BigTV English

Allu Arjun on BBC Top Gear Magazine: బీబీసీ టాప్ గేర్‌పై ఐకాన్ స్టార్.. దీనవ్వ తగ్గేదే లే..!

Allu Arjun on BBC Top Gear Magazine: బీబీసీ టాప్ గేర్‌పై ఐకాన్ స్టార్.. దీనవ్వ తగ్గేదే లే..!
Allu Arjun
Allu Arjun

Allu Arjun on BBC Top Gear Maxine Cover Page: కొత్త లుక్‌లో కనిపించాలని ఏ సెలబ్రెటీకి ఉండదు చెప్పండి. అందరికీ ఉంటుంది. మంచి కాస్ట్యూమ్‌ ధరించి ఫొటోలకు ఫోజులివ్వాలని అందరు కోరుకుంటారు. అయితే అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడు. లేటెస్ట్ ట్రెండ్స్‌ ఫాలో అవడంలో తనని మించిన వారే ఉండరు.


మార్కెట్‌లోకి ఏదైనా కొత్త బ్రాండ్ వచ్చిందంటే చాలు అది అతడి ఖాతాలోకి చేరిపోవాల్సిందే. బన్నీ ఎప్పుడూ కాస్ట్యూమ్ విషయంలో అస్సలు తగ్గడు. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అయితే అందులో ముఖ్యంగా తనకు స్పోర్ట్స్ వేర్‌ అంటే చాలా ఇష్టం. ఎప్పట్నుంచో అతడికి బైక్ అండ్ కార్ రేసర్లు ధరించే ట్రెండింగ్ డ్రెస్‌లను వేసుకునే అలవాటు ఉంది.

అందువల్లనే అతడు స్పోర్ట్స్ డ్రెస్‌లను కొనుక్కునేందుకు విదేశాలు వెళ్తుంటాడు. ముఖ్యంగా సింగపూర్‌లోని బ్రాండెడ్ షాపింగ్‌ మాల్స్‌లో తనకు ఇష్టమైన స్పోర్ట్స్ డ్రెస్‌లను తన డిజైనర్ కొనుగోలు చేస్తుంటాడని టాక్ ఉంది. అంతేకాదు.. బ్రాండెడ్ దుస్తులు ధరించి యాడ్స్ కూడా చేస్తుంటాడు బన్నీ. అయితే తాజాగా ఐకాన్ స్టార్ స్పోర్ట్స్ డ్రెస్‌లో ఫొటో షూట్ చేసి కనిపించి కనువిందు చేశాడు. దానికి కూడా ఓ కారణముందండోయ్..


Also Read: Pushpa 2 Teaser: జాతర గెటప్.. జాతర సీన్లు.. జాతర యాక్షన్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న టీజర్

బీబీసీ తన టాప్ గేర్ మ్యాగజైన్ కవర్ పేజ్‌గా అల్లు అర్జున్‌కి ప్రత్యేక స్థానం కల్పించింది. ఇందులో భాంగంగానే బన్నీ బీబీసీ టాప్ గేర్ ఇండియా ఫొటో షూట్‌లో పాల్గొన్నాడు. దీని కోసం బన్నీ అదిరిపోయే కార్ రేసర్ కాస్ట్యూమ్‌ని ధరించి సూపర్ లుక్‌లో ఉన్నాడు. ఈ కాస్ట్యూమ్‌తో లగ్జరీ బ్రాండ్ ఆడి లేటెస్ట్ ఎలక్ట్రిక్ కార్‌తో ఫొటోషూట్‌లో పాల్గొన్నాడు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా బీబీసీ టాప్ గేర్ ఇండియా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బన్నీ కవర్ ఫొటోతో స్పెషల్ ఇష్యూని పబ్లిష్ చేసింది. దీనిపై ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. బన్నీ అన్న ఎక్కడా తగ్గేదే లే అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.

Also Read: Allu Arjun Birthday: పుష్ప ఇంటిని చుట్టు ముట్టేసిన ఫ్యాన్స్.. ఇదేం క్రేజ్‌ రా బాబు.. వీడియో వైరల్

ఇకపోతే బన్నీ ప్రస్తుతం పుష్ప2 మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రేపు అతడు బర్త్ డే కావడంతో ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ టీజర్ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×