Poonam Kaur: ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur).. 2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి(SV Krishna Reddy) దర్శకత్వంలో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత ‘ ఒక విచిత్రం’, ‘ నిక్కీ అండ్ నీరజ్’ వంటి చిత్రాలలో నటించింది. ఇక చివరిగా 2022లో ‘నాతిచరామి’ అనే తెలుగు సినిమాలో నటించి, ఇండస్ట్రీకి దూరమైంది. ఇండస్ట్రీలో ఉన్నప్పుడే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. అయితే కొంతమంది వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యాను అని చెప్పిన ఈమె.. ఆ తర్వాత కూడా నిత్యం వార్తల్లో నిలుస్తోందని చెప్పవచ్చు.
త్రివిక్రమ్ ను మళ్లీ టార్గెట్ చేసిన పూనమ్
ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram), స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లను టార్గెట్ చేస్తూ ఈమె చేసే పోస్ట్లు పలు అనుమానాలను కలిగిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో పోస్ట్ పంచుకుంది. ఏకంగా కాపీ డైరెక్టర్ అంటూ సంచలన కామెంట్లు చేసింది పూనమ్. తాజాగా తన ట్విట్టర్ హ్యాండిల్ లో..”ఒరిజినల్ కంటెంట్, బౌండెడ్ స్క్రిప్టు ఉన్న డైరెక్టర్ క్రిష్ (Director Krish) కి కూడా గుర్తింపు లభించలేదు. కానీ కాపీ రైట్స్ ఇష్యూస్ ఉన్న ఆ దర్శకుడికి మాత్రం అంత గుర్తింపు ఇస్తున్నారు”అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. అయితే ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దానిని డిలీట్ చేయడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ సినిమా వల్లేనా..
అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా నుండీ క్రిష్ జాగర్లమూడి తప్పుకోగా.. దర్శకత్వ బాధ్యతలను జ్యోతి కృష్ణ (Jyoti Krishna) తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలోనే సాగిందని వార్తలు నడుస్తున్నాయి. దీనికి తోడు టైటిల్ కార్డ్స్ లో కూడా స్పెషల్ థాంక్స్ మెన్షన్ చేస్తారని కూడా భావిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కాపీ డైరెక్టర్ అంటూ త్రివిక్రమ్ పై సంచలన కామెంట్లు చేసింది పూనమ్ కౌర్.
మా అసోసియేషన్ కూడా సహాయం చేయలేదంటున్న పూనమ్
ఇకపోతే పూనమ్.. త్రివిక్రమ్ ను టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో కూడా త్రివిక్రమ్ పై చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్ కి కూడా ఫిర్యాదు చేసింది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్లే త్రివిక్రమ్ పై ఆరోజు తాను చేసిన కంప్లైంట్ ను ఇగ్నోర్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా మా అసోసియేషన్ లో త్రివిక్రంపై కంప్లైంట్ చేస్తే అతడి పై యాక్షన్ తీసుకోలేదు సరి కదా.. కనీసం మాట వరసకు కూడా ప్రశ్నించలేదు. నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన వ్యక్తిని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఇలా మళ్లీ త్రివిక్రమ్ పై కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది.
also read:Deepika Padukone: దీపికకు హాలీవుడ్ లో అరుదైన గౌరవం.. ఆ అవార్డు కి ఎంపిక!
Krish a director with original content and authentic scripts doesn’t get as much recognition or success like that of a director with multiple copyright issues and pr stunts.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 2, 2025