అడిగినప్పుడు, రెండు నెలల్లో సినిమాలు చేస్తానని చెప్పడం బట్టి చూస్తే తిరిగికోలుకోవాలనే పట్టుదల ఎంతగా ఉందో అర్థమవుతుంది.మళ్లీ నడవాలని, గతంలో మాదిరిగా తన పనులు తాను చేసుకోవాలని, సినిమాల్లో నటించాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రేక్షకులను నవ్వించిన నటుడు తిరిగి ఆరోగ్యంగా మారి తెరపై కనిపించాలనే ఆశ అభిమానుల్లోనూ ఉంది.

అన్న కోసం తమ్ముడు నారాయణ చేస్తున్న పోరాటం

అయితే తమకి తల్లిదండ్రులు లేకపోవడంతో ఇద్దరూ ఒకరికొకరు తోడుగా జీవిస్తున్నామని . తన అన్నను ఎలాగైనా కోలుకునేలా చేయాలనే ఉద్దేశంతో చికిత్స కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపాడు తమ్ముడు నారాయణ ఇంట్లో ఇద్దరే ఉండటం, ప్రతిరోజూ అతన్ని చూసుకోవడం కష్టంగా ఉందని ఇలా రిహాబిలిటేషన్ లో చేర్పించానని తెలిపారు.

అయితే చికిత్స ఖర్చులు భరించడం తనకు తలకి మించిన భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బయట నుంచి అప్పులు తీసుకొచ్చి అన్నకు వైద్యం చేయిస్తున్నానని, ఇప్పటివరకు ఎంత ఖర్చయిందో కూడా పూర్తిగా చెప్పలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అన్న కోలుకోవడానికి మరికొంతకాలం చికిత్స అవసరమని వైద్యులు చెప్పడం తో బయటవాళ్ళు ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తారేమో అని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

గతంలో ప్రభాస్ సహా పలువురు సినీ ప్రముఖుల సాయం

రామచంద్ర ఆరోగ్యం బాగోలేదని తెలిసిన మొదట్లో ప్రభాస్, సునీల్, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, సుకుమార్, శ్రీనివాస్ రెడ్డి వంటి వారు సహాయం చేసినట్టు తెలిపారు.అయితే ప్రస్తుతం మరోసారి ఆర్థిక సహాయం అవసరమైందని ,గతంలో సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ మరోసారి సహాయం అందించాలని వేడుకున్నారు.సినీ ఇండస్ట్రీలోని ఆర్టిస్టుల సంఘాన్ని కూడా సంప్రదించామని అయితే ఆసుపత్రి చికిత్సకు వర్తించే ఇన్సూరెన్స్ సదుపాయాలు రిహాబిలిటేషన్ సెంటర్ ఖర్చులకు వర్తించకపోవడం సమస్యగా మారిందని ఆయన వివరించారు.

 సినీ పరిశ్రమకు, అభిమానులకు నారాయణ విజ్ఞప్తి

తన అన్నను మళ్లీ ఆరోగ్యంగా చూడాలన్నదే తన కోరిక అని నారాయణ భావోద్వేగంగా తెలిపారు. ఇప్పటికే చాలా మంది సహాయం చేశారని, వారందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. అయితే చికిత్స ఇంకా కొనసాగాల్సి ఉండటంతో మరోసారి ఆర్థికంగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

తనకు తెలిసిన ప్రతి ఒక్కరినీ సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నానని, అయినప్పటికీ అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోవడం కష్టమవుతోందని చెప్పారు. అన్న మళ్లీ కోలుకుని అందరితో కలిసి సినిమాలు చేయాలన్నది తన చిన్న ఆశ అని పేర్కొన్నారు.

ఏది ఏమైనా ఒకప్పుడు మనల్ని నవ్వించిన రామచంద్ర ఇలా నిస్సహాయస్థితిలో మంచంపై పడి ఉండటం నిజంగా బాధాకరం,త్వరలో అయినా సరైన సహాయం అంది మళ్లీ ఆరోగ్యంగా మారి, సినిమాల్లో నటించాలని కోరుకుందాం.

ALSO READ :మంగ్లీ బతుకమ్మ పాట రెమ్యూనరేషన్ ఎంత? ఒక్కో పాటకు లక్షల్లో పారితోషికం

Tags

Related News

నాని ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షూర్..ఫస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్ ఇవే!

నవరాత్రి స్పెషల్.. ‘భరత వర్ష’ నుండి “అమ్మ కదిలి వచ్చే” సాంగ్ ప్రోమో రిలీజ్!

నా పెళ్లి నిర్ణయం అతని చేతుల్లోనే… పెళ్లి వార్తలపై మమిత క్రేజీ రియాక్షన్!

బ్రేకప్ అంటే ఎదుగుదల.. వైరల్ అవుతున్న అనుపమ కామెంట్స్!

సింగర్ గా ఛాన్స్ కొట్టేసిన జిమ్ జిమ్ తార ఫేమ్ ఆంటీ …

రెండు ఎకరాలంటూ పృథ్వీరాజ్ సెటైర్లు.. కాస్ట్ ఈవెంట్‌లో నవ్వులే నవ్వులు!

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీకాంత్ కుమార్తె మేధా… పూర్తి డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×