Bollywood : సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలకి కొదవేమీ ఉండదు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెడుతూనే ఉంటారు. సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను వెల్లడించినప్పుడల్లా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఇంత దారుణంగా ఉంటుందా ? అనే చర్చ తెరపైకి వస్తూ ఉంటుంది. తాజాగా నటి నవీనా బోలే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. ఓ ప్రాజెక్ట్ కోసం అతన్ని కలిస్తే, బట్టలు విప్పి కూర్చోమన్నాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
అసలేం జరిగిందంటే?
ఇష్క్ బాజ్, మైలే జబ్ హమ్ తుమ్ వంటి షోలతో పాపులర్ అయిన బాలీవుడ్ నటి నవీనా బోలే తాజాగా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హిందీ దర్శకుడు సాజిద్ ఖాన్‌తో తనకు ఎదురైన దారుణమైన సిచ్యువేషన్ గురించి ఆమె మాట్లాడారు. సుభోజిత్ ఘోష్ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజిద్ ఒకసారి తనను తన ఇంటికి ఆహ్వానించి, “బట్టలు విప్పమని” అడిగాడని నవీనా పేర్కొంది.
ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ “నా జీవితంలో నేను ఎప్పుడూ కలవడానికి ఇష్టపడని ఒక భయంకరమైన వ్యక్తి సాజిద్ ఖాన్. అతను మహిళలను అగౌరవపరిచే విషయంలో హద్దులు దాటాడు. 2004 – 2006 టైమ్ లో ఓ ప్రాజెక్ట్ గురించి ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు నేను నిజంగా చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఆపై అతను మీరు మీ బట్టలు విప్పి లోదుస్తులలో ఎందుకు కూర్చోకూడదు ? అని అడిగాడు. మీరు ఎంత సౌకర్యంగా, ప్లెక్సిబుల్ గా ఉన్నారో నేను చూడాలి అనుకుంటున్నాను. నువ్వు వేదికపై బికినీనే వేసుకున్నావు. మరి ఇప్పుడు సమస్య ఏంటి? ఇక్కడ నువ్వు ప్రశాంతంగా, హాయిగా కూర్చుని.. నీలా నువ్వు ఉండు అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు” అంటూ అప్పట్లో జరిగిన షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
డైరెక్టర్ కు నవీనా సమాధానం
ఈ ఊహించని పరిణామంతో నవీనా డైరెక్టర్ తో “నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఉంది. కాబట్టి వెంటనే ఇంటికెళ్లాలి. మీరు నిజంగా నన్ను బికినీలో చూడాలి అనుకుంటే ఇంటికి వెళ్ళి వేసుకుంటాను. అంతేకానీ నేను ఇప్పుడు ఇక్కడ బట్టలు విప్పి కూర్చోలేను” అని చెప్పి, ఏదో ఒకవిధంగా అక్కడి నుంచి బయట పడిందట. అక్కడి నుంచి వెళ్ళాక నవీనాకు అతను కనీసం 50 సార్లు ఫోన్ చేశాడట. కానీ ఆమె ఫోన్ తీయలేదని సమాచారం.
Read Also : ‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్’ మూవీ రివ్యూ
కాగా 2018లో జరిగిన #MeToo ఉద్యమం సమయంలో సాజిద్ ఖాన్ పై చాలామంది అమ్మాయిలు లైంగిక ఆరోపణలు చేశారు. అప్పట్లోనే సాజిద్ ను ట్రోలింగ్ తో ఓ ఆట ఆడుకున్నారు నెటిజన్లు. తాజాగా మరోసారి ఆయనపై విరుచుకు పడుతున్నారు.