Big Stories

Brij Bhushan: ఎన్నికల వేళ బ్రిజ్‌ భూషణ్‌‌కు భారీ షాక్ !

Court Frames Charges Against Brij Bhushan: మహిళా రెజ్లర్ల లైంగిక ఆరోపణల కేసులో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ఢిల్లీ కోర్టు అభియోగాలు మోపింది. అయితే తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషినని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని బ్రిజ్ భూషణ్ వెల్లడించారు.

- Advertisement -

బ్రిజ్ భూషణ్ నేరాన్ని అంగీకరించారా ? అని కోర్టు అడుగగా ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు నేరాన్ని అంగీకరించాలని అతడి తరపు న్యాయవాది వెల్లడించారు. తనపై ఉన్న అభియోగాలపై బ్రిజ్ భూషణ్ స్పందించారు. తాను విదేశాల్లో క్రీడాకారిణులతో ఒకే హోటల్లో బస చేయలేదని చెప్పారు. కోర్టులో వాదనల అనంతరం బ్రిజ్ భూషణ్ మీడియాతో మాట్లాడారు. తాను నిర్దోషినని నిరూపించుకునేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తనపై నమోదైన అభియోగాలను నిరూపించాల్సి ఉందన్నారు.

- Advertisement -

రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా సాక్షి మాలిక్, వినేష్ ఫొగాట్ , బజరంగ్ పునియా తదితర రెజ్లర్లు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలోనే డబ్లూఎఫ్ఐ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించారు. ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. యూపీలోని కైసర్ గంజ్ నుంచి బ్రిజ్ భూషణ్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు.

Also Read:  ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు మరోసారి షాక్

అయితే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతడికి టికెట్ ఇవ్వలేదు. అదే సమయంలో అతడి కుమారుడిని బరిలో దింపారు. భారీ ఎత్తున విద్యా సంస్థలు నిర్వహిస్తున్న బ్రిజ్ భూషణ్ కు విద్యార్థుల్లో మంచి ఫాపులారిటీ ఉంది. అందుకే బీజేపీ ప్రభుత్వం ఇతడి విషయంలో తక్షణ నిర్ణయం తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News