Big Stories

Stone Pelting clash: ఏపీలో మాదిరిగా ఆ రాష్ట్రంలో కూడా చెలరేగిన హింసాత్మక ఘటనలు.. జెర్రైతే సినీ నటుడికి..

Stone Pelting clash in West Bengal: ఏపీలో ఎన్నికల రోజు, ఆ తరువాత హింసాత్మక సంఘటనలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే, ఏపీలో మాదిరిగా మరో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. రోడ్ షోలో రాళ్ల వర్షం కురిపించారు. దీంతో సినీ నటుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్రంలో ఇరు పార్టీల నేతల మధ్య రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.

- Advertisement -

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. పార్లమెంటు ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మిడ్నాపూర్ పట్టణంలో బీజేపీ రోడ్ షో నిర్వహించింది. ఈ రోడ్ షో పై కొందరు వ్యక్తులు రాళ్లు, నీళ్ల బాటిళ్లు విసిరారు. మిడ్నాపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ తరఫున్ ఈ రోడ్ షోను నిర్వహించారు. ఈ క్రమంలో ఘర్షణ చెలరేగింది.

- Advertisement -

మిడ్నాపూర్ కలెక్టరేట్ వద్ద రోడ్ షోను మొదలుపెట్టారు. అక్కడి నుంచి కేరనిటోల వైపు వెళ్తున్న క్రమంలో వందల మంది బీజేపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఎంపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్, ఆయనకు మద్దతుగా ఆ రోడ్ షోలో పాల్గొన్న సినీ నటుడు మిథున్ చక్రవర్తి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు రాళ్లు, బాటిళ్లు విసిరారు. ఇది గమనించిన బీజేపీ కార్యకర్తలు వారిని ప్రతిఘటించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘర్షణ విషయమై బీజేపీ, టీఎంసీ నేతల మధ్య రాజకీయ మాటల యుద్ధమే కొనసాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడి చేశారంటూ ఎంపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ ఆరోపించారు. బీజేపీకి ప్రజల నుంచి భారీ స్పందన వస్తున్నదన్న అక్కసుతోనే టీఎంసీ నేతలు ఇలా దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. రోడ్ షోలో పాల్గొన్న మిథున్ చక్రవర్తి వంటి దిగ్గజ నటుడిని అగౌరవపరిచే స్థాయికి వారు దిగజారిపోతున్నారని ఆయన ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందినవారే హింసకు ప్రేరపిస్తున్నారని అన్నారు.

Also Read: ‘ఈయనకొక్కనికి బెయిలిస్తే.. అందరు అడుగుతారు’

అయితే, బీజేపీ ఎంపీ అభ్యర్థి చేసిన ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి త్రినాంకూర్ భట్టాచార్య స్పందిస్తూ అగ్నిమిత్ర ఆరోపణలను కొట్టిపారేశాడు. అలాంటి వికృత చేష్టలను తాము నమ్మబోమన్నారు. రోడ్ షో ఫ్లాప్ అవ్వడంతోనే బీజేపీ నేతలు ఇట్లాంటి కొత్త డ్రామాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News