E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: రాజీనామాపై పట్టు పట్టిన కవిత

Kalvakuntla Kavitha: రాజీనామాపై పట్టు పట్టిన కవిత
Advertisement

Kalvakuntla Kavitha:  కవిత రాజకీయంగా అడుగులు వేగంగా వేస్తున్నట్లు కనిపిస్తుందిను కవ. పార్టీ పెట్టే యోచనలో ఉన్న కవిత…అందుకు అనుగుణంగానే వ్యూహారచన చేస్తున్నారు. ఓవైపు తన ప్రత్యర్ధులపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతూనే…రాజకీయంగా తన యాక్షన్ ప్లాన్ ఏంటో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు కవిత. తనకు బీఆర్ఎస్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత…ఆ పదవికి రాజీనామ చేసిన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. తన రాజీనామాను ఆమోదించాలి మండలి చైర్మన్‌ను కోరిన తర్వాత కవిత చేసిన కామెంట్స్‌ చర్చకు దారి తీస్తున్నాయి.

రాజీనామా ఆమోదానికి మండలి చైర్మన్‌ను కలిసిన కవిత

ఎమ్మెల్సీ పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని మండల చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిసి జాగృతి అధ్యక్షఉరాలు కవిత కోరడానికి నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయడంతో కవిత అటు పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 3 తేదీన తాను రాజీనామా ఇఛ్చారని… దాన్ని ఆమోదించే ముందు ఫ్లోర్ లో తాను మాట్లాడేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఆడగడానికి అమె మండలి ఛైర్మన్‌ను కలవడానికి ఫిక్స్ అయ్యారు. నాలుగు నెలలుగా తన రాజీనామా యాక్సెప్ట్ చేయకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో మండలి చైర్మన్‌ను కలిసిన కవిత ఈ నెల 5 వ తేదీన శాసన మండలిలోమాట్లాడనున్నారు. మండలిలో మాట్లాడేందుకు సమయం ఇస్తానని ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమెకు హామీ ఇచ్చారంట.

కేసీఆర్ సభకు రాకపోతే బీఆర్ఎస్ ఖేల్ ఖతమంటున్న కవిత

Advertisement

అదలా ఉంటే మండలి చైర్మన్‌ను కలవడానికి ముందు కవిత మరోసారి బీఆర్ఎస్‌, కేసీఆర్‌లకు పలు సూచనలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోలే ఇక బీఆర్ఎస్ ఖేల్ ఖతమేనని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కవిత మాట్లాడుతూ.. ఈ సమావేశాలకు కేసీఆర్ వచ్చి సమాధానాలు చెప్పకపోతే బీఆర్‌ఎస్ పని ఖతం -అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ తప్పు చేయకపోతే సభకు రావాల్సిందే అని పట్టుబట్టారు. సభకు రాకుండా పిల్ల కాకుల మీద సభా సమయాన్ని వదలొద్దంటూ హితవు పలికారు.

సీఎం రేవంత్ రెడ్డి కవిత ఫైర్

అలాగే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టిన కేసీఆర్‌‌ను ఉరి తీయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. కేసీఆర్ మీద సీఎం భాష సరికాదన్నారు. కేసీఆర్‌ను ఒకసారి ఉరి తీయాలంటే, రేవంత్ రెడ్డిని పదిసార్లు ఉరి తీయాలంటూ మండిపడ్డారామె. సొంత జిల్లా మహబూబ్ నగర్‌కు రేవంత్ తెచ్చిన ప్రాజెక్టులు ఎన్నని ప్రశ్నించారు కవిత. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి కవిత మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఒక బచ్చా అని అన్నారు. ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏం తెలుసంటూ హరీష్‌ను టార్గెట్ చేస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సీఆర్‌ సభకు రాకపోతే హరీష్ రావే అన్నీ చూసుకోవడం సరికాదని.. కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

సెప్టెంబరు 3న రాజీనామా ప్రకటన చేసిన కవిత

Advertisement

సెప్టెంబర్ 3న తాను రాజీనామా చేశానని.. నాలుగు నెలల కాలంలో అనేక సమీకరణాలు జరిగాయని ఈ సందర్భంగా తెలిపారు కవిత. తనకు మాట్లాడే అవకాశాలు ఇవ్వాలని సభకు వచ్చినట్లు చెప్పారు. ఒక ఫైల్.. భట్టి దగ్గరకు వస్తే నెలల తరబడి ఉంటుందని.. ఎందుకు ఇంత అలసత్వమని ప్రశ్నించారు. సభా అవకాశాల దృష్ట్యా తాను తన రాజీనామా అంశాన్ని మండలి ఛైర్మన్ దగ్గర ప్రస్తావిస్తానని అన్నారు. చాల గ్రామాల్లో అన్ని పార్టీలు కలిసి పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేశాయని.. అందుకే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదని తెలిపారు. అక్కడక్కడా మోడీ, కేసీఆర్‌ ఫోటోలు కలిపి పెట్టినట్లు తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏదో కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌కు, తనకు సంబంధం లేదని స్పష్టీకరణ

సభలో హరీష్ వర్సెస్ రేవంత్ రెడ్డిల మధ్య వార్ ఉండనుందని కవిత చెప్పుకొచ్చారు. ఇది మరోసారి బీఆర్‌ఎస్‌కు బలమైన ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నారు. బబుల్ షూటర్ వచ్చి సభలో మాట్లాడితే పార్టీ బద్నామ్ అవుతుందంటూ ఎద్దేవా చేశారు. ఒక్కసారి కేసీఆర్ సభకు వచ్చి వివరణ ఇస్తే బాగుటుందని ఆమె అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌కు, తనకు సంబంధం లేదని.. ఇక ముందు ఉండబోదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదో తనకు తెలీదని.. గత నాలుగు నెలలుగా కేసీఆర్‌తో మాట్లాడలేదని చెప్పారు. ఇక్కడ ఫిక్స్‌డ్‌ మ్యాచ్ నడుస్తోందని ఆరోపించారు. అది సభా వేదికగా బయటపడిందన్నారు. నీటి వాటాల అంశంలో కేసీఆర్ ఒక్కరే సమాధానం చెప్పగలరని.. హరీష్ రావుకు అవకాశం ఇవ్వడం అనేది సరైంది కాదని కవిత పేర్కొన్నారు. మొత్తానికి కవిత దూకుడు పెంచుతుండటంతో త్వరలోనే ఆమె తన పార్టీ ప్రకటన చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Story By Ramireddy, Big Tv 

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×