Podarillu Today Episode august 2nd: కేశవ ఇలా చేయడం వల్ల నేను చాలా బాధపడిపోతున్నాను అని చక్రి బయటకు వెళ్లి ఒంటరిగా ఆలోచిస్తూ ఆవేశ పడిపోతూ ఉంటాడు. కేశవా ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావడం లేదు అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే బయటకు వచ్చిన కేశవ అని ఏంట్రా నువ్వు చేసింది నిన్ను కోరి వచ్చిన ఆ అమ్మాయిని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు. మీరిద్దరూ ఏదైనా గొడవ పడ్డారా ఎందుకు నువ్వు ఇప్పుడు పెళ్లి వద్దు అంటున్నావు అని అడుగుతాడు.. అయితే నేను పెళ్లి చేసుకునే నా సంతోషాన్ని చూసుకుంటే అన్నయ్య పెళ్లి ఎలా అవుతుంది అని నేను ఆలోచించాను రా అందుకే ఈ పెళ్లి వద్దు అని అనుకున్నాను అని కేశవ అంటాడు.. ఇప్పటికే నువ్వు పెళ్లి చేసుకుందామని అన్నయ్యకి పెళ్లి కాదు అని అందరూ అంటున్నారు ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకుంటే ఆ మాటే నిజం అవుతుంది అని కేశవ అనగానే చక్రి ఎమోషనల్ అయిపోతాడు.. నువ్వు ఇంత దూరం ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదురా.. నువ్వు నిజంగా గ్రేట్ రాణి చక్రి కేశవ పై ప్రశంసలు కురిపిస్తాడు..
కేశవ చెప్పిన మాటకి చక్రీ ఒకవైపు బాధపడుతున్న సరే మరోవైపు వాడు చేసింది కరెక్టే అని మనసులో అనుకుంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య కోసమే ఇదంతా చేశాడు కదా అని అడుగుతుంది.. ఇదంతా మీకు ఎలా తెలుసు అని చక్రి అనగానే… కోరి వచ్చిన అమ్మాయిని మళ్లీ పంపించిన వ్యక్తి అంటే కచ్చితంగా వాళ్ళ అన్నయ్య గురించి ఆలోచించి ఉంటాడు అని నేను అనుకున్నాను అని మహాలక్ష్మి అంటుంది.. వాళ్ళ అన్నయ్య ఎంత అదృష్టవంతుడు కదా అని మహాలక్ష్మి అంటుంది.. ఇలాంటి తమ్ముడు దొరకడం ఆయన అదృష్టం.. అంతే కాదు శైలు కూడా చాలా అదృష్టవంతురాలు తనని అర్థం చేసుకొని అన్ని విధాలుగా తనకి సాయంగా ఉంటున్న భర్త దొరకాలి అంటే నిజంగా అదృష్టం ఉండాలి అని మహా అంటుంది.. కేశవ నీ పొగిడేస్తున్న మహాని చూసి చక్రి చాలా ఫీల్ అవుతాడు.. నేను మీకోసం చాలా త్యాగం చేశాను కదా మీరు ఎందుకు నా గురించి ఆలోచించరు అని చక్రి అనగానే మన కథ వేరు లెండి అని అంటుంది..
కేశవ ఇదంతా చేసింది మాధవ కోసమే అని తెలుసుకున్న మాధవ్ చాలా బాధపడిపోతాడు.. నాకోసం నీ ఇష్టాలను ఎందుకురా కాదనుకుంటున్నావు అని అంటారు.. నేను మీకు ఏమి ఇచ్చాను రా.. నాలుగు పూటలా భోజనం పెట్టడం మాత్రమే కదా మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను కదా.. అని మాధవ్ ఎమోషనల్ అయిపోతాడు.. అయితే ముందు మాధవ్ పెళ్లి జరిగితేనే అందరికీ పెళ్లి జరిగిపోతుంది అని అనుకుంటారు.. ఇక కేశవ కర్ణ తో పాటుగా మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక మంచి సంబంధం చూస్తే బాగుంటుంది అని అనుకుంటారు.. మ్యాట్రిమోనీలో ఒక సంబంధం గురించి మాట్లాడాలి అనుకున్న ఈ లోపల చక్రి నేను ఆల్రెడీ ఒక సంబంధం గురించి మాట్లాడాను. ఆయన మళ్ళీ కాల్ చేసి చెప్తాను అని అన్నారు అని అంటాడు.. ఆ మాట వినగానే మహాలక్ష్మి ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశారు అని తనని పొగడ్తలతో మెచ్చుకుంటుంది..
ఇవాళ పెళ్లిచూపులు పెట్టుకున్నామని మహాలక్ష్మి చెప్పగానే చక్రి వాళ్లకు ఫోన్ చేసి పెళ్లిచూపులకి రమ్మని చెప్తాడు. అయితే మాధవ్ ని పెళ్లిచూపులు కోసం రెడీ చేయాలి అని చక్రి కన్నా మా మహాతో చెప్తాడు. ఇక చక్రి చెప్పడంతో ఇద్దరు కూడా మాధవ్ని రెడీ చేయాలి అని అనుకుంటారు.. పెళ్ళికొడుకుగా మాధవిని చూసి చాలా సంతోషంగా ఉంటారు.. అన్నయ్య నువ్వు చాలా అందంగా ఉన్నావు ఖచ్చితంగా పెళ్లికూతురికి నచ్చుతావు అని అనగానే మాధవ్ ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది రా అని అంటాడు.. ఇక పెళ్లి చూపులు కి వచ్చినా అందరూ మాధవిని చూసి చాలా బాగున్నాడు అబ్బాయి సౌమ్యుడు అంటూ పొగిడేస్తారు.. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారు అని మహాలక్ష్మి అంటే ముందు మా పంతులుగారు మాట్లాడతారు అని వాళ్ళు అంటారు.. మాట వినగానే మహాలక్ష్మి షాక్ అవుతుంది..
పంతులుగారు మాధవ జాతకం చూసి అతనికి పెళ్లి గండం ఉంది. అంతే కాదు ఇంటికే పెళ్లి గండం ఉంది అని చెప్పగానే ఇంట్లో ఇవాళ అందరూ షాక్ అవుతారు. ఇంట్లో ఏ అబ్బాయి పెళ్లి చేసుకున్న కూడా వాళ్ళ కాపురం మూడు నాలుగు ముచ్చటగానే ఉంటుంది..అని పంతులు చెప్పగానే అందరూ ఆలోచనలో పడతారు. ఇంట్లో ఆడవాళ్లు ఎక్కువ రోజులు ఉండలేరు మీరు ఏంటి నుంచి మారిపోతే తప్ప మీకు మంచి జరగదు అని చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి టెస్ట్ లో పాస్.. ఫ్యామిలీ ట్రిప్.. బాబు కోసం దొంగలు ప్లాన్..