Bhogapuram Airport: ఏపీలో రాజకీయాలు భోగాపురం ఎయిర్‌పోర్టు చుట్టూనే తిరుగుతున్నాయి. శనివారం ఎయిర్‌పోర్టు ప్రారంభం ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి ఏపీ విడిపోయిన తర్వాత గ్రాండ్‌గా జరిగిన కార్యక్రమం ఇది. ఇప్పుడు దీని చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. మావల్లే వై‘భోగాపురం’ వచ్చిందని వైసీపీ అంటుంటే.. మావల్లేనని కూటమి ప్రభుత్వం కుండబద్దలు కొడుతోంది. ఈ వ్యవహారంపై శనివారం సాయంత్రం మరోసారి వైసీపీ రియాక్ట్ అయ్యింది. మావల్లే ఎయిర్‌పోర్టు ఓపెన్ అయ్యిందని చెప్పే ప్రయత్నం చేసింది. జరుగుతున్న పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.
దేశంలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులను కేవలం 31 నెలల్లో పూర్తి అయ్యింది కేవలం భోగాపురం ఎయిర్‌పోర్టు మాత్రమే. ఇంత పెద్ద ప్రాజెక్టుని కేవలం తక్కువ సమయంలో పూర్తి చేసిన ఘటన కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. అదీ కూడా రూ. 5 వేల కోట్ల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన-ప్రారంభం రెండూ ఉత్తరాంధ్ర నేతల చేతుల్లో జరిగింది. అశోక్ గజపతిరాజు-రామ్మోహన్‌లకు ఆ క్రెడిట్ దక్కుతుంది. వైభోగాపురం క్రెడిట్ తన తన ఖాతాలో వేసుకునేందుకు ప్రారంభానికి ముందు రోజు వరకు తీవ్ర ప్రయత్నాలు చేసింది వైసీపీ.
2014-19 మధ్య టీడీపీ రూలింగ్ చేసింది. ఆ సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్టు తెరపైకి తీసుకొచ్చింది. దీనిపై అప్పటి ప్రతపక్ష నేత జగన్ చేసిన మాటలు ఇప్పటికీ ట్రోల్ అవుతున్నాయి. అప్పుడు ఏమీ జరగకపోతే ఆనాడు జగన్ ఆ విధంగా ఎందుకు మాట్లాడారన్నది అసలు ప్రశ్న. జగన్ మాటలు ఆడిన వీడియోల్లో ఎర్ర బస్సు రాని ఎయిర్ బస్సా? వైజాగ్ ఎయిర్‌పోర్టులో లీగలు తోలుకుంటున్నారని, భోగాపురం ఎయిర్ పోర్టు అవసరమా? రాబోయేది మా ప్రభుత్వమే.. ఎయిర్‌పోర్టు భూములను వెనక్కి తీసుకుని రైతులకు ఇస్తామని జగన్ చెప్పిన మాటలు ఇప్పటికీ ట్రోల్ అవుతున్నాయి.
2019-24 మధ్యకాలంలో వైసీపీ రూలింగ్‌లో ఉంది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు 2023 మే 3 జగన్ మరొక శంకుస్థాపన చేశారు. అదీ.. ఎన్నికలకు మరో ఏడాది ముందు మాత్రమే. ఆల్రెడీ చేసిన శంకుస్థాపనను రెండోసారి చేసింది. టీడీపీ ప్రభుత్వంలో జీఎంఆర్‌తో జరిగిన అగ్రిమెంట్‌ను వైసీపీ ఎందుకు క్యాన్సిల్ చేసింది? మళ్లీ ఎందుకు పునరుద్ధరణ చేసింది? వైసీపీ హయాంలో దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేదు? ఇదీ అసలు పాయింట్స్.
వైసీపీ దీనికి రకరకాల కుంటు సాకులు చెప్పింది. రెండేళ్లు కొవిడ్ నేపథ్యంలో ఆలస్యమైందని వాదన తెరపైకి తెచ్చింది. అసలు విషయానికి వద్దాం. కాకినాడ పోర్టు వద్ద జీఎంఆర్ భూములు ఉన్నాయి. ఆయా భూములను ఓ ఫార్మా కంపెనీకి ఇస్తే.. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను జీఎంఆర్‌కు ఇస్తామని మెలిక పెట్టిందట అప్పటి వైసీపీ ప్రభుత్వం. భూముల వాటా బదిలీ తర్వాత జీఎంఆర్ సంస్థతో మళ్లీ అగ్రిమెంట్ చేసుకుందని రాజకీయ విశ్లేషకులు కుండ బద్దలు కొట్టారు. అదీ కూడా పీపీపీ మోడల్‌లో అగ్రిమెంట్ జరిగింది.
ఇదీ విశ్లేషకుల మాట
పీపీపీ మోడల్‌ను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో చేస్తుంటే తీవ్రంగా వ్యతిరేకించింది. మరి ఎయిర్‌పోర్టు నిర్మాణం పీపీపీ మోడల్‌లో వైసీపీ ఎందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుందని సదరు విశ్లేషకుల ప్రశ్న. వైసీపీ హయాంలో విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం ఒక్క రోడ్డు కూడా వైసీపీ పూర్తి చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏడింటిలో నాలుగు పూర్తి చేసింది.
భోగాపురం ఎయిపోర్టు ప్రారంభానికి ముందు రోజు వరకు క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేసింది వైసీపీ. జైలులో ఉన్న సీదిరి అప్పలరాజును ఓదార్చడానికి వెళ్లిన జగన్.. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు వాహనంలో వెళ్లారు. నార్మల్‌గా విశాఖ నుంచి శ్రీకాకుళం జర్నీ గంటన్నర లేదా రెండు గంటల్లో చేరుకోవచ్చు. అలాంటిది జగన్ కాన్వాయ్ దాదాపు ఆరు గంటలపాటు సాగింది. చివరకు జైలు వద్దకు వెళ్లేసరికి ములాఖత్ సమయం ముగిసిపోయింది. ములాఖత్ సమయం వైసీపీ నేతలకు బాగా తెలుసని, సాయంత్రం ఐదు దాటిన తర్వాత జైలుకి వెళ్లడం ఏంటన్నది విశ్లేషకుల వాదన. అప్పలరాజు కొడుకును పక్కన పెట్టి మాట్లాడి అక్కడి నుంచి జగన్ వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు జగన్ వెంట ఉండే ప్రజలు.. తిరుగు ప్రయాణంలో ఎక్కడా కనిపించలేదు. ఇదండీ మన వైసీపీ రాజకీయం. పార్టీలు అభివృద్ధిలో పోటీ పడాలి, మాటల రాజకీయాల్లో కాదు.
ALSO READ: పోలవరం జిల్లాలో గోదావరి ఉగ్రరూపం.. ఆ 4 రాష్ట్రాల సరిహద్దులు బంద్!