BigTV English

KCR Polam Bata: లైట్స్‌.. కెమెరా..యాక్షన్..

KCR Polam Bata: లైట్స్‌.. కెమెరా..యాక్షన్..


KCR Latest Political News: అదే మాట.. అదే తీరు.. అధికారం దూరమైనా పద్ధతి మాత్రం మారలేదు.. అసత్యాలు మానలేదు.. ఇవి ఆరోపణలు కాదు.. కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న నిజాలు.. ఇంతకీ లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌ రైతురాగం వెనక రీజనేంటి? అసలు కేసీఆర్ పొలంబాట వెనక అసలు మతలబేంటి?  పచ్చని పొలాల్లో రైతులను పరామర్శిస్తున్నారు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్.. అది కూడా పంటలు ఎండిపోయాయని.. సరే మేం చెప్పేది అబద్ధమనుకోవడానికి కూడా లేదు. కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి విజువల్స్‌.. అటు పక్క పచ్చని పొలాలున్నాయి. ఇటు పక్క కేసీఆర్ రైతులను ఒదారుస్తున్నారు. ఇదెక్కడి మ్యాజికో అస్సలు సమజ్ కావడం లేదు కదా.. మీకే కాదు.. ఇప్పుడు తెలంగాణ స్టేట్‌వైడ్ మొత్తం ఇదే డిస్కషన్.

ఆ పక్కన బీఆర్ఎస్‌ కార్యకర్త చేతిలో ఉన్న వరి కూడా ఇంకా పచ్చగానే ఉంది. కావాలంటే చూడండి. ఇవీ కేసీఆర్ చేపట్టిన పొలంబాటలో కనిపించిన కొన్ని సీన్స్.. ఆయనేమో రైతులకు అన్యాయం జరిగిపోయింది. మీ తరపున నేను పోరాడుతా అంటూ వకాల్తా పుచ్చుకొని మరీ వాదిస్తున్నారు. నిజానికి కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్‌ నేతలు రైతు సెంట్రీక్‌గా రాజకీయాలు చేస్తున్నారు. మొదట హరీష్‌రావు స్టార్ట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ధర్నాలు చేశారు.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మమ్మల్ని ఎంతైనా తిట్టండి. కానీ రైతులను ఆదుకోండి అంటూ సెంటిమెంట్ డైలాగ్‌లు వేశారు. కానీ వర్కౌట్ కాలేదు. ఈసారి ఏకంగా గులాబీ బాస్ రంగంలోకి దిగారు.. ఆయనది కూడా సేమ్ అదే లైన్.. పంటలు ఎండిపోయాయి. ఇది వచ్చిన కరువు కాదు.


Also Read: కాంట్రవర్సీల కంగనా.. తొలి ప్రధానినే మార్చేసిందిగా.. ఈమెకా ఎంపీ సీటు ?

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అంటూ మొదలు పెట్టారు. కానీ అసలు లెక్కలు వేరే ఉన్నాయంటున్నారు ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అది కేసీఆర్ మాట.. ఇది ఉత్తమ్ కుమార్ మాట.. ఇది కేసీఆర్ తెచ్చిన కరువే అన్నది కాంగ్రెస్ కౌంటర్.. మరి ఆయన చేస్తున్న డిమాండ్లు బాగానే ఉన్నా.. అసలు ఆ డిమాండ్లు చేసే హక్కు ఆయనకు ఉందా అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో లక్ష రుణమాఫీ అన్నారు. ఇచ్చారా? నిరుద్యోగులకు 3 వేల భృతి అన్నారు. ఇచ్చారా? ఐదేళ్లలో లక్ష రుణమాఫీ చేయని కేసీఆర్‌.. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే.. 2 లక్షల రుణమాఫీ చేయమనడం ఎంతవరకు కరెక్ట్‌ అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మొత్తానికి లోక్‌సభ ఎన్నికల ముందు మళ్లీ రైతాంగం చుట్టే తిరుగుతోంది తెలంగాణ రాజకీయం.

ఇవన్నీ పక్కన పెడితే.. కేసీఆర్ ప్రెస్‌మీట్.. పొలంబాట కార్యక్రమం పుణ్యమా అని మరోసారి ఓ విషయమైతే కన్ఫామ్ అయ్యింది. కేసీఆర్ రూల్స్ చెబుతారు కానీ.. అస్సలు పాటించరని. ఎందుకంటే ఆయన నోటి నుంచి వచ్చిన భాషను చూస్తే అదే కదా అర్థమవుతోంది.. ఓ మాట మాట్లాడితే పద్ధతుండాలి.. ఓ హోదా ఉండాలి.. దానికో గుర్తింపు ఉండాలి.. అనే స్పీచ్‌లు దంచికొట్టే కేసీఆర్ గారు.. నిన్న ఆయన నోటి నుంచి కొన్ని పదాలను చాలా ఈజీగా వాడేశారు.

విన్నారుగా పండబెట్టి తొక్కేస్తారంట.. ఇంకా చాలా అన్నారు.. అవి నా నోటితో చెప్పలేను.. కనీసం వినిపించలేను. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ అడ్డం వస్తాయి. వేసినా అన్నీ బీప్‌లే వేయాల్సి ఉంటుంది. మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి భాషపై తెగ స్పీచ్‌లు ఇచ్చారు ఇదే కేసీఆర్ గారు.. ఇప్పుడేమో మళ్లీ తన పాత భాషే మొదలుపెట్టారు. మరి పదేళ్లు సీఎంగా పనిచేసిన వారు మాట్లాడే భాష ఇదేనా? అప్పుడే కేసీఆర్‌కు కౌంటర్లు మొదలయ్యాయి. ఇది పొలంబాట కాదు. ఎన్నికల బాట అని. రాజకీయం చేయాలి. కానీ రైతులతో కాదు. మీ పోరాటం పార్టీ ఉనికి కోసం కానీ.. అన్నదాతల కోసం కాదు. ఇది మేమంటున్న మాట కాదు.. అటు అధికారపక్షం.. ఇటు మీ తోటి విపక్ష నేతలు చెబుతున్నదే.

Tags

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×