BigTV English

TRS to BRS: కారు ఎంతపనిచేసింది.. అప్పటినుంచే KCRకు బ్యాడ్ టైమ్.. కారు రేసులోనే ఇరుక్కున్న KTR

TRS to BRS: కారు ఎంతపనిచేసింది.. అప్పటినుంచే KCRకు బ్యాడ్ టైమ్.. కారు రేసులోనే ఇరుక్కున్న KTR

TRS to BRS: కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి పార్టీ పేరును కూడా మార్చేసి హడావుడి చేశారు.. తీరా చూస్తే మాజీ ముఖ్యమంత్రిగా ఫాంహౌస్‌కే పరిమితమై పోయారు. నేషనల్ పాలిటిక్స్ అంటూ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేసిన ఆయన పార్టీకి లోక్‌సభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.. ఇక మధ్యతో గారాల కూతురు కవిత అరెస్టు ఆయన్ని మరింత కుంగతీసింది.. ఇక ఇప్పుడు కొడుకు కేటీఆర్ వంతు వచ్చింది.. కారు రేసు కేసులో సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలిందాయనకి… బాలు హైకోర్టుకే చేరడంతో కేటీఆర్ ఊచలు లెక్కపెట్టడమే మిగిలి ఉందంటున్నారు.. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఆయన్ని ఈడీ విచారణకు పిలవడం గలాబీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.


ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పార్టీ పేరులో నుంచి తెలంగాణను తీసేసి జాతీయ రాజకీయాలంటూ బీఆర్ఎస్‌ను ప్రకటించిన కేసీఆర్‌కు అప్పటి నుంచి ఏదీ కలిసి రావడం లేదు.. వరస ఓటములతో కాన్ఫిడెన్స్ ‌లెవల్స్ పూర్తిగా దెబ్బ తినడంతో గులాబీ బాస్ ఫాంహౌస్ వదిలి బయటకు రావడమే మానేశారు.. ఈ పరాభవాల భారం చాలదన్నట్లు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల మధ్యలో కల్వకుంట్ల ఇంటి ఆడపడుచు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుని ఆయన్ని మరింత కుంగతీసారంటున్నారు.

లిక్కర్ కేసులో కవితకు బెయిల్ వచ్చిందన్న మురిపెం కేసీఆర్‌కు తీరక ముందే ఆయన కొడుకు కేటీఆర్ కారు రేసులో ఇరుక్కున్నారు … ఫార్ములా ఈ రేస్‌తో హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్ ఏమాత్రం పెంచారో కాని .. ఆ రేసుకు సంబంధించి జరిగిన అవినీతి కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే మొదట్లో ఆ కేసు, తన అరెస్టుకు సంబంధించి కేటీఆర్ ధీమాగానే స్టేట్‌మెంట్లు ఇచ్చారు.. తాను ఏ కేసులకు భయపడేది లేదని.. అవసరమైతే అరెస్ట్‌ చేసుకున్నా పర్లేదని గతంలోనే ప్రకటించారు. ప్రతి విషయంలో అనుమతి ఇచ్చింది.. సంతకం చేసింది తానే అని స్పష్టం చేశారు. ఈ-రేసింగ్ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా తానే ఉన్నానని, FEOకు డబ్బులు చెల్లించడం వాస్తవమే అన్నారు. అది హైదరాబాద్ పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు తీసుకున్న నిర్ణయమని ఘనంగా ప్రకటించుకున్నారు


ఫార్ములా ఈ రేస్ వ్యవహారం అంతా తన ఆదేశాల ప్రకారమే జరిగిందని…ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవని మొదట్లో మాజీమంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు . తాను చెప్పినట్లే అధికారులు చేశారని..అధికారులకు దీంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. కానీ.. ఆ మాటలు చెప్పిన కొన్ని రోజుల్లోనే ఆయన ప్లేట్ ఫిరాయించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏదైనా నిబంధనల ఉల్లంఘన ఉంటే అది అధికారులు చూసుకోవాలి కానీ…మంత్రిగా ఉన్న తనకు ఏమి సంబంధం అంటూ కోర్టులో దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్‌లో పేర్కొన్నారట. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అసలు తనకు ఎలాంటి అధికారాలు ఉండవని.. అలాంటప్పుడు ఈ విషయంలో తన పాత్ర ఏమి ఉంటుందని పేర్కొన్నారట..

ఆ క్రమంలో తనపై పెట్టిన కేసు కొట్టివేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు.. అయితే ఆయనకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో క్వాష్ పిటిషన్‌ను కేటీఆర్ వెనక్కి తీసుకున్నారు. కార్ రేసు కేసులో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తూ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను వేశారు. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంలో కేటీఆర్‌కు నిరాశే ఎదురైంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది.

విచారణలో భాగంగా కేటీఆర్ తరపున న్యాయవాది సిదార్థ వాదనలు వినిపించారు. ఈ ఫార్ములా కారు రేసు కేసులో హెచ్‌ఎండీఏను, ఇతరులను పేర్కొనలేదని కేవలం ఇద్దరు అధికారులను, కేటీఆర్‌ను మాత్రమే నిందితులుగా చేర్చారని కోర్టు ముందు ప్రస్తావించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు కేసు అని.. కేటీఆర్ ఒక్క రూపాయి తీసుకున్నారని ఎవరూ చెప్పడం లేదని న్యాయవాది తెలిపారు. ఇలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందని వాదించారు. అయితేహైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేయడంతో.. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కాస్త ఊరట లభిస్తుందని భావించిన కేటీఆర్‌కు ఎదురుదెబ్బే తగిలింది. సుప్రీం నిర్ణయంతో ఈ కేసులో ఏసీబీకి మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది.

అయితే కేటీఆర్‌ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంలో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. విచారణ సందర్భంగా ముందు తమ వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం కేవియట్‌ పిటిషన్‌ను ముందస్తుగానే దాఖలు చేసింది. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్ నిరాకరణకు గురైనప్పటికీ.. సుప్రీం స్టే విధిస్తుందని కేటీఆర్‌ భావించినట్లు తెలుస్తోంది. కానీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో తాము జోక్యం చేసుకునేది లేదని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పడంతో ఏసీబీ మరోసారి నోటీసులు ఇస్తే ఆ విచారణకు కేటీఆర్ ఖచ్చితంగా హాజరుకావాల్సి ఉంటుంది.

Also Read: Saif Ali Khan: BREAKING: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి..

గతంలో ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌ను దాదాపు ఎనిమిది గంటల పాటు ఏసీబీ విచారించింది. ఆ క్రమంలో సుప్రీం కోర్టులో కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ డిస్మిస్ అయిన నేపథ్యంలో.. మాజీ మంత్రి అరెస్ట్‌ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌తో పాటు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్‌ను ఈడీ, ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. వీరి నుంచి పలు కీలక సమాచారాన్ని ఏసీబీ, ఈడీ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది. వారు మంత్రి ఆదేశాల మేరకే తాము నడుచుకున్నట్లు స్టేట్‌మెంట్లు ఇచ్చారంట. మొత్తానికి పార్టీ పేరులో తెలంగాణ తీసేసిన కల్వకుంట్ల ఫ్యామిలీకి కారు కూడా కలిసి రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×