BigTV English

MaheshBabu: లవ్ యూ నాన్న.. మహేశ్‌బాబు ఎమోషనల్‌ పోస్ట్‌

MaheshBabu: లవ్ యూ నాన్న.. మహేశ్‌బాబు ఎమోషనల్‌ పోస్ట్‌

MaheshBabu: మహేశ్ బాబు ఎమోషనల్ అయ్యారు. తండ్రి మరణంపై తొలిసారి స్పందించారు. కృష్ణను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు.


“మీ జీవితం గొప్పగా సాగింది. మీరు చివరి వరకూ భయంలేకుండా, డేరింగ్ అండ్ డాషింగ్ గా జీవించారు. మీరే నా స్ఫూర్తి, నా ధైర్యం.. నేను చూసినదంతా మీతోనే వెళ్లిపోయాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు నేను మరింత దృఢంగా ఉన్నానని అనిపిస్తోంది. ఇప్పుడు నాకెలాంటి భయం లేదు.. మీ ఆశీస్సులు, ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటాయి. మీరు అందించిన వారసత్వాన్ని కొనసాగిస్తా.. మీరు మరింత గర్వపడేలా నడుచుకుంటా. లవ్‌ యూ నాన్న..” అంటూ ట్వీట్‌ చేశారు మహేశ్ బాబు.

తండ్రితో మహేశ్ బాబు అనుబంధం అపురూపం. ఎంతో అన్యోన్య కుటుంబం. కృష్ణ వారసత్వంగానే సినీ రంగంలో ఎదిగారు మహేశ్ బాబు. తండ్రిలానే సూపర్ స్టార్ అయ్యారు. చిన్నప్పటి నుంచీ సినిమాలతో పాటు ప్రతీ విషయంలో వెన్నంటే ఉన్న తండ్రి.. ఇక సెలవంటూ వీడిపోవడాన్ని మహేశ్ బాబు తట్టుకోలేకపోతున్నారు. అయినా, ధైర్యంగా నిలుస్తున్నారు. తండ్రి లేకున్నా.. తండ్రితో ఉన్న స్మృతులను సుస్థిర పరుచుకుంటున్నారు. మహేశ్ బాబు ట్వీట్ లో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.


ఈ ఏడాదంతా మహేశ్ బాబు కుటుంబంలో విషాద ఘటనలే. సోదరుడు రమేశ్ బాబు, తల్లి ఇందిర, తండ్రి కృష్ణ.. ముగ్గురు ముఖ్యమైన కుటుంబ సభ్యులను కోల్పోయారు మహేశ్ బాబు. మానసికంగా బాధగా ఉన్నా.. మనిషిగా మరింత ధృడంగా మారుతున్నారు.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×