Illu Illalu Pillalu ToIlluday Episode August 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మద, ప్రేమలు ఇద్దరు తమ భర్తలు తెచ్చిన చీరలు కట్టుకుంటారు. కానీ శ్రీవల్లి ఎందుకు తను తెచ్చిన చీరను కట్టుకోలేదని చందు బాధపడుతూ ఉంటాడు. ఇక వ్రతంలో కూర్చునేందుకు అంత సిద్ధం చేస్తారు ముగ్గురు కోడళ్లు.. వరలక్ష్మి వ్రతం చేసే దంపతులు పీటల మీద కూర్చోవాలని పంతులు చెప్తాడు. ఆ మాట వినగానే శ్రీవల్లి ఇంటికి పెద్ద కోడలు కదండీ మావయ్య గారు నేను ఈ వ్రతంలో కూర్చుంటానండి అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భాగ్యం ప్లాన్ ప్రకారం.. శ్రీవల్లి వ్రతం నేను చేస్తాను అని అంటుంది. నేను మా ఆయన కూర్చుని ఈ పూజ చేస్తామండి అని అంటుంది శ్రీవల్లి. వేదవతి మాత్రం ముగ్గురు కొత్తగా పెళ్లయిన కోడళ్లే.. ఈ ముగ్గురి చేత వ్రతం చేద్దామని అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని వేదవతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ముగ్గురు కోడలు వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చు అని ఎవరు అన్నారు వీళ్ళు ముగ్గురు కొట్టుకు చచ్చేలా ఉన్నారే అని టెన్షన్ పడుతూ ఉంటుంది. రామరాజుని శ్రీవల్లి మాట్లాడినవకుండా చేస్తుంది..
నేను ఇంటి పెద్దకోడల్ని, వ్రతం నా చేతులపైనే జరిపిస్తానను..అని అడగమని చెప్తుంది. ముందుగా వేసిన పక్కా ప్లాన్ ప్రకారం శ్రీవల్లి రామరాజుని అడుగుతుంది. రామరాజు మాత్రం ఏం మాట్లాడలేక బుజ్జమ్మను చూస్తాడు. బుజ్జమ్మ అప్పటికే టెన్షన్ పడుతూ ఉంటుంది. అటు బుజ్జమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఈ కోడళ్లు ఏంటి పోట్ల గిత్త లాగా ముందుకు వస్తున్నారు శ్రీవల్లిని కొడతారా ఏంటి? కచ్చితంగా ఈ వ్రతం పెద్ద గొడవ లాగా సాగేలా ఉంది. ఏం జరుగుతుందో శ్రీరామచంద్ర అని వేదవతి భయపడుతూ ఉంటుంది. నర్మదా ప్లాన్ ప్రకారం చేయాలంటే కచ్చితంగా ఈ పూజను శ్రీవల్లినే చేయాలని అనుకుంటుంది.
అయితే శ్రీవల్లి అక్కని పూజ చేయమని చెప్పడానికి ముందుకు వస్తారు.. ఇంటికి పెద్ద కోడలు వి ఇంటి మంచిది కోరే దానివి నువ్వే ఈ పూజ చేయాలి అని నర్మదా అంటుంది.. మాట వినగానే మిగిలిన వాళ్ళు సంతోషిస్తే భాగ్యం మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ అవుతుంది.. పూజకి ఇంకేం కావాలి పంతులుగారు అని నర్మదా అడుగుతుంది. రామరాజు గారి రైస్ మిల్లు కదండి రైస్ ని తెచ్చి ఇక్కడ పెట్టారు.. మీరు ఆడవాళ్లు వెళ్లి నగలను తీసుకురండి అని అంటాడు.
లోపలికి వెళ్ళిన శ్రీవల్లి నగలతో అడ్డంగా దొరికిపోతాను. అందులో ప్రేమ నగలు కూడా ఉన్నాయి కదా అని టెన్షన్ పడుతూ రచ్చ రచ్చ చేస్తుంది.. భాగ్యము లోపలికి రాగానే అంత నీ వల్లే మోసాలు చేసిన పెళ్లి చేసావు ఇప్పుడు నీ వల్లే నాకు కాపురం కూలిపోయేలా ఉంది అని భాగ్యం పై అరుస్తుంది. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయానని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది.. ఆయన అంటే నాకు ప్రాణం.. అయితే ఆయన లేకపోతే నేను అసలు బతకలేను అని అంటుంది..
పూజకు టైం అవుతుందని తిరుపతిని వాళ్ళని పిలవమని అక్కడికి పంపిస్తాడు రామరాజు.. ఎప్పుడూ నాకు మొదటి నుంచి గండికోట రహస్యం లాగే కనిపిస్తున్నారు. అయిపోయింది మొత్తం అయిపోయింది నాకు కాపురం కూలిపోయింది అని వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే వల్లి తన నగలని ఒక ప్లేట్లో పెట్టుకుని ముసుగేసుకుని వస్తుంది. నర్మదా ప్రేమలకు ఇద్దరికీ డౌట్ వస్తుంది..
ఆ మూసుకుని తీసి అక్క ఏంటి నగలు తీసుకురమ్మంటే కలశం తీసుకొచ్చావ్ ఏంటి అని అటు వేదవతి కూడా అడుగుతుంది.. ఆ కలశం చూసి అందరూ తలా ఒక మాట అంటారు. అయితే భాగ్యం ఇంట్లో దొంగలు పడ్డారు కదా అందుకే అమ్మాయిగారు నగలు ఆ కలశంలో వేసిందని అంటుంది. ఆ మాట వినగానే అందరికీ అనుమానం వస్తుంది.. మాత్రం ఆ కలసానికేంది సొట్టబడింది అని అడుగుతుంది.. భాగ్యం శ్రీవల్లి ఫ్లాష్ ప్యాక్ ని గుర్తు చేసుకుంటారు. కలశంలో నగలు పెట్టేటప్పుడు దానికి సొట్టపడి ఉంటుంది.
దొంగలు అందులో చేయి పెట్టి నగలు ఎత్తుకుపోకుండా ఉండొచ్చు అని దానికి సొట్ట పెట్టాను అని భాగ్యం అంటుంది. అప్పుడే తిరుపతి ఆ చెంబు మొత్తాన్ని తీసుకెళ్లి పోతే ఏంటి పరిస్థితి అని భాగ్యాన్ని అడుగుతాడు.. వీడు తింగరోడు అనుకున్నాను వీడి కాసింత బుర్ర ఉంది అని భాగ్యం అనుకుంటుంది. ఇది చూడ్డానికి ఇందులో ఏది పనికిరాని చెంబులాగే ఉందని అక్కడే పడేసి వెళ్లిపోతాడు కదా అని భాగ్యం అంటుంది.. నర్మద మాత్రం వల్లి అక్క ఆ నగలను తీసి అక్కడ పెట్టు అని అంటుంది.
Also Read : మనసు మార్చుకున్న పార్వతి.. పుట్టింట్లో ప్రణతికి ఘోర అవమానం..
అదేంటి ఇందులో ఉంచుకోడా పూజ చెయ్యొచ్చు అని వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. నర్మదా, ప్రేమలు మాత్రం వల్లి పై అనుమానంతో వాటికి పూజ చేయాలి కదా అక్క అందుకే నగలను బయటికి తీయాలి అని అంటారు. వల్లి అందులో చేయి పెట్టి లోపలికి రావట్లేదు అని అంటుంది.. నర్మదా నేనున్నాను కదా నేను తీస్తాను అని అంటుంది.. అయితే అందులో నర్మద చెయ్యి పెట్టిన బయటికి రాకపోవడంతో ఇదేంటి నగలు ఒక్కటి కూడా బయటికి రావట్లేదు అని అడుగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో వల్లి వల్ల అమ్మ వాళ్ళ అసలు ఇంటిని కనిపెడతారు నర్మదా ప్రేమలు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..