AICC Meeting: హస్తం పార్టీ హైదరాబాద్ లో కీలక సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే చీఫ్ గెస్ట్‌గా అటెండ్ కాబోతున్నారు. సమావేశానికి గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలు తప్పని సరిగా హాజరుకావాలని పీసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇంచార్జ్ మంత్రి పొన్నం గాంధీభవన్‌లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి హడావుడి మొదలు పెట్టారు.. అసలు ఈ మీటింగ్ అజెండా ఏంటి?… కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు పార్టీ శ్రేణులు ఏమని మార్గనిర్దేశం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
గుజరాత్ కాంగ్రెస్ మీటింగ్‌లో పనిచేయని నేతలకు ఖర్గే వార్నింగ్
గుజరాత్‌లో ఇటీవల ఏఐసీసీ ఆధ్వర్యంలో పార్టీ పరంగా భారీ సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశవ్యాప్తంగా పార్టీ నేతలను ఉదేశించి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ కామెంట్స్ చేశారు. పని చేసిన వాళ్ళు మాత్రమే పార్టీలో ఉండాలని పని చేయని వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవాలని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇక పార్టీ బలోపేతంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ లు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని, అందుకే డీసీసీ కమిటీల పవర్స్ పెంచే ఆలోచనలో ఉన్నట్లు ఖర్గే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జులై 4న ఆయన హైదరాబాద్ రానున్నారు. పార్టీ పరంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఖార్గే చీఫ్ గెస్ట్ గా పాల్గొననున్నారు.
పీఏసీ కార్యవర్గ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం
జులై 4న ఉదయం గాంధీ భవన్లో పీఏసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేస్తారు. పీఏసీ సమావేశం అనంతరం మాట్లాడిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో ఖర్గే పాల్గొంటారని వెల్లడించారు. ఇక కార్యకర్తల ఓపెన్ మీటింగ్ జూన్ 4 సాయంత్రం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న ఖర్గే అందులో భాగంగానే హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సమావేశం కార్యకర్తల సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామ, మండల, జిల్లాస్థాయి నేతలు ఇలా 15 వేల మంది సమావేశానికి హాజరవుతున్నారని పీసీసీ వెల్లడించింది . రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రభుత్వాన్ని ఉదేశించి ఖర్గే ఏం మాట్లాడబోతున్నారనేది ఆ పార్టీలో ఆసక్తి రేపుతోంది.
హైదరాబాద్ ముఖ్య నేతలో సన్నాహక సమావేశం
మరో వైపు హైదరాబాద్ లో ఖర్గే మీటింగ్ కోసం ప్లాన్ చేస్తున్న హస్తం పార్టీ హైదరాబాద్ ముఖ్యనేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ఇన్చార్జ్ మంత్రి పొన్నం, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్‌యాదవ్, ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. జులై 4న ఎల్బీ స్టేడియంలో జరిగే పార్టీ కార్యక్రమం విజయవంతం చేయాలని హైదరాబాద్ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు.
Also Read: పాదయాత్ర సెంటిమెంట్.. జగన్ మళ్లీ సీఎం అవుతాడా?
ఇక స్థానిక పంచాయతీ ఎన్నికలు , జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక పంచాయితీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపధ్యంలో 4న ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ టూర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
Story By Apparao, Bigtv