BigTV English

Thandel Movie : రాజు కోసం బుజ్జమ్మ పోరాటం… ఓల్డ్ మూవీ స్టోరీనే దింపేస్తున్నారా..?

Thandel Movie : రాజు కోసం బుజ్జమ్మ పోరాటం… ఓల్డ్ మూవీ స్టోరీనే దింపేస్తున్నారా..?

Thandel Movie : తండేల్ మూవీ… నాగ చైతన్య కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో వస్తున్న మూవీ. అలాగే గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ కూడా భారీ బడ్జెట్ వైపు తొంగి చూడదు. ఇప్పటి వరకు ఈ బ్యానర్ హైయెస్ట్ బడ్జెట్ అంటే… 100 కోట్లు మాత్రమే. అది కూడా అల్లు అర్జున్ అలా వైకుంఠపూరములో.. మూవీకి ఖర్చు చేశారు. దీని తర్వాత అంటే… తండేల్ మూవీకే ఎక్కవ బడ్జెట్. అలాంటి మూవీకి ఓ ఓల్డ్ స్టోరీ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓల్డ్ స్టోరీని నమ్ముకుని ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నారా.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇండస్ట్రీలో వస్తున్న టాక్ ప్రకారం… తండేల్ స్టోరీ ఏంటో ఇప్పుడ చూద్ధాం..


అక్కినేని వంశం నుంచి వచ్చాడు అనే ఓ పెద్ద పేరు తప్పా… నాగ చైతన్యకు పెద్ద హిట్స్ లేవు. పెద్ద సినిమాలూ చేయలేదు. దీన్ని ఫుల్ ఫిల్ చేయడానికే వస్తుంది తండేల్ మూవీ అని అనుకుంటున్నారు అక్కినేని అభిమానులు.

భారీ బడ్జెట్‌తో వచ్చే కల్ట్ లవ్ స్టోరీ తండేల్ మూవీ అని ఇప్పటికే మంచి హైప్ ఇచ్చారు. తండేల్ రాజు – బుజ్జమ్మ ప్రేమ కథకు ఫిదా అవ్వాల్సిందే అని మూవీ యూనిట్ కూడా చెప్పుకొస్తుంది. లవ్ స్టోరీ డెప్త్‌గా ఉన్నా… కథ మాత్రం చాలా పాతదే అని టాక్ వస్తుంది ఇండస్ట్రీలో.


ఇండస్ట్రీలో వినిపిస్తున్న దాని ప్రకారం…
ఈ మూవీ ఇప్పటి వరకు కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా ఉన్న రోజా మూవీ కథను పోలి ఉంటుందని తెలుస్తుంది.
రోజా సినిమాలో రిషిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. దీంతో తన ప్రేమను కాపాడటానికి రోజా చేసే ప్రయత్నాలు ఆడియన్స్‌కు కన్నీళ్లు పెట్టిస్తాయి.

ఇప్పుడు తండేల్ మూవీ కూడా అదే తరహాలో ఉంటుందట. తీర ప్రాంతంలో చేపలు పడూతూ… బుజ్జమ్మే జీవితం అంటూ బతికే తండేల్ రాజును.. సముద్రంలో తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తారట. రాజు ప్రాణాలతో రావాలని సాయి పల్లవి ఒంటరిగా పోరాటం చేస్తుందట. ఈ క్రమంలో సాయి పల్లవి ప్రయాణం… హార్ట్ టచింగ్‌లా, కన్నీళ్లు తెప్పించేలా ఉంటుందని తెలుస్తుంది.

దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఇదే కథ అయితే మాత్రం.. సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రీచ్ అవ్వకపోవచ్చు అని అంటున్నారు.
ఈ మధ్య డైరెక్టర్లు కథలో, కథనంలో కొత్తదనం తీసుకొచ్చి చిన్న సినిమాలతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు. అలాంటిది… గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్, అక్కినేని లాంటి పెద్ద పేరున్న కుటుంబం నుంచి వచ్చిన నాగ చైతన్య ఇప్పుడు ఓ కాపీ స్టోరీ చేయడమేంటి అని, దానికి నాగ చైతన్య, గీతా ఆర్ట్స్ ఎలా ఒప్పుకున్నారు అనేది ఇప్పుడు క్వశ్చన్‌గా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×