BigTV English

Congress: మైనంపల్లికి సిద్దిపేట తలనొప్పి

Congress: మైనంపల్లికి సిద్దిపేట తలనొప్పి

Congress: నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గ పోరు తారాస్థాయికి చేరిందట. పట్టుమని పదిమంది లేని పార్టీలో పదేసి గ్రూపులా అంటూ సొంత పార్టీ కార్యకర్తలే ఎద్దేవా చేస్తున్న పరిస్థితి నెలకొందక్కడ.. రాష్ట్రంలోనే కాంగ్రెస్‌కు అత్యంత బలమైన ప్రత్యర్థి ఉన్న అక్కడ అధికార పార్టీ గ్రూప్‌వార్ పార్టీ పెద్దలకే అంతుపట్టకుండా తయారైందంట. అక్కడ కాంగ్రెస శ్రేణులు రోడ్డున పడి కొట్టుకునే పరిస్థితులు నెలకొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. జిల్లా మంత్రి, ఇన్చార్జి మంత్రులు కూడా అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దలేక చేతులెత్తేస్తున్నారంట.. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? అక్కడి కాంగ్రెస్‌లో ఆ పరిస్థితి ఎందుకు దాపురించింది?


సిద్దిపేటలో బజారున పడుతున్న కాంగ్రెస్ నేతలు

సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గ పోరు తారస్థాయికి చేరింది. పదిమంది లేని పార్టీలో పదేసి గ్రూపులుగా విడిపోయి కాంగ్రెస్ నేతలు బజారున పడుతున్నారు. ఇన్ని గ్రూప్‌ల మధ్య కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు లాంటి బలమైన ప్రత్యర్థి ఉన్న అక్కడ విపక్షంపై ఐక్యంగా పోరాడాల్సింది పోయి సొంత పార్టీ నేతలే తరచూ కీచులాటలతో బజారున పడుతుండటం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ, పీసీసీ సభ్యులు దరిపల్లి చంద్రం, గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ, తాడురి శ్రీనివాస్, జి.శ్రీనివాస్, బొమ్మల యాదగిరి ఇలా ఎవరికి వారు నియోజకవర్గంలో గ్రూపులుగా విడిపోయి పార్టీ ప్రతిష్టను రచ్చకీడుస్తున్నారు.


హరీష్‌రావు కంచుకోటలో దయనీయంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి

హరీష్‌రావుకి కంచుకోటలా మారిన సిద్దిపేటలో ముందు నుంచి కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగానే ఉంది. అయినా అక్కడ కాంగ్రెస్‌లో మండలానికో నాలుగైదు వర్గాలుగా విడిపోయి ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూ పోతున్నారు. పదేళ్ల తరువాత కాంగ్రెస్ అధికారంలో వచ్చినా అక్కడి నేతలు హరీష్‌రావుని ధీటుగా ఎదుర్కునే దిశగా పావులు కదపలేకపోతున్నారు. ప్రజల, కార్యకర్తల సమస్యలు పట్టించుకోవాల్సింది పోయి వర్గాలుగా చీలిపోయి నిరంతరం గొడవలకు దిగుతుండడంతో కార్యకర్తలు తలలు పట్టుకోవాల్సి వస్తోందంట. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల పోరు జరగనున్న తరుణంలో ..కలిసికట్టుగా సత్తా చాటాల్సిన సమయంలో విపక్షం బలపడేలా వ్యవరిస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు.

ప్రత్యర్థికి కోవార్టులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలువాయిస్

నిన్న, మొన్నటి వరకు అక్కడ పార్టీలో చెప్పుకోదగ్గ నేతలే లేరు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎవరికి వారు నాయకుల్లా వ్యవహరిస్తున్నారంట. ఉన్న అరకొర నేతల మధ్య గ్రూప్ రాజకీయాలకు మాత్రం కొదవలేకుండా పోయింది. కలసికట్టుగా ప్రత్యర్థిని ఎదుర్కొందామన్న ఆలోచన కంటే, ప్రత్యర్థికి కోవార్టులుగా మారి.. విపక్షం మరింత బలపడేలా అక్కడి కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఎప్పుడు గ్రూపు రాజకీయాలు, వర్గపోరుతో క్యాడర్‌ని ఆగం చేస్తున్నారు అక్కడి నేతలు. నిత్యం ఒకరి పై గొడవలకు దిగటం పరిపాటిగా మారిపోయింది. మొన్నటికి మొన్న స్థానిక నేతలు బాహాబహికి దిగారు. నియోజకవర్గ ఇన్చార్జ్‌గా ఉన్న పూజల హరికృష్ణ, గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి వర్గాల మధ్య ఒక రేంజ్ల ఘర్షణ జరిగింది.

గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ యాత్ర

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో వారి మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామంలో గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రను నిర్వహించారు. ఆ కార్యక్రమం మొత్తం సజావుగానే జరిగింది. యాత్ర ముగించుకొని నేతలు అందరూ సిద్దిపేటకు చేరుకొగానే గొడవ మొదలు అయ్యింది. సిద్దిపేట ఇన్చార్జ్‌కు సమాచారం లేకుండా పార్టీ కార్యక్రమం ఎలా చేస్తారంటూ, పూజల హరికృష్ణ అనుచరులు రఘువర్ధన్ రెడ్డి వర్గీయులతో గొడవకు దిగారు. దాంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి తీవ్ర తోపులాటతో పాటు దాడులకు పాల్పడ్డారు. పూజల హరికృష్ణ వర్గానికి చెందిన వారు.. గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి వర్గంలోని ఓ వ్యక్తి పై సీసాతో దాడి చేయడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి

పోలీసు స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు

ఆ గొడవ చివరికి పోలీసు స్టేషన్ వరకు వెల్లింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు.. ఆ ఇష్యుపై రెండు వర్గాలు కాంగ్రెస్ అధిష్టానానికి పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయంట. ఈ వర్గాల మధ్య పంచాయతీ చివరకు కాంగ్రెస్ సీనియర్ నేత, సిద్దిపేట వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మైనంపల్లి హన్మంతరావు వద్దకు వెళ్లిందట. జరిగిందేదో జరిగింది, దాడికి పాల్పడ్డ వ్యక్తిని బాధితుడికి క్షమాపణ చెప్పాలని సూచించారట మైనంపల్లి. తగ్గేదేలే.. క్షమాపణ చెప్పేదే లే అంటూ హరికృష్ణ వర్గం మొండికేయడంతో మైనంపల్లికి దిక్కుతోచని పరిస్తితి ఏర్పడిందట.. చివరకు స్వయంగా మైనంపల్లి హన్మంతరావు బాధితుడికి స్వయంగా క్షమాపణలు చెప్పారట. ఇకనైనా ఇలాంటి గొడవలను పక్కనపెట్టి కలసికట్టుగా పని చేయాలని మైనంపల్లి సూచిస్తే అందుకు కూడా ససేమిరా అంటున్నారట.

Also Read: వర్మకి కోపం! కారణం ఎవరు?

మైనంపల్లి హన్మంతరావు వద్దకు వెళ్తున్న సిద్దిపేట క్యాడర్

హరీశ్ రావు లాంటి బలమైన ప్రత్యర్థి ఉన్న సిద్దిపేటలో విపక్షంపై ఐక్యంగా పోరాడాల్సింది పోయి సొంత పార్టీ నేతలే బజారున పడుతుండడంతో కార్యకర్తల పరిస్థితి అయోమయంగా తయారైంది. సిద్దిపేట స్థానిక నేతలతో విసిగి వేసారిన కాంగ్రెస్ క్యాడర్, కొత్తగా పార్టీలోకి రావాలనుకుంటున్న వారు ఇక నేరుగా మైనంపల్లి హన్మంతరావు వద్దకు వెళ్తున్నారట. పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తూనే, సిద్దిపేట కాంగ్రెస్ను కోవర్టుల నుంచి కాపాడాలని కోరుతున్నారట.

పార్టీ దుస్థితిపై సీనియర్ కార్యకర్తల ఆవేదన

ఆధిపత్యం కోసం నేతలు కొట్లాడుకోవడం.. నవ్వేటోని ముందు బొక్క బోర్ల పడ్డట్టుగా ఉందని నియోజకవర్గ నికి చెందిన కొందరు కాంగ్రెస్ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ హై కమాండ్ సిద్దిపేట నియోజకవర్గం పై దృష్టి సారించాలని, ఇక్కడ క్యాడర్ ని కాపాడే లీడర్ కావాలని మొరపెట్టుకున్నారు. వర్గాలు విభేదాలతో ఇలాగే నేతలు వ్యవహరిస్తే సిద్దిపేటలో తొందరలోనే కాంగ్రెస్ దుకాణం మూసుకోవడం ఖాయమంటున్నారు . మరి చూడాలి హరీష్‌రావు ఇలాఖాలో పార్టీని కాంగ్రెస్ పెద్దలు ఎలా ప్రక్షాళన చేస్తారో?

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×