BigTV English
Advertisement

Nimmala Ramanaidu: నిమ్మల గ్రేట్ జాబ్.. చంద్రబాబు ప్రశంసలు

Nimmala Ramanaidu: నిమ్మల గ్రేట్ జాబ్.. చంద్రబాబు ప్రశంసలు

భారీ వర్షాలకు బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. బుడమేరుకు మూడు గండ్లు పడడంతో ఈ భారీ విపత్తు సంభవించింది. చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో నగర ప్రజలను వరదలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. తినేందుకు తిండి దొరక్క, తాగేందుకు నీళ్లు లేక నానా అవస్థలు పడ్డారు. అయితే వరదల సమయంలో బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఏపీ జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

వరదల కారణంగా బుడమేరుకు పడిన గండ్లు పూడ్చేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు దాదాపు 64గంటలపాటు నిద్ర లేకుండా పని చేశారు. బుడమేరు కట్టపైనే అధికారులు, సిబ్బందితో మకాం వేసి నిద్రాహారాలు మాని పని చేశారు. గండ్లు పూడ్చడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన పనులు చేయించారు. సీఎం సహాయంతో రంగంలోకి దిగిన ఆర్మీ సిబ్బందికి సైతం సలహాలు, సూచనలు ఇస్తూ పనులు ముమ్మరం చేయించారు. అనుకున్న సమయం కంటే ముందుగానే పనులు పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు.


పూడ్చివేత పనులు పరిశీలించేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ సైతం ఆయన పడుతున్న కష్టాన్ని చూసి మెచ్చుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం మీరు చూపిస్తున్న నిబద్ధత అభినందనీయమని మంత్రిని కొనియాడారు. ఓ అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం, గాలి వస్తున్నా గొడుకు పట్టుకుని మరీ వర్షంలోనే నిమ్మల పని చేయించారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. మంత్రి అంటే ఇలానే ఉండాలంటూ పలువురు నెటిజన్లు సైతం నిమ్మలను అభినందిస్తున్నారు.

Also Read: అర‌రే.. ఒక్క పోస్ట్ తో జగన్ ఇలా బుక్కయ్యాడేంటి?

బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. ఈ సందర్భంగా పనులు జరిగిన తీరును ఆయనకు వివరించారు. మూడు గండ్లు పూర్తి వేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. దీంతో గుడ్ జాబ్ రామానాయుడు అంటూ ముఖ్యమంత్రి ఆయణ్ని అభినందించారు. అధికారులు మంత్రుల సమావేశంలో నిమ్మలను కొనియాడారు. 64గంటలు నిద్రపోకుండా పనులు చేయించడంపై హర్షం వ్యక్తం చేశారు.

బుడమేరు గండ్లు పూడిక పనుల్లో పాల్గొన్న ఇరిగేషన్ అధికారులకు సైతం సీఎం అభినందించారు. అలాగే ప్రస్తుతం బుడమేరు వద్ద పరిస్థితి ఎలా ఉందని, గట్టు ఎత్తు ఎంత పెంచారని మంత్రిని సీఎం అడిగి తెలుసుకున్నారు. గట్టు ఎత్తు పూర్తిస్థాయిలో పెంచి, మరోసారి తెగిపోకుండా బలోపేతం చేయాలని అధికారులు, మంత్రికి చంద్రబాబు సూచించారు. మరో రెండ్రోజులపాటు మరింత వరద వచ్చే అవకాశం ఉందని అలెర్ట్‌గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

సీఎం సూచనలతో నిమ్మల రామానాయుడు వెండనే బుడమేరు గట్టుపై ప్రత్యక్షమయ్యారు . బుడమేరు గండ్లు పూడ్చిన గట్టులను ఎత్తుపెంచే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. మరో రెండు రోజులపాటు భారీ వర్ష సూచనలున్న నేపథ్యంలో గండ్లు పూడ్చిన దగ్గర, గట్టు ఎత్తు పెంచాలని సీఎం సూచించడంతో గట్టు ఎత్తు పెంచే పనులను మంత్రి దగ్గరుండి జరిపిస్తున్నారు. .. అయితే, బుడమేరు పనులకు వర్షం అడ్డంకి గా మారింది. పులివాగు నుండి బుడమేరుకు వరద ప్రవాహం ఉధృతి పెరిగింది. అంత ఉధృతిలోనూ గండ్లను మరింత బలోపేతం చేయడానికి, బుడమేరు లోతు తెలుసుకోవడానికి నిమ్మల సిబ్బందితో కలిసి పడవలో వెళ్లి ప్రయత్నించడం గమనార్హం.

Related News

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ మైలేజ్ తగ్గిందా? ప్రచారంపై అధిష్టానం నిఘా

Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?

JC Brothers: జేసీ బ్రదర్స్.. టార్గెట్ పోలీస్!

DCC Presidentship: మేడిపల్లికి.. డీసీసీ పగ్గాలు

Malepati Subbanayudu: కావలి టీడీపీలో రగిలిన వర్గపోరు..

Jubilee Hills Bypoll:జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారాల్లో కనిపించని ఆ ఇద్దరు కీలక నేతలు..?

Big Stories

×