E-Paper
Advertisement

ఈ వింత కెమెరాతో ఫోటో తీస్తే దారుణమైన చావు… గుండె జారిపోయే డార్క్ హర్రర్ మిస్టరీ

ఈ వింత కెమెరాతో ఫోటో తీస్తే దారుణమైన చావు… గుండె జారిపోయే డార్క్ హర్రర్ మిస్టరీ
Advertisement

Supernatural Horror Thriller: ఒక పాత కెమెరా చేతికి దొరికితే ఎవరైనా సరదాగా ఫోటోలు తీస్తారు. కానీ ఆ ఫోటోలో కనిపించే నల్లటి నీడే ఆ వ్యక్తి మరణానికి సంకేతమైతే ? ఫోటోను చింపేస్తే మనిషి శరీరానికే గాయం అవుతుందని తెలిస్తే ? అసలు ఆ కెమెరాలో ఉన్న శక్తి ఏంటి ? దాని వెనుక దాగిన రహస్యం ఏమిటి ? స్నేహితులందరినీ ఒక్కొక్కరిగా వెంటాడుతున్న ఆ అదృశ్య శక్తి నుంచి ఎవరు తప్పించుకున్నారు ? ఇలాంటి ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సూపర్‌ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘పోలరాయిడ్’ (Polaroid). మరి ఈ హర్రర్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

హైస్కూల్‌ లో చదువుకుంటూనే యాంటిక్ షాప్‌ లో పని చేసే బర్డ్ ఫిచర్‌ కు ఆమె స్నేహితుడు టైలర్ ఒక పాతకాలపు పోలరాయిడ్ కెమెరాను బహుమతిగా ఇస్తాడు. దాని గురించి పెద్దగా పట్టించుకోని బర్డ్… సరదాగా టైలర్ ఫోటో తీస్తుంది. కానీ ఆ ఫోటో బయటకు వచ్చిన తర్వాత ఆమెకు వింతగా అనిపిస్తుంది. టైలర్ వెనుక ఒక భయంకరమైన నల్లటి నీడ కనిపిస్తుంది. అదే రాత్రి టైలర్ అనూహ్యంగా దారుణంగా హత్యకు గురవుతాడు. టైలర్ చనిపోయిన తర్వాత ఫోటోలో కనిపించిన ఆ నీడ కూడా మాయమవుతుంది. దీంతో బర్డ్‌ కు కెమెరా, టైలర్ మరణం మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానం మొదలవుతుంది.

Advertisement

ఇంతలో బర్డ్ తన స్నేహితులతో కలిసి తీసుకున్న గ్రూప్ ఫోటోను పరిశీలిస్తుంది. అందులో కూడా అదే నల్లటి నీడ కనిపిస్తుంది. ఆశ్చర్యకరంగా ఆ నీడ ఒక్కొక్కరి వెనుకకు మారుతూ ఉంటుంది. ఫోటోలో ఎవరి వెనుక ఆ నీడ కనిపిస్తుందో… తర్వాతి ప్రమాదం వాళ్లకే ఎదురవుతుందని బర్డ్ గుర్తిస్తుంది. స్నేహితులు ఆ ఫోటోలను నాశనం చేయడానికి ప్రయత్నించినా సమస్య మరింత భయంకరంగా మారుతుంది. ఫోటోకు జరిగే నష్టం నిజ జీవితంలో ఉన్న వ్యక్తిపై ప్రభావం చూపుతుంది. దీంతో ఈ కెమెరా వెనుక ఏదో శక్తి ఉందని వారికి అర్థమవుతుంది. కానీ ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ? ఎందుకు ఫోటో తీసిన వ్యక్తులనే టార్గెట్ చేస్తోంది ? అనే ప్రశ్నలు వెంటాడుతూనే ఉంటాయి.

ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో బర్డ్‌కు కెమెరా గతం గురించి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. రోలాండ్ సేబుల్ అనే వ్యక్తి, అతని కుమార్తె రెబెక్కా విషాదం, స్కూల్‌లో జరిగిన కొన్ని దారుణ సంఘటనలు… ఇలా ఒక్కో విషయం బయటపడుతున్న కొద్దీ ఈ కెమెరా వెనుక ఉన్న భయంకరమైన కథ కూడా స్పష్టమవుతుంది. ఇప్పుడు బర్డ్ ఆలోచన ఒక్కటే… తనతో పాటు ఫోటోలో చిక్కుకున్న స్నేహితులను ఎలా కాపాడుకోవాలి ? ఆ నల్లటి నీడ నుంచి తప్పించుకోవడానికి ఉన్న మార్గం ఏంటి ? కెమెరాను నాశనం చేస్తే శాపం ఆగిపోతుందా… లేక దాని వెనుక ఉన్న శక్తిని ఎదుర్కోవాల్సిందేనా ? చివరికి బర్డ్ ఈ మిస్టరీని ఛేదించగలిగిందా ? అసలు ఆ పోలరాయిడ్ కెమెరాలో దాగి ఉన్న శక్తి ఎవరిది ? అనేది తెలియాలంటే సినిమాను చివరి వరకూ చూడాల్సిందే.

తెలుగులో ఉందా ?

Advertisement

‘పోలరాయిడ్’ తెలుగు డబ్బింగ్‌ ఓటీటీలో అందుబాటులో లేదు. ఈ సినిమాను Apple TV ఓటీటీలో ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్‌ లోనే చూడాల్సి ఉంటుంది.

Read Also: పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

Tags

Related News

పదేళ్ల తర్వాత మళ్లీ కలిసే పాత ప్రేమికులు.. కట్ చేస్తే ఊహించని స్కాండల్‌లో భర్త అడ్డంగా బుక్

అఫీషియల్ యశ్ టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

OTT Movies : ఓటీటీలోకి ‘ఇరుముడి’.. ఆ 6 డోంట్ మిస్..

నెట్‌ఫ్లిక్స్ ప్రియులకు పండగ… ఒకే రోజు ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్… అన్నీ తెలుగులోనే

ఈ వారం ఓటీటీని షేక్ చేస్తున్న 5 క్రేజీ మలయాళం సినిమాలు, సిరీస్‌లు ఇవే… తెలుగులోనూ స్ట్రీమింగ్

తేనె కోసం కొట్టుకుచచ్చే బిజినెస్ మ్యాన్లు… ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎక్కడా చూసుండరు

క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం… కట్ చేస్తే వరల్డ్ పాపులర్ చెఫ్

Big Stories

Advertisement
×