Big Stories

Change in Voter Slip : ఓటరు స్లిప్పుల్లో ఈ మార్పు గమనించారా ? క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే..

QR Code in Voter Slips(Today’s news in telugu): ఇంకా ఆరు రోజులే. ఆరంటే ఆరే రోజుల్లో ఏపీలో ఓట్ల పండుగ జరగనుంది. అదేనండి.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మరో ఆరు రోజుల్లో జరగనున్నాయి. నాలుగు రోజుల్లో ప్రచారాలకు తెరపడనుంది. ఇక ఉద్యోగాలు, పనుల నిమిత్తం సొంతఊర్లకు దూరంగా ఉంటున్నవారంతా ఓట్ల పండుగకు స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బస్సులు, రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. రైళ్ల వెయిటింగ్ లిస్టులు చాంతాడంత దర్శనమిస్తున్నాయి.

- Advertisement -

ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ జరుగుతోంది. అయితే ఈ స్లిప్పుల్లో ఈసారి చిన్న మార్పు జరిగింది. గతంలో ఓటరు స్లిప్పుపై ఓటరు ఫొటో, వ్యక్తిగత వివరాలు ఉండేవి గుర్తుందా? కానీ ఇప్పుడు వాటిలోనే చిన్నమార్పు చేసింది ఎలక్షన్ కమిషన్. ఓటరు ఫొటో స్థానంలో క్యూఆర్ కోడ్ ను ఉంచింది. బీఎల్ఓలు పంపిణీ చేస్తున్న ఓటరు స్లిప్పుల్లో క్యూ ఆర్ కోడ్ లు కనిపించాయి.

- Advertisement -

Also Read : మూడోదశ లోక్ సభ ఎన్నికలు.. ఓటు వేసిన ప్రధాని నరేంద్రమోదీ

ఓటర్లు.. voters.eci.in వెబ్ సైట్ లో లాగిన అయి.. ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే.. ఓటరు పేరు, వివరాలు, ఎపిక్ నంబర్, పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఓటర్లు ఓటు వేసేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసినపుడు చూడొచ్చు. అయితే ఓటర్లు తమ వివరాలను తెలుసుకునేందుకే స్లిప్పులు ఉంటాయని, ఓటు వేయాలంటే ఓటరు స్లిప్పుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఈసీ తెలిపింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News