Visakha Mayor: ఏపీలో వైసీపీ సిటీ కుర్చీలు కుప్పకూలుతున్నాయి. ఎవరు, ఎప్పుడు ఆ పార్టీ నుంచి జంప్ అవుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్నటివరకు జెడ్పీ వైస్ ఛైర్మన్ పదవులు కాగా, ఇప్పుడు ఏకంగా మేయర్ పీఠాల వంతైంది. తాజాగా విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎట్టకేలకు టీడీపీ కైవసం
సోమవారం ఉదయం 11 గంటలకు విశాఖ మేయర్ ఎన్నిక జరిగింది. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షత మేయర్ ఎన్నికల కార్యక్రమం జరిగింది. కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు హాజరయ్యారు. పీలా శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు మేయర్ గా ఎన్నికైనట్టు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. అందుకు సంబంధించిన పత్రాలను మేయర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా సిటీ నేతలు, కార్పొరేటర్లకు మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈనెల 30 న జరగనుంది. డిప్యూటీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని జనసేన భావిస్తోంది. ఎందుకంటే వైసీపీ నుంచి కొందరు కార్పొరేటర్లు జనసేనలోకి వెళ్లారు. ఆ పార్టీ నేతలు సైతం తమకు డిప్యూటీ మేయర్ ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
జీవీఎంసీగా మారిన తర్వాత తొలిసారి
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు టీడీపీ తరపున మేయర్‌గా పని చేశారు డీవీ సుబ్బారావు. 2005లో కార్పొరేషన్ కాస్త మహా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించింది. 2007లో జరిగిన ఎన్నికల్లో తొలి మేయర్‌గా కాంగ్రెస్ నుంచి పులుసు జనార్దనరావు పని చేశారు.
ALSO READ: చిక్కుల్లో సజ్జల ఫ్యామిలీ.. రేపో మాపో చర్యలకు అంతా రెడీ!
ఆ తర్వాత రాష్ట్ర విభజనతో కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. వైసీపీకి చెందిన హరి వెంకటకుమారి రెండో మేయర్‌గా నాలుగేళ్లు పాటు పని చేశారు. ఇప్పుడు టీడీపీ వంతైంది. విశాఖలో మేయర్ పీఠాన్ని అందుకోవడానికి టీడీపీకి దాదాపు రెండు దశాబ్దాలు పట్టిందన్నమాట.
పీలాకు కలిసొచ్చింది
మొన్నటి ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత వైసీపీకి చెందిన కార్పొరేటర్లలో ఎక్కువ మంది కూటమికి మద్దతు ప్రకటించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగేళ్ల పాటు మేయర్‌పై అవిశ్వాసం ప్రకటించకూడదన్న నిబంధనతో దాదాపు ఏడాది పాటు ఆగారు కూటమి కార్పొరేటర్లు.
టీడీపీని నమ్ముకున్న వ్యక్తుల్లో పీలా శ్రీనివాసరావు ఒకరు. ఐదేళ్ల కిందట జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో పీలా శ్రీనివాసరావును మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది పార్టీ హైకమాండ్. మెజార్టీ లేకపోవడంతో ఆయనకు ఆ పదవి దక్కలేదు. చివరకు పార్టీ అధిష్ఠానం మరోసారి ఆయనకు ఛాన్స్ ఇచ్చింది.
విశాఖ మేయర్ గా పీలా శ్రీనివాసులు ఎన్నిక ఏకగ్రీవం https://t.co/Lzfdr1pstm pic.twitter.com/tMQJHpacT3
— BIG TV Breaking News (@bigtvtelugu) April 28, 2025