వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది.. సంబంధం ఉన్నా లేకపోయినా ప్రతి ఇష్యూలో వేలు పెట్టడం అతనికి అలవాటుగా మారిపోయింది.. ఎవరి అండదండలు చూసుకుని కౌశిక్ రెడ్డి అంతా దూకుడుగా వెళ్లుతున్నారన్న చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతుంది… మొదటి సారి ఎమ్మెల్యే అయిన కౌశిక్ తన ఇమేజ్ పెంచుకోవడానికి అలా వ్యవహారిస్తున్నాడా..? ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వీడి…బీఆర్ఎస్‌లోకి వచ్చిన కౌశిక్ రెడ్డి….పార్టీలో తన ఉనికిని చాటుకోవడాకే ఇలా చేస్తున్నారా..? పార్టీ పెద్దలకు తెలిసే ఇదంతా జరుగుతుందా?
హుజురాబాద్ నుంచి శాసనసభకు మొదటి సారి ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచేందుకు సెంటిమెంటునే నమ్ముకోవాల్సి వచ్చింది. సెంటిమెంట్ అంటే ఇంకేదో అనుకునేరు.. అంత సీన్ లేదు లేండి.. గెలిస్తే మంత్రి అవుతానన్న ఆశతో.. గెలిపించకపోతే చావే శరణ్యమని ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి ఎలాగోలా గట్టెక్కారాయన. అలాంటి సెంటిమెంట్ డైలాగులు పండించి త్రిముఖపోటీలో విజయం సాధించారు. అయితే అతను గెలిచాడు కాని బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడంతో ఆయన అమాత్యపదవి పదవి ఆశలు ఆవిరయ్యాయి.
ఈటల రాజేందర్ గులాబీ పార్టీలో ఉన్నప్పుడు ఆయనపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కౌశిక్‌రెడ్డి గత ఎన్నికల్లో టికెట్ కోసం గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయన నోటి దూకుడు పుణ్యాన ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌లోకి వద్దామన్నా డోర్లు తెరుచుకునే పరిస్థితి లేకండా పోయింది .. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన కౌశిక్ రెడ్డి తన ఉనికి చాటుకోవడానికి ప్రదర్శిస్తున్న దూకుడు… చేస్తున్న ఓవర్ యాక్షన్ ఎప్పటికప్పుడు ఆయన ఇమేజ్‌ను మరింత డ్యామేజ్ చేస్తున్నాయంటునారు .. ఆ దుందుడుకు వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సమస్యగా మారిందని గులాబీ శ్రేణులే అంటున్నాయి.
చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలకు వెళ్లడం.. తనకు సంబంధం లేని అంశాల్లో వేలు పెట్టి సవాళ్లు విసరడం … మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం లాంటి వాటితో కౌశిక్‌రెడ్డి తాను ఎమ్మెల్యేనన్న విషయం మర్చిపోతున్నారని బీఆర్ఎస్ నేతలు సైతం అసంతృప్తిగా ఉన్నారట.. సొంత పార్టీ నేతల్లో తనపై నెగిటివ్ పెరుగుతున్నా ..కౌశిక్ రెడ్డి మాత్రం నేనింతే అన్నట్లు .. తాను ఎమ్మెల్యే అనే విషయాన్ని మర్చిపోయి వ్యవహారిస్తూ పార్టీకి ఉన్న కాస్త పరువుని తీసేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే వ్యవహరించాల్సినట్లు ఆయన ప్రవర్తన ఉండట్లేదని సొంత నియోజకవర్గ ప్రజలే అభిప్రాయపడుతున్నారు.
తాజాగా కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌పై కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు తీవ్ర దుమారంగా మారింది… జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరైన ఆ సమావేశంలో బజారు రౌడీలా వ్యవహరించిన కౌశిక్‌రెడ్డిని పోలీసులు కలెక్టరేట్ నుంచి బయటకు లాక్కెల్లాల్సి వచ్చింది … జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్‌రెడ్డిపై మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
కౌశిక్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక వివాదం రేగుతోందనే టాక్ బీఆర్ఎస్ వర్గాల్లోనే వినిస్తుంది. అది పోలీస్ స్టేషన్ కావచ్చు, జిల్లా సమీక్ష సమావేశం మందిరం కావచ్చు, ప్రెస్ మీట్ కావచ్చు, అసెంబ్లీలో …ఇలా ప్లెస్ ఏదైనా ఆయన వీధి గూండాలా వ్యవహరిస్తున్న తీరు బీఆర్ఎస్ నేతల్లో హాట్ టాపిక్ మారింది .. తనకంటే సీనియర్ నేతలు …. రెండు, మూడుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై కౌశిక్ రెడ్డి వాడుతున్న బాష, పదజాలానికి సంబంధించి కూడా కారు పార్టీ నేతలు సైతం పెదవి విరుస్తున్నారట.. కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని బీఆర్ఎస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.. అతనికే చెప్దామంటే ఎలా రియాక్ట్ అవుతాడో అని సైలెంట్ అవుతున్నారంట.
కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని … అందుకే గులాబీ పెద్దలు కూడా కౌశిక్ రెడ్డిపై ఏమీ మాట్లాడలేక పోతున్నారని బీఆర్ఎస్ నేతలు గొణుక్కుంటున్నారు.. కేసీఆర్ అయినా జోక్యం చేసుకుని కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారట .. ఆయన వల్ల పార్టీకి లేనిపోని సమస్యలు ఎదురవుతున్నాయని.. భవిష్యత్తులో ఆయన వల్ల పార్టీకి మరింత చెడ్డపేరు రావడం ఖాయమని వాపోతున్నారు.. మొండోడు రాజు కంటే బలవంతుడంటారు… మరి మొండి తనానికి పరాకాష్ట లాంటి కౌశిక్ రెడ్డి గులాబీ బాస్ చెప్తే అయినా తన స్టైల్ మార్చుకుంటారో లేదో చూడాలి.
Also Read: కారు ఎంతపనిచేసింది.. అప్పటినుంచే KCRకు బ్యాడ్ టైమ్.. కారు రేసులోనే ఇరుక్కున్న KTR