BigTV English

Allu Arjun – Pushpa 2: ‘పుష్ప 2’ రెండో పాట రెడీ.. మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ వైరల్

Allu Arjun – Pushpa 2: ‘పుష్ప 2’ రెండో పాట రెడీ.. మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ వైరల్

Pushpa 2 Second Single: ఒక్క సినిమాతో ప్రపంచ సినీ ప్రియుల్ని సైతం తన వైపుకు తిప్పుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ‘పుష్ప’ మూవీతో తన క్రేజ్ దేశం నుంచి ప్రపంచానికి చేరింది. ఎలాంటి పాన్ ఇండియాగా తెరకెక్కకపోయినా.. సినిమా రెస్పాన్స్‌తో వరల్డ్ వైడ్‌గా సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది. ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ మూవీలో బన్నీ స్టైల్, స్వాగ్, మాస్ అవతార్‌కి యావత్ సినీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు.


దర్శకుడు సుకుమార్ తన క్రియేటివిటీతో బన్నీని ఓ రేంజ్‌లో చూపించి అదరగొట్టేశాడు. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌ను కూడా ప్రకటించేశారు. ప్రస్తుతం ఈ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘పుష్ప 2’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా మేకర్స్ కూడా ఈ మూవీకి సంబంధించి అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ సినీ ప్రియుల్ని సర్‌ప్రైజ్ చేస్తున్నారు.

ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి ‘జాతర’ యాక్షన్ సీన్లను రిలీజ్ చేశారు. అందులో బన్నీ.. మాస్ యాక్షన్ లుక్‌లో కనిపించి అదరగొట్టేశాడు. ఆ గ్లింప్స్ యమ స్పీడ్‌లో రెస్పాన్స్ అందుకుంది. ఇక ఆ తర్వాత మరో అప్డేట్‌తో వచ్చి అట్రాక్ట్ చేశారు మేకర్స్. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ సినీ ప్రియుల్ని బాగా ఆకట్టుకుంది.


Also Read: పుష్ప 2 నుంచి అతను అవుట్.. గుంటూరు కారంలా అవ్వదుగా?

అంతేకాకుండా అందులో బన్నీ వేసే క్లాసిక్ స్టెప్పులు కూడా ఓ రేంజ్‌లో ట్రెండ్ అయ్యాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఆ స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు మేకర్స్ మరో అప్డేట్ అందించారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగానే ఈ మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు తమ ట్విట్టర్ ఖాతాలో అదిరిపోయే ట్వీట్ పెట్టారు.

‘‘రేపు ఉదయం 11.07’’ గంటలకు అప్డేట్ ఇవ్వబోతున్నామని తెలిపారు. అయితే ఈ ట్వీట్ నిన్న (మంగళవారం మే 21) పెట్టారు. అంతేకాకుండా అందులో ఓ సింబల్‌తో క్లారిటీ ఇచ్చేశారు. రెండు వేళ్లతో పక్కనే మ్యూజిక్ సింబల్‌ను పెట్టారు. దీంతో అందరికీ అర్థమైపోయింది. అది రెండో పాట అప్డేట్ అని. దీంతో ఈ రోజు 11.07 గంటలకు ఆ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఆ అప్డేట్ ఏంటా అని.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×