Angammal OTT: తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు అటు తమిళ ఇండస్ట్రీలో కూడా ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో సినిమాలు డిఫరెంట్ స్టోరీలతో వచ్చేస్తున్నాయి. చిన్న స్టోరీ తో వచ్చిన సినిమాలే ఈ మధ్య బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. అలాంటి ఓ చిన్న స్టోరీ తో వచ్చిన సినిమానే అంగమ్మాల్.. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తమిళ ప్రముఖ డైరెక్టర్ కె.బాలచందర్ కోడలైన గీత కైలాసం ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. గ్రామీణ కథతో తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది నవంబర్ 21 థియేటర్లలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు ఓటీటీల్లోకి రాబోతుంది. మరి ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్? స్ట్రీమింగ్ ఎప్పుడో ఒకసారి చూసేద్దాం..
తమిళ ఫీల్ గుడ్ మూవీ అంగమ్మాల్ థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూడొచ్చు.. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్‌లో జనవరి 9 నుంచి ప్రసారం కానుంది.. అయితే ఈ సినిమా కేవలం తమిళం లో మాత్రమే రాబోతుందని తెలుస్తుంది. త్వరలోనే మిగిలిన భాషల్లో కూడా అందుబాటులో కి తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ డేట్ గురించి పూర్తి వివరాలను సన్ నెక్స్ట్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది..
Also Read :ఐబొమ్మ రవికి దిమ్మతిరిగే షాకిచ్చిన కోర్టు..జీవితాంతం జైల్లోనే..?
సినిమా టైటిల్ ను చూస్తే ఇదొక అమ్మాయి స్టోరీలాగా కనిపిస్తుంది. తన జీవితంలో జాకెట్ అనేది తెలియకుండా పెరిగిన ఒక అమ్మాయి కదా.. జీవితంలో ఎప్పుడూ అలాంటిది చూడనే లేదు. రవి కంటే ఏంటో కూడా తెలియని ఆమె బండచాకిరీ చేస్తూ కొడుకుల్ని పోషించింది తల్లి. భర్త పోయాక ఇద్దరు కొడుకుల్ని కడుపులో దాచుకుని సాకింది. పెద్దకొడుకు ఆమెతోనే ఉంటాడు. కానీ చిన్న కొడుకు మాత్రం పై చదువుల కోసం పట్నానికి వెళ్తాడు. అక్కడ వాతావరణం లో అతను చాలా మారిపోతాడు.. అంతేకాదు తన చదువుతో పాటు అలవాట్లు కూడా పూర్తిగా మార్చుకుంటాడు. అక్కడే ఉండే ఒక అమ్మాయి తో ప్రేమలో పడతాడు. వాళ్లది హై క్లాస్ కుటుంబం. ఆ అమ్మాయి కుటుంబంలో అబ్బాయి అందరికీ బాగా నచ్చుతాడు. దాంతో అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధం మాట్లాడాలని అనుకుంటారు. తన ఇంట్లో పెళ్లి సంబంధానికి వస్తే వాళ్ళ అమ్మ జాకెట్ వేసుకోవాలన్న విషయం తెలిస్తే బాగోదు అని తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పడంతో పాటుగా జాకెట్టు వేసుకోమని చెప్తాడు. మరి జీవితంలో ఎప్పుడూ రవిక చూడని ఆమె తన కొడుకు జీవితం కోసం మరి వేసుకుంటుందా..? లేదా తన పద్ధతిని మార్చుకోకుండా తన కొడుకుని బాధ పెడుతుందా? ఆ తర్వాత స్టొరీ ఏంటో తెలియాలంటే కచ్చితంగా సినిమాని చూడాల్సిందే..