BigTV English

7 Years for Mahanati : ‘మహానటి’కి ఏడేళ్ళు… అప్పట్లో ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో తెలుసా ?

7 Years for Mahanati : ‘మహానటి’కి ఏడేళ్ళు… అప్పట్లో ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో తెలుసా ?

7 Years for Mahanati : తెలుగు సినిమా చరిత్రలో మరిచిపోలేని సినిమాగా మిగిలింది ‘మహానటి’ మూవీ. టాలీవుడ్ లో మహానటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న సావిత్రి జీవితాన్ని ఇందులో చూడచక్కగా చిత్రీకరించారు దర్శకుడు నాగ్ అశ్విన్. నేటి తరానికి ఆయన అందించిన ఈ అద్భుతమైన గిఫ్ట్ కు ఏడేళ్ళు. అంటే ‘మహానటి’ మూవీ రిలీజ్ అయ్యి నేటికి ఏడేళ్ళు అవుతోందన్న మాట. మరి అప్పట్లో ఈ మూవీ కొల్లగొట్టిన కలెక్షన్స్ ఎన్ని? బ్రేక్ ఈవెన్ ఎంత? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ సందర్భంగా తెలుసుకుందాం పదండి.


‘మహానటి’కి ఏడేళ్ళు
ఏడేళ్ళ క్రితం వ‌చ్చిన సావిత్రి క్లాసిక్ బ‌యోపిక్ ‘మ‌హాన‌టి’. ఈ సినిమాతో కీర్తి సురేష్ దశ దిశ రెండూ తిరిగిపోయాయి. అప్పటిదాకా గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం అయిన ఈ అమ్మాయి సావిత్రి పాత్రకు ఎంత వరకు సరిపోతుంది అనే చర్చ అప్పట్లో గట్టిగానే నడిచింది. కానీ కీర్తి మాత్రం సావిత్రి పాత్రలో జీవించి, విమర్శకులు కూడా నోరు వెళ్లబెట్టేలా చేసింది. అంతేకాదు ఆమె నటనకు జాతీయ అవార్డు కూడా కీర్తిని వరించింది. 2018 మే 9న రిలీజ్ అయిన ఈ మూవీలో కీర్తి సురేష్ తో పాటు, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక అప్పట్లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ గా నిలిచింది.

‘మహానటి’ ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్స్
ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై 25 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీసు బరిలోకి దిగింది. సినిమా వరల్డ్‌ వైడ్ గా 46.10 కోట్లు షేర్ రాబట్టడంతో నిర్మాతలు 25 కోట్లకు పైగానే లాభాలను జేబులో వేసుకున్నారు.


నైజాం అండ్ ఆంధ్రా – రూ. 51.50 కోట్లు
తమిళనాడు – రూ. 6 కోట్లు
కర్ణాటక – రూ. 4.55 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 2 కోట్లు
ఓవర్సీస్ – రూ. 20.25 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా టోటల్ గ్రాస్ – రూ. 84.30 కోట్లు

అరుదైన రికార్డులు కూడా…
అప్పట్లో యూఎస్ఏలో ‘మహానటి’ 2018లో 6వ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. అక్కడ రంగస్థలం, భరత్ అనే నేను, అజ్ఞాతవాసి, భాగమతి, తొలిప్రేమ తర్వాత, ఈ మూవీ 2.56 మిలియన్ డాలర్ల గ్రాస్ సాధించింది. పైగా తెలుగు సినిమాల్లో ఫస్ట్ టైమ్ 1.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ క్రాస్ చేసిన మొట్టమొదటి వుమెన్ సెంట్రిక్ తెలుగు మూవీ కూడా ఇదే. దాటింది. 2018లో యూఎస్ లో 4వ అతిపెద్ద తెలుగు ప్రీమియర్‌గా నిలిచింది ఈ మూవీ.

Read Also : దేశభక్తిని పెంచే ది బెస్ట్ 10 మూవీస్ … ఈ ఓటీటీల్లోనే ఉన్నాయి.. ఓ లుక్కెయండి

ఇక ఇందులో మహానటి సావిత్రి జీవితాన్ని ఆమె బాల్యం నుండి స్టార్‌డమ్, ప్రేమ, విషాదం, చివరి రోజుల వరకూ చూపించారు. కీర్తి సురేష్ సావిత్రిగా, దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్‌గా, సమంత జర్నలిస్ట్ మధురవాణిగా, విజయ్ దేవరకొండ ఫోటోగ్రాఫర్ ఆంథోనీగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం, డానీ సాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీతో 1950-60ల నాటి కాలాన్ని ఈ సినిమాలో అద్భుతంగా రీక్రియేట్ చేయగలిగారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×